నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:15వ వచనము ద్వారా మనకు ఒక గొప్ప అధికారమును కలిగియున్నాము అన్న నిరీక్షణను పొందుకొనుచున్నాము. ఆ అధికారమేమనగా, "ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము 'అబ్బా తండ్రీ' అని మొఱ్ఱపెట్టుచున్నాము'' ప్రకారం ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. మనము పాపములోనికి మరియు అపవాది యొక్క దాసత్వములోనికి పడిపోయినప్పుడు మనము భయములోనికి వెళ్లిపోతుంటాము. కానీ, యేసు యొక్క పరిశుద్ధాత్మకు మనలను మనము లోపరచుకొని యున్నప్పుడు, దేవునిని 'అబ్బా తండ్రీ' అని పిలుచు కృపను మనము కలిగియున్నాము. అవును, ఆ తండ్రి యొక్క పరిపూర్ణమైన ప్రేమను బట్టి మనలో ఉన్న భయమును వెళ్లగొట్టుతుంది. అయితే, పాపము భయమును తీసుకొని వస్తుంది. ఇంకను అపరాధ భావము భయమును తీసుకొని వస్తుంది. పాపము భయమునకు కారణమైన అపవాదిని తీసుకొని వస్తుంది. కనుకనే మీరు దేనికిని భయపడకండి.
కానీ, నా ప్రియులారా, ఈ రోజునే యేసు తన రక్తము ద్వారా మీ యొక్క ప్రతి పాపము నుండి మరియు పాపము యొక్క శాపము నుండి, వ్యసనముల నుండి మిమ్మును కడిగివేయాలని మీరు దేవుని సన్నిధిలో అడగండి. అప్పుడు అపవాది నుండి తీసుకొని రాబడిన భయము మీ నుండి వెళ్లిపోతుంది. మీరు జీవముగలిగిన దేవుని బిడ్డలుగా ఉంటారు. మీ పాపములు క్షమించబడియుండగా, మీరు మీ ఆత్మలో గొప్ప విడుదలను పొందెదరు. అంతమాత్రమే కాదు, మీరు గొప్ప స్వాతంత్య్రమును పొందుకుంటారు. అప్పుడు పాపము మీ నుండి వెళ్లిపోయినప్పుడు, అపవాది మా నుండి పారిపోతుంది, అప్పుడు, మీరు 'యేసు యొక్క బిడ్డగా నేను ఆనందించుచున్నాను' అని చెప్పగలుగుతారు. అందుకు వందనములు యేసయ్యా! ప్రభువు ఎల్లప్పుడు మీ మీద తన కృపను మరియు కనికరమును కనుపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే, మీరు మీ పాపములను ఒప్పుకున్నప్పుడు, ఆయన కృపా కనికరములు కలిగినవాడై, మిమ్మును క్షమించుటకు సంసిద్ధముగా ఉన్నాడు. యేసు మీ పాపముల నుండి రక్షించువాడై యున్నాడు. ఆయన మీ పాపములన్నియు స్వయంగా తన మీద వేసుకుని, సిలువ మీద మోసి, మీ నిమిత్తమై మరణించాడు. ఎందుకంటే, యేసు పాపము ఎరుగనివాడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి, పరిశుద్ధమైన రక్తమును ఆయనలో కలిగియున్నాడు. కానీ, మన యొక్క పక్షముగాఆయన బలియాగముగా సిలువలో మరణించాడు. మన పాపములను శిక్షావిధిగా ఆయన తన మీద వేసుకొనియున్నాడు. ఆయన వాటిని సిలువలో భరించాడు. ఆయన సిలువలో, "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుకనే వీరిని క్షమించమని'' చెప్పాడు. ఆలాగుననే, మీరు తండ్రి యొద్ద క్షమాపణ కోరినప్పుడు, దేవుడు మీ పాపములను క్షమిస్తాడు.
