నాకు అమూల్యమైన స్నేహితులారా, మీరు క్రీస్తునకు రాయబారులై యున్నారు. అందుకే బైబిల్‌లో నేటి వాగ్దానముగా 2 కొరింథీయులకు 5:20 వ వచనమును ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "...మేము క్రీస్తుకు రాయబారులము...'' అని వ్రాయబడియున్నది. మీరు అనాధలు కారు, మీరు నెట్టివేయబడినవారు కాదు, మీరు ఎవరి కొరకు పనిచేయుచూ, ఆ కంపెనీ కొరకు మరియు ఆ సంస్థ కొరకు పని చేయుచు, దానిని మీ స్వంతదిగా భావించాలని కోరుచున్నారేమో? కానీ, వారైతే, మిమ్మును నెట్టివేసియున్నారేమో, మీరు మీ కుటుంబానికి చెందినవారుగా ఉండగోరుచున్నారేమో? కానీ, మీ కుటుంబ సభ్యులైతే,మిమ్మును నెట్టి వేయుచున్నారేమో? ఒకవేళ మీ స్నేహితులు మిమ్మును త్రోసివేయుచున్నారేమో? మీకు మీ స్వంత గుర్తింపు లేకుండా పోయిందేమో? కానీ, అటువంటి మిమ్మును చూచి, యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నా కుమారీ, కుమారుడా, నేను మిమ్మును నా యొక్క రాయబారులముగా పిలుచుచున్నాను, మీరు నాకు రాయబారులుగా ఉన్నారు.'' అని చెబుతున్నాడు. నా ప్రియులారా, ఒకవేళ నేడు మీరు అనుకోవచ్చును కదా, ' నాకైతే, ఈ లోకములో బలము మరియు బలగము కూడ లేదు కదా, ఏ జ్ఞానము లేదు, ధనము నాకు లేదు, ఎటువంటి స్థాయి నాకు లేదు, ఏ విధమైన పరిశుద్ధత కూడా నాకు లేదు' అని అంటున్నారా? అయితే, యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, 'నా కుమారీ, కుమారుడా, మీరు మీ జీవితములను నా హస్తములకు అప్పగించి ఉండగా, నేను మిమ్మును నా స్వంత వారినిగా నా స్వాధీనము చేసుకొనియున్నాను. యేసు సెలవిచ్చుచున్నాడు, 'మీరు నాకు చెందినవారు, మీరు నాకు చెందినవారై యున్నారు' కాబట్టి, మీరు ఒంటరి వారు కాదు అని చెబుతున్నాడు.
కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మీరు భయపడకండి, పరిశుద్ధ గ్రంథములో, యేసు మనతో చేయు నిబంధన, నిత్యము నిలిచి ఉండు నిబంధన అని తెలియజేయుచున్నది. అందుకే బైబిల్‌లో యెషయా 54:10వ వచనమును చూచినట్లయితే, "పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు'' అని చెప్పబడియున్నది. ఇంకను యేసు ఈలాగున అంటున్నాడు, 'ప్రేమ బంధముల చేత మీరు నాతో కూడా బంధించబడియున్నారు,' అని తెలియజేయుచున్నాడు. కనుకనే, దేవుని యొక్క వాక్యము చదువుచుండగా, ఇది మీ కొరకైన దేవుని ప్రేమ. మీరు యేసునకు చెందినవారు, మీరు ఆయనకు రాయబారులై ఉన్నారు. మీ ద్వారా మాత్రమే యేసు ఈ లోకమునకు ప్రత్యక్షపరచబడగలరు. కనుకనే, ఆనందించండి, ఆయనకు మిమ్మును మీరు సమర్పించుకొనండి, ప్రతిరోజు, ప్రతి క్షణము, ' ప్రభువా, నిన్ను గురించి నేను ఎవరితోనైనను, పంచుకొనుటకు నాకు ద్వారమును తెరవజేయమని' అడగండి.
నా ప్రియులారా, ఇంకను యేసు యొక్క రక్షించే శక్తిని, ఆశీర్వాదపు శక్తి, మీరు ఒకరితో ఒకరుగానీ, లేక బహిరంగ వేదిక మీద గానీ, అనేకమందితో గానీ, మీరు పంచుకొనునట్లుగా అవకాశమును కల్పించబడునట్లుగా అడగండి. రెండవదిగా, అందరి యెదుట మీ యొక్క పరిశుద్ధ జీవితము సాక్ష్యముగా ఉంచుట ద్వారా మీరు ఆయనను గురించి పంచుకొనవచ్చును. మూడవదిగా, మీ ద్వారా అద్భుత కార్యములు తీసుకొని రావడము ద్వారా గానీ, లేక అన్ని విధములుగా మిమ్మును వర్థిల్లింపజేయడము ద్వారా గానీ, దేవుడే మిమ్మును తనకు రాయబారిగా కనుపరచుకొనును. ఇది మీకు నేడు జరుగబోతుంది. కనుకనే, మీరు ఆనందించండి.
