నా ప్రశస్తమైన స్నేహితులారా, ఈ నూతన మాసములో అడుగు పెట్టిన మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోవుచున్నాడు. ఒకవేళ మీరు ఈ విధంగా చెబుతున్నారా? " నేను ఎంతో కష్టపడి పని చేసియున్నాను. గానీ, నా పనికి సంబంధించిన ప్రతిఫలమును పొందలేకపోవుచున్నాను'' అని అనుకుంటున్నారా? 'నాకు అస్సలు అభినందన లేదు, నాకు ఏ మాత్రము కూడా వృద్ధి లేదు, నాకు పదోన్నతి లేదు, నా యొక్క సాగు భూమిలో వస్తున్న రాబడి, నాకు ఏ మాత్రము సరిపోవుట ము లేదు, నేను కష్టపడి పనిచేయుచున్నాను కానీ, వ్యాపారములో ఎటువంటి లాభము కూడా రావడము లేదు. నేను కష్టపడి చదువుచున్నాను గానీ, ఏ మాత్రము ప్రతిస్పందన ఫలితాలు నాకు కలుగటములేదు అని అంటున్నారా?' కానీ, ప్రభువు మిమ్మును చూచి ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ' నేను ఇకమీదట నుండి మీ చేతి పనిని ఆశీర్వదించబోవుచున్నాను మరియు మీరు చేయునదంతయు వర్థిల్లజేయుదును అని' ప్రభువు మీకు తెలియజేయుచున్నాడు. కనుకనే, నేటి దినము వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 3:10వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు'' అని వ్రాయబడియున్నది. అవును, మీరు నీతిమంతులుగా ఉండి ఉన్నారా? మీరు ప్రజల యెదుట మరియు దేవుని యెదుట నీతిమంతులుగా ఉన్నారా? మీ ఆత్మలో నీతిమంతులుగా ఉన్నారా? అయితే, దేవుడు మిమ్మును ఘనపరుస్తాడు, ఇకమీదట నుండి మీకు సమస్తమును సక్రమముగా జరుగుతుంది. మీ పనుల ప్రయాసకు సంబంధించిన ప్రతిఫలమును మీరు భుజించెదరు. మీరు చేయునదెల్లను కూడా వర్థిల్లుతుంది. అవును, ఇందుకోసమే నేడు దేవుని కృప మీ మీదికి వస్తుంది. బైబిల్ నుండి సామెతలు 12:14వ వచనములో చూచినట్లయితే, "ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును'' అని వ్రాయబడియున్నది. ప్రతి ఒక్కరు కూడా పని చేయువారుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అనేకమంది పని చేయకుండా, ఎన్నో మాటలు చెబుతుంటారు. కానీ, వారేమో ఫలితాలు రావాలని ఎదురుచూస్తుంటారు. అయితే, దేవుడు మీరు పనిచేయాలని కోరుచున్నాడు. అందుకే 1 థెస్సలొనీకయులకు 4:12వ వచనమును చూచినట్లయితే, "మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము'' ప్రకారము మీరు పరుల జోలికి పోకుం డా, మీ చేతులతో పని చేయండి, మీ సొంతకార్యములను జరుపుకొనుటకు ఆశకలిగి యుండండి. అప్పుడు మీరు చేయు ప్రతి కార్యములలో ఫలితములను పొందుకుంటారు అని లేఖనములో వ్రాయబడియున్నది.