నా ప్రియులారా, నేడు మనము పాపము నుండి బయటకు వచ్చి, యేసు నామమున పాపము నుండి క్షమాపణ కొరకై మొఱ్ఱపెట్టుచుండగా, మనము ఇకమీదట పాపమును తీసుకొని వచ్చు అపవాది బిడ్డలు కాకుండా, జీవమును, పరిశుద్ధతను, క్షమాపణను అనుగ్రహించే దేవుని బిడ్డలుగా అవుతాము. అవును, మనము రక్షణను పొందుకొనెదము. మనకు రక్షణ కలదు. యేసు నామమున రక్షణ ఉన్నది. మనము పాపము నుండి విడుదల పొందు నిమిత్తము ఎవరు తన ప్రాణమును త్యాగము చేయలేదు. మనము మన క్షమాపణ కొరకు మనము మన రక్తమును చిందించనవసరము లేదు. ఇంకను ఎవరి రక్తమును చిందించబడవలసిన అవసరము లేదు. శరీర రూపము దాల్చి ఉండియున్న యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించుచున్నది. కనుకనే, మీరు ఈ రోజు యేసు చెంతకు రండి, ఆయన మిమ్మును రూపాంతరపరచు అనుభవమును పొందుకుందాము. మనము కలిసి ప్రార్థన చేద్దామా? ఆలాగుననే, 'అబ్బా, తండ్రీ,' అని పిలుచునట్లుగా, మనము ఆయనను అధికారమును పొందుకొనుటకు మన హృదయాలను దేవునికి సమర్పించినట్లయితే, నిశ్చయముగా నేటి వాగ్దానము నుండి దేవుడు మీకు అధికారమును అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వకృపలకు ఆధారభూతుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసయ్యా, మేము క్షమాపణ కొరకు నీ సన్నిధిలో మొఱ్ఱపెట్టుచున్నాము. నీవు నీ రక్తముచేత మమ్మును కడిగి శుద్ధీకరించుము. ప్రభువా, మా ప్రతి పాపము మరియు పాపపు స్వభావము, ప్రతి శాపము మాలో నుండి బయటకు వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా రక్తములో ఇక ఏ మాత్రము కూడ పాపము ఉండకుండా, మేము నూతన సృష్టిగా మార్చబడునట్లుగా చేయుము. యేసయ్యా, మేము నీ బిడ్డలుగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును నీ బిడ్డగా స్వీకరించి, నిన్ను 'అబ్బా, తండ్రీ' అని పిలిచే అధికారాన్ని మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. దేవా, మా పాపాలను నీ సన్నిధిలో ఒప్పుకొనుటకు మేము నీ యొద్దకు వచ్చుచున్నాము మరియు యేసు యొక్క విలువైన రక్తం ద్వారా క్షమాపణ కోరుచున్నాము. యేసయ్యా, నీ రక్తము ద్వారా మా పాపములను కడిగి మమ్మును పరిశుద్ధపరచి, మాకు క్షమాపణ దయచేయుము. దేవా, మమ్మును బంధించే ప్రతి పాపం, వ్యసనం మరియు శాపం నుండి మమ్మును పరిశుద్ధపరచుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము మరియు నీ పరిపూర్ణమైన ప్రేమ మా హృదయం నుండి భయాన్నంతా పారద్రోలునట్లు చేయుము. ప్రభువైన యేసు, మా శిక్షను నీ మీద వేసుకొని మాకు స్వాతంత్య్రమున మరియు రక్షణను ఇచ్చినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచి, మమ్మును నూతన సృష్టిగా మార్చుము మరియు పరిశుద్ధంగా నీ బిడ్డగా జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, దయచేసి శత్రువుల అబద్ధాలు మరియు పన్నాగల నుండి మా హృదయాన్ని మరియు మనస్సును రక్షించుము. దేవా, నీ యొక్క పరిపూర్ణమైన ప్రేమ ద్వారా మాలో ఉన్న భయమును వెళ్లగొట్టి, మా పాపములు క్షమింపబడుట వలన మరియు విమోచించబడుట వలన కలిగే ఆనందం మరియు విడుదలను మేము అనుభవించునట్లు చేయుమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ప్రేమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.