2025వ సంవత్సరము కొరకైన ప్రపచనము
దీవెనకరమగు వర్షము కురియు సంవత్సరము
ప్రభువు డాక్టర్. పాల్ దినకరన్‌కు బయలుపరచెను

...ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. యెహెజ్కేలు 34:26

 

  • నాకు సేవ జరిగించుచున్న వారి మీద నా హస్తములు నిలిపెదను.
  • వారు నా ఆదేశాలకు కట్టుబడి ఉంటారు మరియు మరియు వారి తరపున పనిచేసే నా అతీంద్రియ శక్తిలో ఆనందిస్తారు.
  • ఇదివరకు నా జనులు అవమానమును మరియు విభాగములను భరించారు.
  • వారి బాధలన్నింటిలోను నేను బాధను అనుభవించాను; వారి వేదనలన్నిటి ద్వారా నేను వేదనను భరించాను.
  • కాబట్టి, నిశ్చయముగా ఇప్పుడు వారికి నేను న్యాయమును జరిగించెదను.
  • నేను వారిని అత్యధికంగా విస్తరింపజేసెదను
  • వారి సరిహద్దులను విశాలపరచెదను. అందరు విస్తరింపబడెదరు.
  • వారికి న్యాయము జరిగించునట్లుగా నా శక్తిని వారికి కనపరిచెదను.
  • అవమానం మరియు బాధల మధ్య వారు నాకు సమస్త ఘనతను చెల్లించుటలో ఎంతో జాగ్రత్త వహించారు మరియు నా చిత్తమును శ్రద్ధగా నెరవేర్చడానికి సమస్తమును నమ్మకంగా చేశారు. కాబట్టి, నేను వారి పక్షమున నిలిచి, నా గొప్ప శక్తితో నేను వారికి వాగ్దానం చేసినవాటినన్నిటిని తప్పకుండా నెరవేర్చెదను.
  • నా రాజ్యంలో గొప్ప అభివృద్ధి ఉంటుంది. పరలోకం నా ప్రజలకు తెరువబడుతుంది.
  • నా ఆనందపు వర్షాన్ని, ఆశీర్వాదాన్ని, సదుపాయాలను, కృపను, వరములను, ఘనతను నా సేవకుల మీదను మరియు నా జనుల మీద కుమ్మరించెదను.
  • మీకు ఏమియు కొదువ ఉండదు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
  • భయపడకుడి. స్థిరంగా నిలబడండి. విశ్వాసంలో ఐక్యతగా ఉండండి, ఉదార స్వభావం కలిగి ఉండండి, క్షమించేవారుగా, ఆశీర్వదింపబడిన వారుగా ఉండండి అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
  • అంధకారశక్తుల బెదిరింపులకు, మీకు వ్యతిరేకంగా అవినీతి కార్యముల ద్వారా చేసిన దోషారోపణలకు ఎన్నడును భయపడకండి. నేను నీతిన్యాయములను జరిగిస్తానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
  • మీకు, నా రాజ్యానికి, నా జనులకు విరోధంగా పన్నాగాలు పన్నిన వారిని ఇక ఎన్నటికిని మీరు చూడరు. ఇకపై వారు కనపడరు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
  • మీరు కోల్పోయిన సంవత్సరాలను మరియు గత సంవత్సరాల ఫలములను నేను తప్పకుండా తిరిగి దయచేస్తాను.
  • నేను మిమ్మును అత్యధికముగా ఫలింపజేస్తాను మరియు మీకు తిరిగి సమృద్ధిని కలుగజేస్తాను మరియు మీతో శాశ్వతంగా ఉండెదను.
  • మీకు విరోధంగా ఉన్న వారు తొలగించబడతారు కానీ మిమ్మును ఆశీర్వదించే వారు ఆశీర్వాదంగా నిలిచి ఉంటారు.
  • ఇప్పుడు మీరు బలాన్ని పొందుకుంటారు మరియు నా రాజ్యాన్ని సమస్తానందముతో స్థిరపరచెదను.