నా ప్రియులారా, దేవుడు ప్రతి దినము మీ పట్ల ఒక ఉద్దేశమును కలిగియున్నాడు. యేసు " నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా! అని చెప్పిన రీతిగా, " పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; ఎందుకనగా, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయజాలడు '' అని ఆయన సెలవిచ్చినట్లుగానే, మీ సొంత కార్యములను మీద శ్రద్ధలేకుండా, మీరు పగలున్నప్పుడు పని చేయలేనప్పుడు, ఆ విధంగా కూడా అంధకారము వచ్చినప్పుడు మీరు ఏ పనిని కూడా చేయజాలరు. యేసు ప్రతి ఉదయకాలమున ప్రార్థించి, దేవుని సన్నిధిని వెదికాడు. ఆలాగుననే, యేసు, 'ప్రభువా, ఈ రోజు నా కొరకు నీ పని ఏమై యున్నదని?' ప్రార్థించాడు. ఆలాగుననే, మీరు కూడా ప్రతి ఉదయమున ప్రార్థించి, 'ప్రభువా, ఈ రోజు మా కొరకు నీ పని ఏమై యున్నదని?' అని అడిగినట్లయితే, సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు దానిని తెలియజేసినప్పుడు, మీరు దానిని ఒక పట్టికగా వ్రాసుకొని, దానిని జరిగించడానికి ఆయన కృపను కోరుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ మీకు శక్తినిస్తుంది. ఈ ఉదయకాలమున మీకు వాక్యమును బోధించుటకు తెల్లవారు జామున 2:50 గంటలకు దేవుని వెదకడానికి నేను ఉదయాన్నే లేచాను మరియు ఆయన నా జీవితానికి, నా కుటుంబానికి, మన సంస్థలకు - యేసు పిలుచుచున్నాడు, కారుణ్య మరియు సీషా మరియు ప్రార్థన కోరుకునే ప్రజలందరికి కొరకు నడిపింపును నాకు దేవుడు దయచేస్తాడు. 'ఒంటరియైనవాడు వేయిమంది అగును, ఎన్నికలేనివాడు బలమైన జనము అగును' అని చెప్పబడినట్లుగానే, ఈరీతిగా, ఇట్టి ఆశీర్వాదము మీ మీద కూడా దిగివస్తుంది. కనుకనే, మీరు మౌనముగా ఉండే జీవితమును గడపండి. మీ చేతులతో పనిచేయండి. నేను ఒకసారి ఒక చీరల దుకాణంలో గమనించాను, చాలా మంది సిబ్బందిలు పనిలేకుండా నిలబడి ఉన్నప్పటికిని, ఇద్దరు మాత్రము చీరలను చూపించుచున్నారు. మరొక ఇద్దరు చీరలను తీసుకొని వచ్చుచుండెను. అయితే, ఒక సూపర్‌వైజర్ వచ్చుట నేను చూశాను, ఆ సూపర్‌వైజర్ నిశ్శబ్దంగా తిరస్కరించిన చీరలను చాలా జాగ్రత్తగా, బంగారంలాగా మడతపెట్టడం ప్రారంభించాడు. ఉదాహరణంగా, ఆమె ప్రేరణ పొంది ఆ పనిని చేయుట ద్వారా, ఇతర ఉద్యోగులు కూడా పని చేయుటకు ప్రారంభించారు మరియు తొలగించబడిన చీరను కొనుగోలు చేయునట్లు చేసినది. ఆమె ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదు, తన చేతులతో పనిచేసింది, అయితే, అమ్మకం జరిగింది మరియు ప్రతిఫలము తరువాత వచ్చింది. నా ప్రియులారా, మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి, మాట్లాడటం మానేసి, ప్రార్థన చేయుటకు ప్రారంభించండి, ఆ తర్వాత ప్రేమ, అభిరుచి మరియు పరిశుద్ధాత్మ శక్తితో పని చేయండి. అప్పుడు, మీరు ఏమి చేసినా అది అభివృద్ధి చెందుతుంది.

