నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనము ఒక ప్రత్యేకమైన వాగ్దానమును కలిగియున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 1:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక.’’ అవును, స్నేహితులారా, మనమందరము దేవుని ద్వారా దీవించబడాలని కోరుకుంటాము కదా! జీవితములో అభివృద్ధిని చూడాలని అనుకుంటాము. వెయ్యిరెట్లు మిమ్మును అభివృద్ధి చేసెదనని ప్రభువు ఈ రోజు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. 

నా ప్రియులారా, ఇటువంటి అభివృద్ధి మనము ఎలా పొందుకొనగలము? మొదటిగా ప్రభువుతో ఒక సంబంధమును కలిగి ఉంటూ, మన ప్రణాళికలను ఆలోచనలను, ఆయనకు సమర్పించుట ద్వారా మనము ఇటువంటి అభివృద్ధిని చూడగలము. అదేవిధముగా, మత్తయి 6:33వ వచనములో మనము దీనిని చూచినట్లయితే, ‘‘ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును’’ అని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ప్రియులారా, పై వచనము ప్రకారము మొదటగా మనము ప్రభువును వెదకాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. తద్వారా ప్రభువు మనకు అనేకమైన బహుమానములను అనుగ్రహిస్తాడు. అనేకమైన ఇహలోకపరమైన దీవెనలను మరియు బహుమానములను మనకు ఇస్తాడు. అయితే, వాటిపైన మన దృష్టిని ఉండకూడదు, మన దృష్టి  ప్రభువుపైన ఉండాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. ఆయనే మనకు ప్రతి మేలును అనుగ్రహించు దేవుడు. ప్రభువును మరియు ఆయన యొక్క నీతిని మొదట వెదకాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు, మొదటిగా తనతో నింపబడాలని మీరు కోరుకొనండి. ఇంకను ప్రభువును ఎక్కువగా తెలుసుకోవాలని అడగండి. నా ప్రియులారా, ఇంకను ప్రతి రోజు వాక్యమును చదువుచూ, ఆయనతో మాట్లాడండి. ఆలాగుననే, మన యొద్ద నుండి ప్రభువు కోరుకునేది అటువంటి సంబంధము మాత్రమే. అప్పుడు, మీకు కావలసినవన్నియు ప్రభువు అనుగ్రహిస్తాడు.

రెండవదిగా, ఆయన మాటకు విధేయులుగా ఉండాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. ప్రభువును గురించి వినడం మరియు చదవడం మాత్రము కాదు కానీ, ఆయనను గురించి మాట్లాడడము మాత్రము కాదు, కానీ, ఆయన ఆజ్ఞలకు లోబడాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 28:1లో మనము చూడగలము,‘‘ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నియు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును’’ అన్న వచనము ప్రకారము ఆయనకు విధేయత చూపుచున్న వారి యెడల దేవుడు ఉన్నతమైన దీవెనలను కురిపిస్తాడు. అవును నా ప్రియ స్నేహితులారా, అది చేయడము ఎంతో కష్టతరముగా ఉన్నప్పటికిని, మనము అది తప్పకుండా చేయాలి. ఆయన ఆజ్ఞలను పాటించడము మరియు ఆయనకు లోబడి ఉండడము ఎంతో ముఖ్యము. ఇంకను మన ఆశలు కోరికలకంటే అధికముగా దేవుని ప్రణాళికలను వెంబడించడము ఎంతో ప్రాముఖ్యమైన విషయముగా ఉన్నది. కనుకనే, దేవునికి విధేయత చూపడము ప్రాముఖ్యము. అప్పుడు ఆయన మనలను దీవిస్తాడు. ఉన్నతమైన దీవెనలను మన మీద కురిపిస్తాడు. 

మూడవదిగా, నా ప్రియులారా, మనము అభివృద్ధిని ఎలా పొందుకొనగలము? ఇచ్చుట ద్వారానే మనము అభివృద్ధిని పొందుకొనగలము. ఒకవేళ నాకున్నదే కొంచెము కదా! అది కూడా నేను ఇచ్చినట్లయితే, నాకేమి ఉండదు అని మీరు అనుకోవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, లూకా 6:38వ వచనములో చూచినట్లయితే, ‘‘...ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.’’ అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు దేవునికి ఎంత ఇస్తున్నారని ప్రభువు చూడడు గానీ, ఆయనకు ముందుగానే తెలుసు. ఇంకను నాకున్నదే కొంచెము అని మీరు చెప్పవచ్చును. ప్రభువు ఇది అంగీకరిస్తాడా? మీ చేతిలో ఉన్నది, ఎప్పుడైతే, మీరు మీ పూర్ణ హృదయముతో ఇచ్చినప్పుడు ప్రభువు దానిని దీవించి, అభివృద్ధిపరచి, మీకు తిరిగి నిండి కొలతతో ఇస్తాడు. అంతమాత్రమే కాదు, ఇతరులకు దీవెనకరమైన పాత్రగా మీరు ఉపయోగించబడతారు. మీ కానుకలను ప్రభువుకు ఇవ్వడము మాత్రమే కాదు. గానీ, మీరు ఇతరులకు సేవ చేసే సమయము, పరిచర్య ద్వారా ప్రభువు సేవించే సమయము, ప్రజలను కట్టడములో సమయమును వెచ్చించడము. ఇంకను దేవుని మహిమార్థమైన మీ తలాంతులను ఉపయోగించుకొనడము చాలా ప్రాముఖ్యము. 