   II దేశం మరియు ఇతర దేశాలు

  • ప్రపంచ దేశాలన్నిటిని ఐక్యపరచడానికొరకై నాయకత్వం లేకుండానే, దేశాలన్నియు ఎన్నో గందరగోళాలను ఎదుర్కొంటాయి.
  • ప్రతి దేశం తనను తాను రక్షించుకోవడానికి ఆయత్తపరచబడును.
  • దేశాలు, ఏ దేశాన్ని అనుసరించాలో లేదా బృందంగా కలిసి ఉండాలో తెలియని స్థితిలో కనబడును.
  • ఇంతవరకు తెలియని స్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి.
  • దేశాలలో మోసాలు ఎక్కువ అవుతాయి. మార్కెట్లు స్థిరంగా ఉండవు.
  • ప్రభుత్వ పరిపాలనందు స్వార్ధం కేంద్రంగా ఉండుటచే అవినీతి ప్రబలుతుంది.
  • ప్రజల యొక్క అపవిత్రమైన మరియు అవినీతి క్రియల కారణంగా అంటువ్యాధుల ఆకస్మికంగా వ్యాప్తి చెందడం వలన ప్రజలు ఎంతో బాధను అనుభవిస్తారు.
  • పశ్చాత్తాపం గల సందేశాన్ని అన్ని వేదికలపై బోధించబడుతుంది మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు యేసు ప్రభువు వద్దకు తిరిగి వచ్చి, ఆయన ప్రేమలో ఆశ్రయం పొందుతారు.
  • ప్రభువు కౌగిలిలోనికి అనేకమంది యువకులు తిరిగి వస్తారు. అధిక సంఖ్యలో వారు యేసు ప్రేమను పంచుకునే లక్ష్యంను చేపడతారు.
  • భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ప్రత్యేకంగా, దేవుని మరియు ఆయన సమాధానమును కనుగొనడానికి తమను తాము సంపూర్ణంగా సమర్పించుకున్న వారిలో ప్రభువైన యేసు ప్రత్యక్షపరచబడతాడు.
  • ఇశ్రాయేలు దేశం యొక్క సరిహద్దులలో సమాధానము కలుగుతుంది. ఇది అత్యంతమైన విలువగల పదార్థాలను త్రవ్వి వెలికి తీస్తుంది. దేశాల మధ్య ఇశ్రాయేలు దేశం ఉన్నత స్థానములో నిలబడుతుంది. నా సువార్త దాని ప్రజల మధ్య స్వీకరించబడుతుంది.
  •  వారిలో రూపాంతరము కలుగుతుంది.
  •  రష్యా తన పొరుగు దేశాల మధ్య తన ప్రభావానికి రెక్కలు విప్పుతుంది.
  • మధ్యప్రాచ్య దేశాలు అస్థిరంగా కొనసాగుతాయి కానీ వారి ప్రజల పట్ల నాకున్న ప్రేమను అనుభవిస్తాయి.
  •  ఆఫ్రికాలోని దేశముల పరిపాలన మరియు వాణిజ్యంలోను ఐక్య పరచేందుకు నా కృప దాని మీదికి దిగివస్తుంది.
  •  పొరుగు దేశాలపై ఇండియా తన ప్రభావాన్ని విస్తరింపజేస్తుంది. అయితే నా ఆధ్యాత్మిక శక్తి కూడా ఈ దేశాలకు బయలు వెళుతుంది.
  •  సామర్థ్యం మరియు సరిహద్దు నియంత్రణల అభివృద్ధితో ఈ సంవత్సరం అమెరికా ఒక ప్రభావవంతమైన దేశంగా బలంగా నిలబడుతుంది.
  • అమెరికాలో నా నామం కొరకు ఎంతో త్యాగంతో పరిచర్య చేసిన నా సేవకులందరు బలంతో మరల పైకి లేవనెత్తబడతారు. నీతిగలవారు సహనంతో నిలిచి ఉంటారు.
  • ఆశ్చర్యకరంగా పునరుజ్జీవనాన్ని అనుభవిస్తారు.
  •  వివిధ పరిచర్య శాఖల మధ్య బలమైన, నెట్‌వర్కింగ్ ఏర్పాటు చేయబడుతుంది.
  • నా నామమున మొఱ్ఱపెట్టు వారందరు నా ఆధ్యాత్మిక ఆశీర్వాదపు వర్షమును నిశ్చయంగా పొందుకొని అనుభవిస్తారు
  •  ఆధ్యాత్మిక ఆశీర్వాద వర్షపు సంవత్సరం 2025