నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 14:26వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " యెహోవా యందు భయభక్తులు కలిగి యుండు ట బహు ధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును'' అని చెప్పబడిన ప్రకారము, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగియున్నప్పుడు మీకు బహు ధైర్యము పుట్టిస్తుంది. కనుకనే, భయపడకండి.

నా ప్రియులారా, నేడు మీరు యెహోవా యందు భయభక్తులతో నడుచుకుంటూ వచ్చారు. అదే సమయములో, 'నేను నా బిడ్డలను భయభక్తులతో పెంచాలని మీరు అనుకుంటున్నారేమో?' మీరు దేవునికి భయపడుచున్నారు, మీరు ఆయన ఆజ్ఞలను పాటించుచున్నారు మరియు దేవునికి విధేయులవుచున్నారు. మీరు దేవునికి భయపడి, దేవుని యెదుట నీతిమంతులుగా జీవించుచున్నారు. మీరు దేవుని యందు భయభక్తులు మీలో కలిగియుంటూ, మీరు దేవునికి కానుకలను సమర్పించుచున్నారు మరియు మీరు దేవునికి భయపడి, ఇతరులకు యేసును గురించి సాక్ష్యమిచ్చుచున్నారు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దుష్టప్రజలుగా నిందారోపణల మధ్య కూడా మీరు దేవుని కొరకు నిలిచి యున్నారు. తద్వారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించుచున్నాడు. ఆయన మీకు బలీయమైన బహు ధైర్యమై ఉన్నాడు. దేవుడు మీతో కూడా మరియు మీ పక్షమున ఉన్నాడు అన్న మానసిక స్థైర్యాన్ని మీరు కలిగియున్నారు. అత్యంత భయంకరమైన వైపరీత్యాల మధ్య దేవుడు మీ కొరకు సమస్తమును స్థిరపరుస్తాడన్న మానసిక స్థైర్యాన్ని మీరు కలిగియున్నారు. దేవుడే మీ బిడ్డలకు ఆశ్రయ స్థానమై ఉంటాడని మానసిక స్థైర్యాన్ని మీరు కలిగియున్నారు. దేవుడు మీ బిడ్డలను గురించి జాగ్రత్త వహిస్తాడు. వారి జీవితములో సమస్తమును పరిపూర్ణము చేస్తాడు. ఆయన వారిని భద్రపరుస్తాడు. మీ యొక్క కుటుంబము కొరకును మరియు మీ యొక్క బిడ్డలతో కూడా కలిసి, వారిని వర్థిల్లింపజేస్తాడు. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది.

ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో కూడా పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను. సుగంధి అను ఒక సహోదరి ఉండెను. తన యొక్క బిడ్డ ఏంజల్. బిడ్డకు 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, భర్త సుగంధిని విడిచిపెట్టి, ఒంటరిగా పారిపోయాడు. తన బిడ్డను ఏలాగున పెంచాలో ఆమెకు తెలియలేదు. ఆమె ఒక అద్దె గృహములో నివాసము చేయుచుండెను. ఆ బిడ్డ తరుచుగా, జబ్బున పడుచుండెను. నోటి నుండి మరియు ముక్కు నుండి రక్తము వస్తుండేది. తనకు కలిగిన డబ్బునంతటిని తన బిడ్డ యొక్క వైద్యము కొరకు వెచ్చించినది. అటువంటి సమయములో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును గురించి వారు విన్నారు. ఆమె అక్కడకు వెళ్లినది. ఒక చిన్న కానుకను సమర్పించినది. సేవా పరిచర్యలో తన బిడ్డను యౌవన భాగస్థురాలిగా చేర్పించారు. ప్రతి రోజు ప్రార్థనా గోపురములో కుమార్తె కొరకు చేయుచున్న ప్రార్థనలు పైకి వెళ్లడము ఆరంభించినది. మహా అద్భుతముగా దేవుడు ఆమె స్వస్థపరచాడు. ఆమె చదువుకోవడం ప్రారంభించినది. తాను చదువులలో ఎమ్ఎ డిగ్రీ పట్టాను పొందుకొనెను. మరోసారి, సుగంధి తన కుమార్తెకు మంచి భర్త దొరకాలని ప్రార్థిస్తూ ప్రార్థనా గోపురం వద్ద దేవుని సహాయం కోరింది. ఆశ్చర్యకరంగా, అద్భుతమైన వ్యక్తి వచ్చి, ఆమెను వివాహము చేసుకున్నాడు. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. వెంటనే, కృతజ్ఞతతో నిండిపోయిన అమ్మమ్మ తన మనమ సంతానమును కూడా యౌవన భాగస్థుల పధకములో భాగస్థులనుగా నమోదు చేశారు. దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు. ఆయన వారికి ఆశ్రయముగా ఉన్నారు. వారి యొక్క మానసిక స్థైర్యంగా ఉన్నారు. తన మనవరాలు జెనిలీయా తన 10 వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు, 500/483 మార్కులు వచ్చాయి. ఆమె 4 పథకాలను సాధించి పొందుకొనెను. దేవుడు అందరి యెదుట ఆమెను ఘనపరచి యున్నాడు. అవును, తల్లి ఆశీర్వదింపబడ్డారు. తల్లి తర్వాత, తన కుమార్తె ఆశీర్వదింపబడినది. తన కుమార్తె తర్వాత మనవరాలు కూడా ఆశీర్వదింపబడినది. దేవునికే మహిమ కలుగును గాక.

