నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా సువార్త 1:45వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను'' ప్రకారం దేవుడు మీ మీద ఆశీర్వాదవచనమును పలుకుచున్నాడు, దేవుడు తన ప్రణాళికను మీ మీద పలుకుచున్నాడు మరియు దేవుడు మీ జీవితానికి సంబంధించిన ఉద్దేశ్యమును మీ మీద పలుకుచున్నాడు. దేవుడు మీ మీద మరియు మీ జీవితములో సమస్తమును సమకూర్చు నిమిత్తము తన ప్రేమను ఆయన మీ మీద పలుకుచున్నాడు. ఆయన తన వాక్కు ద్వారా మీ హృదయములో పలుకుచున్నాడు, ప్రవచనము ద్వారా మరియు దర్శనముల ద్వారా ఆయన పలుకుచున్నాడు. కానీ, మీరు దానిని నమ్మవలసి యున్నది. దేవుడు చెప్పినది నెరవేరుతుందని మీరు విశ్వసించినప్పుడు, మీరు నిజంగా ఆశీర్వదించబడతారు. అవును, నేడు దేవుడు పలికినది నెరవేర్పులోనికి మీ యొద్దకు వచ్చుచున్నది అని మీరు నమ్మినప్పుడు, మీరు ధన్యులు అవుతారు.

అవును, నా ప్రియులారా, మీరు వెంటనే సూచనలు చూడకపోవచ్చును. కానీ, దేవుడు సెలవిచ్చినప్పుడు అది వాస్తవికంగా జరుగుతుందని గుర్తుంచుకోండి. దేవుడు మీ జీవితములో పలికిన సమస్తమును కూడా వాస్తవికంగా నెరవేర్పులోనికి రావాలని యేసు నామములో నేను పలుకుచున్నాను. ఆయన అక్కడ లేని వాటిని కూడ ఉన్నట్టుగానే పిలుచువాడు, నరునికి అసాధ్యమైనది, దేవునికి సాధ్యమై యున్నది. కాబట్టి, నేడు మీరు నమ్మినట్లయితే, మీరు దేవుని మహిమను చూచెదరు. మరియు " వారిలో ఒంటరియైనవాడు వేయి మందియగు ను ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యము ను త్వరపెట్టుదును'' అన్న వచనం ప్రకారం, ' నేను మిమ్మును ప్రేమించెదను, నేను మిమ్మును దీవించెదను, నేను మిమ్మును వృద్ధిచేసెదను. మరియు నేను మిమ్మును విస్తరింపజేసెదను' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ ఆశీర్వాదము మరియు ఒక వర్థిల్లత ఇప్పుడే మీ యొద్దకు వచ్చుచున్నది, నేడే మీ యొద్దకు రెండింతల ఆశీర్వాదము రానై యున్నది. కాబట్టి, మీరు దిగులుపడకండి.

దేవుని విశ్వసనీయతకు ఒక చక్కటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుచున్నాను. నాగర్‌కోయిల్‌కు చెందిన జూలియట్ అను ఒక సహోదరికి వివాహమైన ఎనిమిదేళ్లుగా సంతానం కలుగలేదు. తద్వారా, ఎంతో అవమానమును సహించవలసి వచ్చినది. కొంతమంది ఆమెను చూచి, మరొక వైపునకు వెళ్లిపోయేవారు. ఇందును బట్టి భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడినవి. కనుకనే, వారు అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే, వారు హాస్పిటల్ వెంబడి హాస్పిటల్‌కు వెళ్లుచున్నప్పుడు ఎవ్వరు కూడా వారికి సహాయము చేయలేకపోయారు. ప్రతి పరీక్ష కూడా అన్ని నార్మల్‌గా వచ్చాయి. డాక్టర్లు అన్ని బాగానే ఉన్నాయి అని అంటున్నారు, ఇందును బట్టి ఎవ్వరు కూడా పట్టించుకోవడము లేదు. రిపోర్టులన్నియు నార్మల్‌గానే ఉన్నాయి. కానీ, వారికి సంతానము కలుగుటలేనందున వారి గుండె బ్రద్ధలై పోయినది. ఎంతో బాధతో ఉండిపోయారు.

