నాకు అమూల్యమైన స్నేహితులారా, నేడు దేవుడు మీ జీవితములో దీపమును వెలిగించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:28వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును'' అన్న వచనములో చెప్పబడిన ప్రకారం ఈ లోకమంతయు పూర్తిగా చీకటితో నిండియున్నది. పాపము యొక్క అంధకారము, పేదరికము యొక్క అంధకారము, రోగము యొక్క అంధకారము, దుష్టప్రజలు అనబడే అంధకారము, అపవాది ద్వారా కలిగించబడే అంధకారము, ఇంకను అనేకమైన అంధకారములు. కానీ, యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగై యున్నాడనియు, ఆయనను వెంబడించువాడు, చీకటిలో నడువక, జీవపు వెలుగు కలిగియుండునని చెప్పిబడియున్నది. యేసును వెంబడించండి, ఆయన ఈ లోకమునకు వెలుగై యున్నాడని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, మీరు చీకటిలో ఉన్నట్లయితే, ఆయన మీ జీవితములో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాడు.

నా ప్రియులారా, ఆలాగుననే, నేడు మీరు యేసును వెంబడించండి, ఆయన ఈ లోకమునకు వెలుగై యున్నాడు. ఆయన మీ జీవితములో దీపమును వెలిగించువాడు. లోకపు అంధకారములో వెలుగుచేత మిమ్మును ప్రకాశింపజేయుటకు సమర్థుడై యున్నాడు. కనుకనే, అంధకారములో ఉన్న మీ జీవితమును వెలుగుగా ప్రకాశిస్తుంది. మీరు దేవుని వెలుగును మీలో కలిగియుండెదరు. భయపడకండి, మీరు యేసు యొక్క బిడ్డలైన యున్నారు. నేడు మీలో ఉన్న ప్రతి అంధకారము యేసు నామములో మిమ్మును విడిచిపెట్టి వెళ్లిపోతుంది. కనుకనే, భయపడకండి.

మధురై నుండి ఇళయరాణి అను సహోదరి తన సాక్ష్యమును ఈ విధంగా తెలియజేశారు. 2013వ సంవత్సరములో వారికి వివాహమైనది. భార్యభర్తలకు ఒక ఆడపిల్ల అనుగ్రహింపబడినది. కానీ, వివాహము జరిగిన 2 సంవత్సరములకే భర్త చనిపోయాడు. భయంకరమైన విచారము ఆ యొక్క భార్య హృదయములోనికి వచ్చినది. అయినప్పటికిని, ఆమె తన తల్లితో కూడ కలిసి నివసించుచుండెను. ఆమె తల్లి తనను యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు తీసుకొని వెళ్లారు. ప్రతి శనివారము ప్రార్థనా గోపురములో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దేవుడు వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఎంతగానో కోరుకున్నాడు. భర్తను కోల్పోయిన యౌవనస్థురాలైన ఈ బిడ్డకు జీవనోపాది ఏ మాత్రము ఏదీయు కూడ లేదు. కానీ, ఆమె పట్టభద్రురాలు. ప్రభుత్వ ఉద్యోగము కోసము ప్రయత్నము చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఉద్యోగము ప్రయత్నము చేయుటకు కూడ వారి దగ్గర డబ్బులేదు. ప్రతిరోజు కన్నీరు కార్చేవారు. కన్నీటి మయముతో వారి జీవితమును గడిపేవారు. కానీ, ప్రతిరోజు కూడ ఆమె యొక్క ప్రార్థనా విన్నపములను విన్నవించి, ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుటకు ప్రార్థనా గోపురమునకు వెళ్లుచుండెను. 32 సంవత్సరాలు వయస్సు రావడం వలన ప్రభుత్వ ఉద్యోగమునకు ప్రయత్నము చేయుటకొరకైన ఆఖరి సమయము అది. అయితే, ప్రార్థన తరువాత ఆమెకు గొప్ప విజయము లభించినది. ప్రభుత్వ బ్యాంకులో ఆమెకు ఉద్యోగము లభించినది. ఈ రోజున ఆమె 40 వేల రూపాయల వేతనము పొందుకుంటుంది. ఇది ఎంత గొప్ప ఆనందము కదా. అవును, నా ప్రియులారా, ఆమె అంధకారమునకు దేవుడు వెలుగును తీసుకొని వచ్చియున్నాడు. నేడు ప్రతి అంధకారమును కూడ దేవుడు వెలిగింపజేయువాడై యున్నాడు. అవును, ఆయన మీకును ఆలాగున జరిగిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

 

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము నీ దైవీకమైన వెలుగు మీద నిరీక్షణను మరియు నమ్మకంతో నిండిన హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, పాపం, పేదరికం మరియు నిరాశ నుండి మమ్మును నడిపించే దీపంగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ ప్రకాశవంతమైన సన్నిధితో మా జీవితంలోని ప్రతి మూలన ఉన్న అంధకారమును తొలగించి, మమ్మును ప్రకాశింపజేయుము. దేవా, మా యొక్క ప్రతి మూలన ఉన్న ప్రతి నీడను చెదరగొట్టి, నీ ప్రేమ మరియు దయ గలిగిన వెలుగుతో మమ్మును నింపుము. యేసయ్యా, ఈలోకమునకు వెలుగుగా ఉన్న నిన్ను వెంబడించడానికి మమ్మును బలపరచుము మరియు నీ యొక్క తేజస్సు మా జీవితంలో ప్రకాశింపజేయుము. దేవా, మా చీకటి క్షణాలలో వెలుగు మరియు రూపాంతరము కొరకు మేము మా భారాలను నీ సన్నిధిలో ఉంచుచున్నాము. దేవా, మా యొక్క ప్రతి చీకటిని అధిగమించగల నీ శక్తిపై మేము విశ్వసిస్తున్నందున, నీ వెలుగుచేత మమ్మును నూతన ప్రారంభానికి నడిపించునట్లుగాను మరియు మా ఆనందాన్ని మరల పునరుద్ధరించునట్లు చేయుమని సమస్త, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.