అయితే, మన జీవితములో ఈ అభివృద్ధి ఎందుకు ప్రాధాన్యమైనది? ఎందుకనగా, మన అభివృద్ధి దేవుని మహిమపరుస్తుంది. ‘నేను దీవించబడడము ప్రభువునకు ఎలాగున మహిమను చేకూరుస్తుంది?’ అని మీరు తలంచవచ్చును. మీ జీవితములో ప్రతివిషయములో మీరు అభివృద్ధినొందినప్పుడు, దేవుని శక్తిని మరియు జ్ఞానమును, దేవుని మంచితనమును మీరు కనుపరుస్తున్నారు. ఇతరులకు ఇచ్చునట్లుగా ప్రభువు మిమ్మును దీవిస్తాడు. ప్రభువు మిమ్మును దీవించి, ఇతరులకు దీవెనకరముగా ఉండునట్లుగా చేస్తాడు. మీ వ్యాపారము ప్రజలకు దీవెనకరముగా ఉండబోతుంది. మీ చదువులను ఇతరుల దీవెనార్థమై ఉపయోగించుకుంటారు. మీ ఉద్యోగములో మీరు ప్రకాశిస్తూ మీరు చేయుచున్న పని ద్వారా ఇతరులకు నిరీక్షణను కలిగిస్తారు. మీరు అభివృద్ధి నొంది ఇతరులతో అది పంచుకునప్పుడు అది వారికి దీవెనకరముగా ఉంటుంది. మీ కుటుంబములో మీరు దీవించబడినప్పుడు, మీ పేరు, మీ దీవెన మీ తరతరములకు అది కొనసాగిస్తూ, ఇంకను దేవునికి మహిమను చేకూరుస్తుంది. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీ యొక్క అభివృద్ధి, కేవలం మీ కొరకు మాత్రమే కాదు, తరతరములకు అది దీవెనకరముగా ఉండబోవుచున్నది. తద్వారా, మీ చుట్టు ఉన్న ప్రజలు దీవించబడతారు. మీరు కలిసే ప్రజలు దీవెననొందుతారు. ప్రభువునకు మహిమను చేకూరుస్తుంది. ఎందుకంటే, ప్రభువు నామమును మీరు కలిగియున్నారు కాబట్టి. నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మును ఇటువంటి దీవెనలతో దీవించాలని మీ పట్ల కోరుచున్నాడు. వెయ్యి రెట్లు అభివృద్ధి, ఆయన యొద్ద నుండి ఈ రోజు పొందుకుందామా? ఎల్లప్పుడు ప్రభువుతో సంబంధం కలిగియుంటూ, ఆయనకు విధేయత చూపుతూ, మనకు కలిగియున్నది ఇవ్వడానికి ప్రతిజ్ఞ చేద్దాము. దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక. 

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, వెయ్యి రెట్లు అభివృద్ధి నొందిస్తానని వాగ్దానము చేసినందుకై నీకు వందనాలు. ప్రతిరోజు నీతో సయమును గడుపుతూ, అనుబంధాన్ని పెంచుకుంటుండగా, నీ వాక్యమును చదువుతూ, నీ చిత్తము నెరవేరుస్తుండగా, ఇంకను నీ ఆజ్ఞలను పాటిస్తుండగా,  నీ కొరకు జీవిస్తూ, ఇతరులకు ఇచ్చుచూ, పరిచర్య చేయుచుండగా, ఇంకను నీ రాజ్యమును కట్టుచుండగా, వెయ్యి రెట్లు మమ్మును అభివృద్ధి నొందించుము. దేవా, నీవు మాకిచ్చు, ఏ దీవెననైనను సరే, ఇతరులకు కూడా అది ప్రోక్షింపబడునట్లు చేయుము. వారు కూడా దీవించబడునట్లుగాను, వారి బిడ్డలు దీవించబడునట్లుగాను, ప్రభువా, మా తరతరములు దీవించబడునట్లుగాను, ఒక తరము నుండి మరొక తరములకు ఆ దీవెనలు కొనసాగించబడునట్లుగా మమ్మును వెయ్యి రెట్లుగా దీవించి, అభివృద్ధి నొందించుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.