నా ప్రశ్తమైన స్నేహితులారా, ప్రభువు ఈ నూతన సంవత్సరములో మీకు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నుల యెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను''(యెహోషువ 3:7) అను వచనమును మనము నేడు వాగ్దానముగా ధ్యానించబోవుచున్నాము. ఇది ఎంతటి గొప్ప వాగ్దానము కదా! నా ప్రియులారా, నేడు దేవుడు మిమ్మును గొప్ప చేయాలని మొదలుపెట్టియున్నాడని ప్రభువు ఈ నూతన సంవత్సరములో మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ప్రభువు యెదుట తన్ను తాను తగ్గించుకొనువారిని ఆయన హెచ్చించువాడై యున్నాడు. కనుకనే, యేసునందు కేవలము నిరీక్షణను కలిగియుండండి. 'ప్రభువు నన్ను గొప్ప చేస్తాడు' అని నమ్మండి. కనుకనే, ' నా జీవితాంతము వరకు నేను ఆయన మీదనే నిరీక్షణ కలిగి ఉండెదను ' అని ధైర్యంగా చెప్పండి. ఒకవేళ ఎంతో గొప్ప అవమానము గుండా మీరు వెళ్లియున్నారేమో? లేక నష్టములను కలిగియున్నారేమో? లేక అనేకమైన బలహీనతలను కలిగి యున్నారేమో? ఒకవేళ మీకు అక్రమ బాంధవ్యములు ఉన్నవేమో? లేక చెడు అలవాట్లు, తప్పుడు అలవాట్లు కలిగి ఉన్నారేమో? వీటన్నిటిని విడిచిపెట్టడానికి ప్రభువు వైపునకు మరులుకోండి. చెప్పండి, 'ప్రభువా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుచున్నాను. నేను నీ యందు మాత్రమే నమ్మిక ఉంచియున్నాను. ఇక లోకపరమైన కార్యములన్నిటిని కూడా నేను విడిచిపెడుతున్నాను, నా లోకపరమైన స్నేహితులను, బాంధవ్యములను, అక్రమ విధానములలో ధనమును నేను సంపాదనను కూడా నేను విడిచిపెడుతున్నాను మరియు నా యొక్క లోకపరమైన సకల భోగ ఇచ్చలను నేను విడిచిపెడుతున్నాను, 'ప్రభువైన యేసయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పించుచున్నాను' అని చెప్పినప్పుడు, దేవుడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను'' కనుకనే, మీరు దిగులుపడకండి.

నర్మద అను ఒక యౌవన విద్యార్థి యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని ఆశించుచున్నాను. ఆమె తన సాక్ష్యాన్ని ఈ రీతిగా పంచుకొనెను. ఆ యౌవనస్థురాలు 10 వ తగరతి చదువుచుండెను. ఆమెకు టైఫాయిడ్ జ్వరము సంక్రమించడం జరిగింది. అందును బట్టి, ఆమెకు అధిక మోతాదులో మందులు ఇవ్వబడినవి. ఆలాగుననే, ఆమెకు ఎక్కువగా తల నొప్పి వస్తుండేది. దాదాపుగా ఆమె ఒకటిన్నర సంవత్సరములు ఈ రీతిగా బాధపడుచుండెను. తద్వారా, ఆమె ఏ మాత్రము కూడా చదువుకోలేకపోయినది. 12వ తరగతికి సంబంధించిన పరీక్షలు సమీపించాయి. ఆమె చదువుకున్నవన్నియు మరియు నేర్చుకున్నవన్నియు కూడా మరచిపోయేది. అస్సలు పరీక్షలకు ముందుగా నిర్వహించబడిన మాదిరికరమైన పరీక్షలు(మోడల్ ఎక్సామ్స్)లో పరీక్షలు వ్రాస్తున్నప్పుడు, ఎంతో బలహీనత ఆమెను ఆవరించినందున పరీక్షలు వ్రాయకుండా ఆమె నిద్రపోయినది.

వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆమెతో, నీవు ఈ విద్యాసంవత్సరమునకు సంబంధించిన పరీక్షలు వ్రాయలేవు. కనుకనే, మేము నీకు సంబంధించిన ఔషదములను మార్చుచున్నాము. నీవు తదుపరి సంవత్సరము పరీక్షలను వ్రాయవచ్చును అని చెప్పారు. అయినప్పటికిని ఆమె యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో నిర్వహించుచున్న విద్యార్థుల ప్రార్థనా సమూవేశమునకు పాల్గొనెను. అక్కడ నేను ఏమని చెప్పానంటే, " ప్రభువు, నీ యొక్క బలహీనలతన్నిటి నుండి నీకు విడుదలను అనుగ్రహించుచున్నాడు, ఇంకను ఆయన నిన్ను పైకిలేవనెత్తుచున్నాడు'' అని యేసు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని తెలియజేశాడు. ఈ మాట ఆమెను తాకినది. ఈ మాట ఆమెకు ఒక గొప్ప నిరీక్షణను కలిగించినది. ప్రార్థన గోపురమునకు ఆమె ప్రార్థనల కొరకై తరచు ఫోన్ చేయుచుండెను. ఆమె మరియు తన కుటుంబమంతయు వారి కానుకలను తీసుకొని వచ్చి యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమము స్పాన్సర్‌కు సమర్పించారు.

దేవుడు ఒక అద్భుతకార్యములను జరిగించాడు. ఆమె ఆ పరీక్షలు వ్రాయునట్లుగా దేవుడు తనకు ఆ సామర్థ్యమును అనుగ్రహించాడు. ఫలితాలు కూడా వచ్చాయి. 1200 మార్కులకు 1172 మార్కులు రావడం జరిగింది. కామర్స్ మరియు బిజెనెస్ మ్యాథ్స్ (వ్యాపార గణితం)అను ఈ రెండు సబ్జెక్టులలో 200/200 మార్కులు రావడం జరిగింది. దేవుడు ఆమెను ఘనపరచియున్నాడు. తదుపరి, నిర్వహించబడిన కూటమునకు వచ్చినది, నేను సి.ఎ., విద్యను అభ్యసించాలి అని కోరుకుంటున్నానని తన సాక్ష్యమును తెలియజేసినది. నేను ఆమె మీద నా చేతులుంచాను. దేవుడు నేరుగా ఆమె యొక్క సి.ఎ., విద్యను సంపూర్తి చేసుకొనుటకు ఆమెకు తన కృపను అనుగ్రహించాడు. ఆమెకు ఏ మాత్రము కూడా అపజయము లేదు. దేవుడు ఆమెను గొప్ప ఔనత్యమునకు లేవనెత్తియున్నాడు. దేవుడు ఆలాగుననే మీకును జరిగించాలి మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు యేసును హత్తుకొని జీవించండి. దేవుడు మీ పట్ల జరిగించు అద్భుతములను అనుభవించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువైన యేసు, మేము విధేయతగల హృదయంతో నీ నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మా జీవితాన్ని నీ ప్రేమపూర్వక చేతుల్లోకి అప్పగించుచున్నాము. ప్రభువా, మేము నిన్ను సంపూర్ణముగా నమ్ముచున్నాము మరియు నీ సన్నిధి నుండి మమ్మును దూరం చేయుచున్న వాటిని మేము విడిచిపెట్టుచున్నాము. దేవా, ఈ లోక స్నేహితులు, సంబంధాలు మరియు ఈ లోక ఆనందాలతో మా అనుబంధాన్ని వదులుకోవడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, తప్పుడు అలవాట్లను మరియు నిజాయితీ లేని లాభాలను విడిచిపెట్టి, నీ మార్గంలో నడవడానికి మమ్మును నడిపించుము. దేవా, నీవు మమ్మును పైకి లేవనెత్తుతావనియు ఓపికగా నీ సన్నిధిలో వేచి ఉండునట్లుగా మమ్మును బలపరచుము. ప్రభువా, నీ యెదుట తమను తాము తగ్గించుకొనువారిని హెచ్చించునని నీ వాగ్దానమును మేము నమ్ముచున్నాము. దేవా, మేము మా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నప్పుడు నీ సమాధానము, ప్రేమ మరియు నిరీక్షణతో నన్ను నింపు. మీరు నాతో ఉన్నారని అందరూ చూడగలిగేలా మీ కాంతి నా ద్వారా ప్రకాశింపజేయండి. ప్రభువా, మేము నిన్ను విశ్వసించడానికి మరియు పరిపూర్ణంగా హత్తుకొని జీవించడానికి నీవు మాకు నీకృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.