యేసు పిలుచుచున్నాడు పత్రిక

 

అంతరంగమును ఆశీర్వదించే మన్నా

 

"గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు'' (కీర్తనలు 147:3)

 

యేసు పిలుచుచున్నాడు పత్రికా పరిచర్య ప్రజలకు అవసరమైన సమయంలో వారికి పరిచర్య చేయడానికి సత్య వాక్యాన్ని సరిగ్గా విభజిస్తుంది.

మే నెల 1973వ సంవత్సరములో ప్రారంభమైనప్పటి నుండి యేసు పిలుచుచున్నాడు పత్రికా పరిచర్య ఎంతగానో అభివృద్ధి చెందియున్నది మరియు దేవుని మహిమ కొరకు ఈ మే 2024కి 51వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నది. ఈ పత్రిక (మ్యాగజైన్)లో పురుషులకు, స్త్రీలకు, యువతకు మరియు పిల్లల కొరకు దినకరన్ కుటుంబము వారు పంచుకున్న దేవుని వాక్యం, పరిచర్య సంఘటనల నవీకరణలు, ఆశ్చర్యపరిచే సాక్ష్యాలు, జీవిత సమస్యలపై ఉన్న ప్రశ్నలకు బైబిల్ దృక్పథంతో కూడిన జవాబులు మరియు బైబిల్ క్విజ్ కలవు. ఈ పత్రికా (మ్యాగజైన్) పరిచర్య ద్వారా మేము 3 మిలియన్ల కంటే ఎక్కువ మందిని చేరుకొనగలిగియున్నాము

ప్రస్తుతమున్న కాలంలో, పోస్టల్ సేవ మూసివేయబడినప్పుడు, మా పరిచర్యలో ఉన్న భాగస్థులందరికి మా యేసు పిలుచుచున్నాడు పత్రికను ఈమెయిల్ ద్వారా పంపడం ప్రారంభించాము. ఈ పత్రిక మా వెబ్‌సైట్‌లో కూడా 6 భాషలలో అందుబాటులో కలదు. మీరు ఈ దిగువన ఇవ్వబడిన లింక్‌లో మీకు నచ్చిన భాషలో ఈ పత్రికను చదవవచ్చును.

యేసు పిలుచుచున్నాడు పత్రిక ద్వారా ఒక ప్రియ సహోదరి ఏలాగున ఆశీర్వదింపబడినదో ఇక్కడ చూడండి:
వాక్యము ద్వారా తాకబడినది

నేను నా జీవితములో కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. అటువంటి పరిస్థితుల ద్వారా నేను ఊపిరి పీల్చలేనంతగా మునిగిపోవుచున్న సమయములో, యేసు పిలుచుచున్నాడు పత్రికను చూశాను. ఫిబ్రవరి నెల సంచికలో యువత విభాగంలో ఇవ్వబడిన సహో. స్టెల్లా రమోలా అందించిన సందేశము చాలా శక్తివంతముగాను మరియు స్ఫూర్తిదాయకముగాను ఉండెను. " ఆందోళనను అధిగమించుటను'' గూర్చి ఆ సందేశము అందించబడినది. అది నా పరిస్థితికి తగినట్లుగా ఉన్నందున, ఈ సందేశము నాతో ప్రవచనాత్మకముగా మాటలాడుచున్నట్లుగా నేను భావించాను. తద్వారా, నా విశ్వాసము బలపరచబడినది. స్టెల్లా రమోలా చేయుచున్న ఈ పరిచర్యను బట్టి నేను దేవుని స్తుతించుచున్నాను. నా వంటి యౌవనస్థులకు ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక

- పనేహు

ఇది ఎంతటి చక్కటి ఒక గొప్ప సాక్ష్యము కదా! ఆలాగుననే, ప్రభువు మిమ్మును ప్రేరేపించినట్లయితే, మీ యొక్క సహకారము ద్వారా ఈ పత్రికా పరిచర్యలో భాగస్థులగుటకును మరియు దేవుని మహిమపరచే విధంగా జీవించునట్లుగా ప్రజలను ప్రేరేపించుటకును మిమ్మును ప్రేమతో ఆహ్వానించుచున్నాము.

ఈ పత్రికను చదివి ఆశీర్వదించబడండి. క్లిష్టమైన సమయంలో వారు కూడా ఆశీర్వదించబడటానికి, ప్రోత్సహించబడటానికి మరియు ఓదార్పు పొందడానికి మీకు సమీపములో ఉన్న వారికిని మరియు మీ ప్రియులైన వారికి కూడ ఈ పత్రికను పరిచయం చేయండి. దయచేసి మీ సాక్ష్యాలను [email protected] అను ఈమెయిల్ ద్వారా మాకు పంపించండి మరియు దేవుని మహిమ కొరకు పత్రికలో ప్రచురించడానికి మేము ఆనందిస్తాం.

రండి, మ్యాగజైన్ క్లబ్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ పత్రికలో భాగస్థులుకండి. మరియు ప్రతినెలా ఈ ముఖ్యమైన పరిచర్యకు సహాయం చేయుట ద్వారా లక్షలాది మందికి దేవుని శాశ్వతమైన వాక్యాన్ని పంచుకొనుటకు సహాయపడుతుంది

పత్రిక కొరకు వార్షిక చందా- రూ.300/

(లేక మీరు మీ స్నేహితులకు మరియు బంధువులకు ఈ పత్రికను బహుకరించవచ్చును

పత్రిక పరిచర్య నిమిత్తము స్పాన్సర్‌షిప్

  • రూ.1,000/-           
  • రూ. 5,000/- లేక అంతకంటె ఎవ

"పరిచర్యలో మాతో మీ భాగస్వామ్యమును ఎంతో విలువైనదిగా మేము భావించుచున్నాము. మీ ఔదార్యముగల హృదయమును బట్టి దేవుడు మిమ్మును దీవించును గాక.'' (సామెతలు 11:25)

మీ సహకారము ద్వారా దేవుని వాక్యం అనేక హృదయాలపై వ్రాయబడనివ్వండి

పోస్ట్ ద్వారా ఈ మ్యాగజైన్‌ని పొందుకోవడానికి, దయచేసి పార్ట్‌నర్ కేర్ నెంబర్‌ను 044- 23456677 సంప్రదించండి (ఉదయం 7 నుండి రాత్రి 9 వరకు)