నా ప్రియమైన స్నేహితులారా, నేటి దినమున దేవుడు మీ జీవితములో గొప్పగా జరిగించనై యున్నాడు. అందుకే నేడు బైబిల్ నుండి యిర్మీయా 17:7లో నుంచి ఆయన అద్భుతముగా మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఆ వచనము, "యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును'' ప్రకారం ప్రభువే మన యొక్క నమ్మకమై యున్నాడు. మనము ఆయనను నమ్ముకొనదగిన దేవుడై యున్నాడు.

నా ప్రియులారా, నాకు తెలుసు ఒకవేళ మీరు లోతైన ఆర్థిక సమస్య గుండా వెళ్లుచున్నారేమో? మీ కుమార్తె/కుమారుని వివాహము జరిపించుటకు మీ యొద్ద చాలినంత డబ్బు లేకపోవచ్చునేమో? లేక మీ బిడ్డలకు ఫీజు కట్టలేకపోవుచున్నారేమో? తదుపరి అద్దెను కట్టలేని పరిస్థితిలో ఉన్నారేమో? మీరు ఏమి చేయబోవుచున్నారో మీకు తెలియకుండా ఉన్నారేమో? లేక మీ యొద్ద పనిచేస్తున్న వారికి తగిన వేతనము నేనెలాగు ఇవ్వగలను? ఈ లోతైన బాధకరమైన పరిస్థితులలో, నేను ఎక్కడికి వెళ్లగలను ప్రభువా? అని అనుకుంటున్నారేమో? మీకు ఎదురై మిమ్మును కించపరచే పరిస్థితులు, మీరు అవమానంగా మరియు భయపడి ఉండవచ్చును. తద్వారా, మీ నిరీక్షణ తగ్గిపోతుందని అర్థమవుతుంది. దేవుని యందు మీకు ఉన్న నమ్మకము కూడ కూల్చివేయబడవచ్చునేమో? అయినప్పటికీ, ప్రభువుపై మన నిరీక్షణను ఉంచడం ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది అనే సందేశంతో నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. అయితే, నా ప్రియులారా, లేఖనము ప్రకారము మనము చెప్పబోవుచున్నాము. ఈ రోజునే మీరు నాతో కూడా ఆలాగుననే చెప్పండి, 'నా నమ్మికను నేను దేవుని యందు ఉంచుచున్నాను, గనుకనే, దేవుడు నాకు సమస్తమును అనుగ్రహించుచున్నాడు అని నేను నమ్ముచున్నాను. ఆయన నా కొరకు సమస్తమును జరిగిస్తాడు' అని చెప్పినప్పుడు యెహోవాను నమ్ముకొను మీరు ధన్యులు. కనుకనే, ఇటువంటి పరిస్థితులలో మీరు ఇంకను దేవునికి ఇవ్వగలరా? ఎందుకంటే, కొంతమంది, వారు అప్పులలో ఉండి కూడ దేవునికి ఇస్తుంటారు. వారికి కలిగిన దానిలో నుండి వారు కానుకను సమర్పిస్తుంటారు. దేవుడు దానిని దీవించి, వారి అప్పును తొలగించివేస్తాడు. కాబట్టి, నేడు మీ ప్రస్తుత పరిస్థితిలో కూడా, ప్రభువునకు ఇవ్వడం గురించి తలంచుకోండి మరియు ఆయన మీకు దయచేస్తాడనే నమ్మకంతో ఉండండి. నిశ్చయముగా, ఆయన మీ పట్ల నమ్మదగినవాడై యుంటాడు.

యూటర్న్ ప్రత్యక్ష ప్రసారములో ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది. ఆ అమ్మాయి నాతో ఇలాగున చెప్పింది, నేను 8వ తరగతి చదువుచున్నాను, 50 శాతము మాత్రమే నా యొక్క ఫీజును నేను చెల్లించగలిగాను. అడ్మిషన్ (ప్రవేశము) త్వరలోనే ముగిసిపోతుంది. దయచేసి, నా కొరకు ప్రార్థించండి అన్నయ్యా , దేవుడు నా పట్ల ఒక అద్భుతమును జరిగించాలని తెలియజేసింది. చిన్న వయస్సులోనే ఆ అమ్మాయి ప్రభువు మీద ఎంతో నమ్మకముగా ఉన్నది. చిన్న వయస్సులోనే దేవుని వైపు తిరగడానికి నిర్ణయించుకున్నది. మేము కలిసి ప్రార్థించినప్పుడు, తదుపరి మరుసటి వారములోనే, మరల ఆ అమ్మాయి మాకు కాల్ చేసింది. 'అన్నయ్యా, అద్భుతంగా మా స్కూలు వారు నా మిగతా ఫీజును చెల్లించవలసిన అవసరము లేదు అన్నారు. ఇది ఎలా జరిగిందో నాకు తెలియడము లేదు. వారు నా పట్ల బాధ్యతను తీసుకున్నారు. కనుకనే, మీరు నా కొరకు ప్రార్థించినందుకై మీకు వందనములు' అని తన సాక్ష్యమును నాకు తెలియజేసినది. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ స్నేహితులారా, మనము ఆరాధించే దేవుడు గొప్పవాడు మరియు నమ్మదగినవాడు. కనుకనే, మన నమ్మకము వ్యర్థముగా పోదు. మనము ఆయనను నమ్మకున్నప్పుడు, దేవుడు మన పట్ల బలమైన అద్భుతములను చేయగలడు. ఇటువంటి పరిస్థితులలో కూడ దేవుని యందు నమ్మిక యుంచి, నాతో కలిసి ప్రార్థన చేస్తారా? నా ప్రియ స్నేహితులారా, యెహోవాను నమ్ముకొనువారు ధన్యులు. కనుకనే, దీనిని మీ జీవితములో అనుభూతిని చెందండి. కనుకనే, నేటి వాగ్దానము ప్రకారము మీరు ఆయన యందు నమ్మికయుంచి, అట్టి ధన్యతను పొందుకొనండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా నమ్మకమైన గొప్ప తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ వాగ్దానం ద్వారా మమ్మును ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నీవు మా ప్రదాతవు, మాకు యెహోవా యీరేగా ఉన్నావని మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము. ప్రభువా, మేము కొన్నిసార్లు, మా పరిస్థితులను మరియు మా నిరంతర సమస్యలను చూసినప్పుడు, మేము నీ మీద నిరీక్షణ కోల్పోయి, మా స్వంతంగా కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తాము. ప్రభువా, మేము నిన్ను అనుమానించిన మరియు అపార్థం చేసుకున్న సమయాలకు మమ్మును క్షమించుము. దేవా, నీవు మంచి దేవుడవు, నీకు అసాధ్యమైనదేదీయు లేదు. మేము నీ మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచియున్నాము. కనుకనే, నేడు మా అవసరతలను మరియు సమస్యలను నీ దృష్టికి తీసుకొని వస్తున్నాము, ఇంకను సమస్తమును నీ పాదాల క్రింద ఉంచుచున్నాము. దేవా, నీవు మా పరలోకపు తండ్రివి. కనుకనే, మేము అప్పులలో కూరుకు పోయి ఉన్నాము. తదుపరి కార్యాల కొరకు మాకు కావలసి డబ్బు మా దగ్గర లేదు. కాబట్టి, ప్రభువా, నీవు మా అవసరతలన్నింటిని తీర్చి మరియు మా కష్టాల నుండి అద్భుతంగా మమ్మును విడిపిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా చుట్టూ ఉన్న ప్రజలకు నీవు మమ్మును ఒక సంకేతముగాను మరియు ఆశ్చర్యకరంగా ఉంచుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.