ఒక ప్రియమైన తల్లిగారైన శ్రీమతి విజయ, తన యొక్క సాక్ష్యమును ఈలాగున తెలియజేశారు. ఆ సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. ఆమెకు యేసును గురించి ఏమియు కూడా తెలియదు. కానీ, దేవుని కృప ఆమె యేసును కనుగొనునట్లుగా నడిపించియున్నది. తల్లిదండ్రులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ, యేసును గురించి ఏమియు కూడా తెలియదు. యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము తన యొక్క నగరములో స్థాపించబడియున్నప్పుడు, ఆరంభము నుండి తాను స్వచ్ఛందముగా అక్కడ సేవలను అందించడానికి ఆమె కొనసాగించెను. ప్రజల కొరకు జాగ్రత్త వహించారు, ప్రజల కొరకు ప్రార్థించారు. తన కుటుంబ జీవితములో అత్యున్నత స్థాయిలో స్థిరపరచబడెను. ఆమె ఎంతగానో ఆశీర్వదింపబడియుండెను. అయినప్పటికిని యేసు రాయబారిగా ఉండడానికి ఆమె సమయమును కేటాయించారు. యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో సేవలు అందించుట ద్వారా, ఆమె జీవితమును చూచి, ఆమె బిడ్డలు ప్రభువునకు వారి జీవితములను సమర్పించుకొని, ఆయనను తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఆమె పిల్లలందరు అత్యధికముగా ఆశీర్వదింపబడ్డారు, వారి జీవితములలో వర్థిల్లతను పొందుకున్నారు. వారి పిల్లల పిల్లలు కూడా దీవించబడ్డారు. ఆమె ఒంటరిగా ఉంటూనే, యేసు పిలుచుచున్నాడు రాయబారుల దేవుని సేవను జరిగించుచున్నారు. పిల్లలు ఆమెరికా మరియు ఇతర దేశాలలో ఉన్నప్పటికిని, 2022వ సంవత్సరములో అత్యంత ఘనత వహించిన యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో, రాయబారుల ఆధిక్యతను ఆమె ఆ రీతిగా పొందుకొనియున్నారు. అయితే, నాకు తెలుసు, పరలోకము స్వయంగా ఆమెను ఘనపరచి ఉంటుంది. ఆలాగుననే, నా ప్రియులారా, ప్రభువు నేడు ఇటువంటి కృపను మీకు కూడా ఇచ్చి మిమ్మును ఆశీర్వదించును గాక. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము నీకు రాయబారులమని గుర్తించునట్లుగా మాకు అటువంటి కృపనిచ్చినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మమ్మును నీ యొక్క రాయబారులనుగా పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మేము ఒంటరివారము కాదు, ఎందుకంటే మేము ఎల్లప్పుడు నీకు చెందినవారముగా ఉండునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మేము బలహీనులము మరియు అనర్హులమని భావించినప్పుడు, నీవు మమ్మును ఎన్నుకున్నావని మేము మరచిపోకుండా, నీలో జీవించునట్లుగా గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించుము. దేవా, మమ్మును నీ నిత్య నిబంధన శక్తిలో నడుచునట్లుగా సహాయము చేయుము. యేసయ్యా, నిన్ను గూర్చి, ఈ లోకము ఉన్నవారితో పంచుకోవడానికి మా హృదయాన్ని ధైర్యపరచి మరియు ఆనందంతో మమ్మును నింపుము. దేవా, మా జీవితాన్ని నీ ప్రేమ మరియు కృప యొక్క సజీవ సాక్ష్యంగా ఉపయోగించుకొనుము. ప్రభువా, మా ద్వారా అద్భుతాలు జరుగునట్లుగాను, మేము నిన్ను మహిమపరచగలుగునట్లుగాను అన్ని విధాలుగా మమ్మును వృద్ధి చేయుటకు కృపను అనుగ్రహించుము. దేవా, ప్రజలను చేరుకోవడానికి మరియు వారిని నీకు దగ్గరగా తీసుకురావడానికి మాకు ద్వారములను తెరువుము. ప్రభువా, మేము నీ ఉద్దేశ్యానికి లోబడునట్లుగాను మరియు నీ మహిమ కొరకు మమ్మును వాడుకొనుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.