నా ప్రియులారా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? బైబిల్‌లో కీర్తనలు 128:1-2 వ వచనములు ఇలాగున చెబుతున్నాయి, "యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును'' అని వ్రాయబడిన ప్రకారం ప్రభువునందు భయభక్తులు కలిగి సమస్తమును చేయుము, అప్పుడు మీ ఫలము సంతోషకరముగా ఉంటుంది. బైబిల్‌లో యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి యుండెను. కానీ, అతని మీద నిందారోపణ మోపి చెరసాలలో వేయబడినప్పుడు కూడా అతడు మౌనముగా ఉండెను. అయినప్పటికీ, అతను దేవుని ఘనపరచాడు. కాబట్టి అతను చేసిన ప్రతిదీ అభివృద్ధి చెందింది. చివరికి, అతను దేశాన్ని నడిపించడానికి అధికారిగా ఉన్నత స్థానమునకు హెచ్చింపబడ్డాడు. ఒకవేళ మీ మీద దోషారోపణలు రావచ్చును, కానీ మీరు దేవునికి భయపడండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. బైబిల్‌లో సామెతలు 31:10-31వ వచనములలో చూచినట్లయితే, " గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది... అమె చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును'' అని చెప్పినట్లుగానే, మార్తవలె మీరు ఫిర్యాదు చేయకుండా, యేసు పాదాల వద్ద కూర్చున్న మరియవలె ఉత్తతమమైన దానిని ఎంచుకొని మౌనంగా ఉండండి. నా ప్రియులారా, నేడు మీరు దేవుని యెదట మీ హృదయాన్ని కుమ్మరించండి, ఇతరులను ప్రేమించండి, అప్పుడు ఆయన మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు మిమ్మల్ని ధన్యులు అని పిలుస్తారు మరియు మీ ఇల్లు ఘనపరచబడుతుంది.

చివరగా, బైబిల్‌లో యెషయా 65:19-24వ వచనములలో చూచినట్లయితే, ఈలాగున ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు, " నా జనులను గూర్చి హర్షించెదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు'' ప్రకారం మీ ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం లేదా వ్యాపారం - అన్నీ అయిపోయాయని భావించకండి, కానీ ప్రభువును ప్రార్థించండి. ఆయన ఇలా అంటన్నాడు, " వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను'' అని చెప్పినట్లుగానే, నా ప్రియులారా, మీ జీవితాన్ని మరల ప్రభువులో నిర్మించుకోండి మరియు మీ చేతుల పనిని ఆనందించండి. మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఈ కృపను మీకు ఇవ్వడానికి ప్రభువు హస్తం ఇప్పుడే మీపైకి దిగివస్తుంది. ప్రార్థనా జీవితాన్ని మరియు కష్టార్జితమైన జీవితాన్ని గడపండి. ప్రభువుకు భయపడండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి, మీ చేతులతో పని చేయండి. అందరినీ ప్రేమించండి. మరియు ఈ నూతన మాసములో మీ కష్టార్జితమునకు ప్రతిఫలాన్ని మీరు అనుభవించి, ఈ నూతన మాసమంతయు ఆనందించెదరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఈ మసమంతయు దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, ఈ నూతన మాసమునకు మరియు మా చేతుల పనిని ఆశీర్వదిస్తానని నీవు చేసిన ప్రేమపూర్వక వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, మేము ఫలించనట్లు మరియు నిరుత్సాహంగా అనిపించినప్పటికిని, మేము నీ యొక్క మార్పులేని వాగ్దానముపై మా నమ్మకాన్ని ఉంచునట్లుగా కృపను దయచేయుము. దేవా, మమ్మును దేవుని యందు భయభక్తులతో నింపుము. ప్రభువా, నీ మార్గాలలో నడవడానికి మాకు బలం, కృప మరియు అభిరుచిని అనుగ్రహించుము. దేవా, నీ పరిశుద్ధాత్మచేత దయచేసి మమ్మును ప్రతిరోజూ నడిపించుము. యేసయ్యా, నీకున్న మా పట్ల ఉద్దేశ్యాన్ని మాకు చూపించుము మరియు దానిని ఆనందంగా నెరవేర్చడానికి మమ్మును శక్తివంతులనుగా చేయుము. దేవా, మా కష్టార్జితమునకు ప్రతిఫలం మీ మంచితనానికి సాక్ష్యంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మేము ఇతరులను ప్రేమించడానికి, నీకు సేవ చేయడానికి, ప్రార్థించడానికి, నమ్మకంగా పనిచేయడానికి మరియు మా యొక్క ప్రతిఫలాన్ని పొందటానికి మాకు సహాయం చేయుము. దేవా, మా యింటివారు మాకు సంబంధించిన ప్రతి వారు కూడా మమ్మును ధన్యులని ఘనపరుచునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.