ఇటువంటి సమయములోనే మేము తిరునెల్వేలికి వెళ్లడము జరిగినది. అక్కడ మేము భాగస్థుల కొరకు ఒక 'భాగస్థుల కూటమును' నిర్వహించాము. నేను భాగస్థుల కూటములో, భాగస్థులందరి కొరకు వ్యక్తిగతముగా ప్రార్థించుచున్నప్పుడు, ఆమె యొద్దకు వచ్చినప్పుడు, నేను జూలియట్‌ని కలుసుకుని, 'నీకు మరుసటి సంవత్సరము ఇదే సమయములో దేవుడు నీకు ఒక చక్కటి బిడ్డను అనుగ్రహిస్తాడని చెప్పాను.' మహా అద్భుతమైన రీతిలో దేవుడు ఆమె గర్భము దాల్చుటకు కృపనిచ్చాడు. దేవుడు తదుపరి సంవత్సరములో ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చునట్లుగా సహాయము చేశాడు. తగిన సమయమున ఆమెకు ఒక చక్కటి ఆడపిల్ల జన్మించినది. ఆమె ఆ యొక్క బిడ్డను యౌవన భాగస్థుల పధకములో సభ్యురాలినిగా చేర్పించారు. ఆమె కుమార్తె, ఇప్పుడు పెరిగి పెద్దదైనప్పుడు, ఆమె క్రీడా కార్యాకలాపాలలో పాల్గొనుచుండెను. అంతమాత్రమే కాదు, ఆమె ఆటలలో పాల్గొని ఎన్నో బహుమతులను గెలుచుకొనెను. ఎల్లప్పుడు కూడా అన్నిటిలోను మొదటి స్థానములో ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఆలాగుననే జరిగింది. అంతమాత్రమే కాదు, దేవుడు ఆమెతో కూడా ఉన్నాడు. ఆ బిడ్డ ద్వారా కుటుంబానికి ఆనందాన్ని తీసుకొనివచ్చినది. నేడు, వారు ఎంతగానో ఆశీర్వదింపబడియున్నారు. అదియుగాక, దేవుని ఆనందముతో నింపబడ్డారు. మరియు ఆయన విశ్వసనీయతకు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక.

కాబట్టి, నా ప్రియులారా, దేవుడు మీ గురించి, పలికిన లేక మాట్లాడిన దానిని నెరవేరుస్తాడు అని నమ్మిన మీరు ధన్యులు. కాబట్టి, దేవుని వాక్యము ద్వారా ప్రోత్సహించబడండి- దేవుడు మీ గురించి చెప్పిన దానిని నెరవేరుస్తాడని నమ్మే మీరు ధన్యులు అవుతారు. మీ అభివృద్ధి, ఆశీర్వాదం మరియు నెరవేర్పు యొక్క సమయము మీ యొద్దకు వస్తుంది. కాబట్టి, దేవుని యందు నమ్మిక ఉంచండి. ఎందుకంటే, దేవుని వాగ్దానాలు ఎల్లప్పుడూ నమ్మదగినవి. కనుకనే, ఇంత వరకు మా జీవితములో ఏమియు జరగలేదని చింతించకండి, మీరు దేవుని యందు నమ్మిక ఉంచండి, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా జీవితంలో నీవు చెప్పిన అమూల్యమైన వాగ్దానాలకు వందనాలు. ప్రభువా, మా పరిస్థితులకు మించి మేము నిన్ను విశ్వసించాలని మేము కోరుకొనుచున్నాము. దేవా, నీవు వాగ్దానాన్ని నిలబెట్టే దేవుడవు మరియు నీ వాక్యం ద్వారా నీవు నిజమైన మరియు నమ్మకదగినవాడవని మరియు నీలో ఎటువంటి మోసం ఉండదని ప్రకటించుచున్నది. ప్రభువా, నీ వాగ్దానాలన్నియు క్రీస్తులో అవును మరియు ఆమేన్ అని చెప్పబడినట్లుగానే, మేము మార్పు యొక్క వెంటనే సంకేతాలను చూడనప్పటికిని, మేము నీ మీద నమ్మకం ఉంచాలని ఎంచుకున్నాము. ఎందుకంటే, నీవు సమస్తమును దేని కాలమందు అది చక్కగా నెరవేర్చే దేవుడవు. కనుకనే, ప్రభువా, మా మార్గములు క్లిష్టంగా ఉన్నప్పుడు విశ్వాసంతో నిన్ను పట్టుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము విశ్వాసంతో మరియు నీ పరిపూర్ణమైన ప్రేమతో సమయానుసారంగా విశ్వసిస్తూ నడవడం కొనసాగిస్తున్న ప్పుడు నీ ప్రేమగల చేతుల నుండి వందరెట్లు ఆశీర్వాదం పొందాలని మేము కోరుచున్నాము. దేవా, నీవు ఎల్లప్పుడూ మా మేలు కొరకే పనిచేస్తున్నావని గుర్తెరిగి, మేము పరిపూర్ణంగా నీ వాగ్దానాలలో విశ్రాంతి తీసుకొనునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.