నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక. ఈ రోజు మనము బైబిల్ నుండి మత్తయి 5:8 వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, ఇలాగున అంటుంది, "హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు'' అని ఈ వాక్యములో వ్రాయబడియున్నది. అవును, స్నేహితులారా, మనము దేవుని చూడగలము. ఆయన సన్నిధిని గొప్పగా అనుభూతి చెందగలము. అయితే, అటువంటి ఆధ్యాత్మిక అనుభవమును పొందియుండాలంటే, మనము పూర్ణ హృదయముతో ప్రభువును వెదకాలి మరియు శుద్ధ హృదయముతో ప్రభువును కలిగి ఉండాలి. ఇంకను పాతనిబంధన కాలములో అబ్రాహాము మరియు ఇస్సాకు, యాకోబు దేవునితో అన్యోన్య సహవాసమును కలిగియుండేవారు. వారు ప్రభువుతో మాట్లాడేవారు, ప్రభువుతో నడిచేవారు. వారి జీవితాలను ప్రభువు యెదుట ఎంతో శుద్ధులుగా జీవించారో మనము చూడగలము.

నా ప్రియులారా, ఆలాగుననే, నేడు మనము కూడా కలిగియుండాలి. కనుకనే, ఒక్కసారి మీ హృదయాలను పరీక్షించుకోండి. మీరు ఎటువంటి హృదయాన్ని కలిగియున్నారు? ప్రభువు యెదుట అది శుద్ధమైనదిగా ఉన్నదా? లేదా? అని మిమ్మును మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. బైబిల్‌లో ఆదికాండము 12:7;31:13,26:2 మరియు నిర్గమకాండము 3:2 వ వచనములలో మనము చూచినట్లయితే, వారందరు ప్రభువుతో అన్యోన్య సహవాసము కలిగియున్నారు అనే విషయాన్ని మనము చూడగలుగుతాము. అదేవిధముగా, నూతన నిబంధనలో అపొస్తలులు ప్రభువుతో ఎంతగానో అన్యోన్య సహవాసమును కలిగి ఉన్నారు. అంతమాత్రమే కాదు, వారు తమ పూర్ణ హృదయములతో ప్రభువును వెదికారు. అందువలననే, వారి జీవితాలు ఎంతో అద్భుతంగా దీవించబడ్డాయి. అదేవిధముగా, నూతన నిబంధనలో, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయమును చదివినట్లయితే, కొర్నేలీ అను ఒక మనుష్యుని చూడగలము. అతడు యూదుడు కాదు, అతడు ఒక అన్యుడు. కానీ, వీటన్నిటిని మధ్యలో ప్రభువును ఎంతో జాగ్రత్తగా వెదికాడు. అందును బట్టి, అతడు మరియు అతని కుటుంబము ప్రభువు యొక్క దీవెనలు ఎంతో గొప్పగా పొందుకొని, అనుభవించారు. ఇంకను, వారందరు దేవుని శక్తితో నింపబడ్డారు. హల్లెలూయా!

నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీ అలవాట్లను మరియు మీ ఆలోచనలను మార్చుకొని, నేడు మీరు ఉన్న పక్షముననే ప్రభువునకు సమీపముగా రండి, మీ హృదయమంతటితో, మీరు ఆయనను వెదకుచూ, ఆయన యెదుట శుద్ధ హృదయము కలిగియున్న యెడల మీరు ఆయనను చూడగలుగుతారు. నేను కేవలము, 16 సంవత్సరముల వయస్సులో ప్రభువును వెదికాను. అందుకే ప్రభువు నాతో మాట్లాడేవాడు. నేను చెడు మార్గములో వెళ్లుచున్నప్పుడు, ప్రభువు నున్ను సరిచేశాడు. ఆ విధంగా, నేను ప్రభువుతో అన్యోన్య సహవాసమును కలిగియుండగలిగాను. నా ప్రియులారా, ఈ రోజు మీరు కూడా ప్రభువు యొక్క అటువంటి ఆశీర్వాదములు కలిగి ఉంటారు. అటువంటి ఆశీర్వాదములను పొందుకొనుటకు మనము ఇప్పుడే కలిసి ప్రార్థించబోవుచుండగా, మీ జీవితాలను ఆయనకు సమర్పించుకొనండి, ప్రభువు మీ జీవితాలను, ఆలోచను మార్చి వేసి, ప్రభువుతో మాట్లాడునట్లుగా, ఆయనతో నడుచునట్లుగా, మిమ్మును మారుస్తాడు. ప్రార్థిద్దామా? ఆలాగుననే, ప్రార్థించి, ఆయన చేతులకు మీ జీవితాలను అప్పగించినట్లయితే, నిశ్చయముగా ఆయన రక్తము ద్వారా మిమ్మును శుద్ధి చేసి, మీరు దేవుని చూచునట్లుగా, అటువంటి గొప్ప ధన్యతను మీకు కలిగించి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నేడు నీ సన్నిధానమునకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ బిడ్డలైన మేము నీ యందు అన్యోన్యసహవాము కలిగియుండాలని కోరుచున్నాము. దేవా, నీ కృపా కనికరములు మాకు అనుగ్రహించుము. యేసయ్యా, ఇంకను మేము నీతో మాట్లాడునట్లుగాను, నీతో నడుచునట్లుగాను, కృపను దయచేయుము. దేవా, మా జీవితాలలో ఉన్న చెడు విషయాలను మా నుండి తొలగించుము. యేసయ్యా, సిలువలో నీవు కార్చిన ప్రశస్తమైన రక్తముతో మమ్మును కడుగుము. దేవా, మా హృదయాలను మారుస్తున్నందుకై మరియు మాకు నూతన హృదయమును ఇచ్చుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు అపొస్తలులు నీతో సహవాసం కలిగి ఉన్నట్లుగానే, నేడు మేము నీకు దగ్గరగా వచ్చునట్లుగా చేయుము. దేవా, నీకు ఆయాసకరమైన ప్రతిదానిని మా నుండి తొలగించి, యథార్థమైన మరియు విడుదల పొందిన హృదయాన్ని మాలో నూతనంగా సృష్టించుము. ప్రభువా, మా ఆలోచనలు, మాటలు మరియు చర్యలు నీ పరిశుద్ధతను మరియు ప్రేమను ప్రతిబింబిం చునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క శక్తివంతమైన సాన్నిధ్యాన్ని అనుభవించకుండా మమ్మును నీ నుండి వేరు చేయు ప్రతిదానిని మా నుండి తొలగించుము. కొర్నేలీ వలె మా భక్తి జీవితం మరియు కుటుంబం మీద సమృద్ధిగా ఆశీర్వాదాలను కుమ్మరించుము. దేవా, మేము నిన్ను లోతుగా తెలుసుకోగలిగేలా నీతిలో నడవడానికి మాకు నేర్పించుమని యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.