అవును, నా ప్రియులారా, దేవుడు మనకు మానసిక స్థైర్యముగా ఉన్నాడు. అన్ని వైఫల్యము చెందినప్పుడు, అందరు మనలను అపజయమునకు గురిచేసినా, ఆయన మన ఏకైక మానసిక స్థైర్యముగా ఉన్నాడు. ఆలాగుననే, నేడు మీరు కూడా దేవునికి భయపడి నీతిగా జీవించుచున్నారు గనుకనే, ఆయన మీకు తోడుగా నిలిచి ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. మరియు ఆయన వాగ్దానము చేసినట్లుగానే, మీ యొక్క సంతతి మరియు మనమ సంతతి కూడా ఆయనలో ఆశ్రయ స్థానము పొందుకుంటారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. కృతజ్ఞత మరియు భక్తితో నిండిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, మేము నిన్ను మా పూర్ణ హృదయంతో, శక్తితో మరియు ఆత్మతో ప్రేమించుటకు మరియు నీ పట్ల లోతైన పవిత్రమైన భయంతో మమ్మును నింపుము. దేవా, నీ వాక్యానికి విధేయత మరియు నీ ఆజ్ఞల పట్ల విశ్వసనీయతకు మా జీవితం జీవముగల సాక్ష్యంగా ఉండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, విచారణలు మరియు నిందారోపణల మధ్య కూడా, మీపై మాకున్న నమ్మకంతో ఓపికగా మరియు దృఢంగా ఉండేందుకు మాకు అనుగ్రహం దయచేయుము. తండ్రీ, మాకు మరియు మా కుటుంబానికి సంబంధించిన ప్రతిదానిని పరిపూర్ణంగా చేయుటకు మాకు స్థిరమైన విశ్వాసం దయచేయుము. ప్రభువా, నీ రక్షణ మరియు దీవెనల హస్తం మా కుటుంబంపై ఉండాలని, మాకు మార్గనిర్దేశం చేసి, నీ యొక్క మార్గాలలో మమ్మల్ని అభివృద్ధి చేయుము. దేవా, అవకాశం కొరకు నూతన ద్వారములు తెరిచి, ప్రభువా, మేము నీకు నమ్మకంగా సేవ చేయడానికి మమ్మును నీ యొక్క దైవీకమైన మార్గములో నడిపించుము. దేవా, మేము ఉన్నతముగా ఎదగడానికి, నీవు ప్రభావవంతమైన స్థానాల్లో ఉంచిన వారితో నడవడానికి మరియు మేము పొందే ప్రతి ఆశీర్వాదం ద్వారా నీ నామమును మహిమపరచడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.