నా ప్రియమైన స్నేహితులారా, నేడు దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 84:11 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము,‘‘దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు... యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు’’ ప్రకారము అవును స్నేహితులారా, ఆయన మీకు ఏ మేలును చేయకమానడు.  కాబట్టి, ధైర్యము వహించండి. 

నా ప్రియులారా, ఈ రోజు ప్రజలు మాకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు అని అంటున్నారా? ‘మాకు ఎటువంటి నిరీక్షణ లేదు. మా కుటుంబములో సమాధానము లేదు, మా ఉద్యోగములో సమాధానము లేదు, మేము ఒంటరిగా భావించుచున్నాము’ నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మిమ్మును లేవనెత్తుతాడు. ఆయన మీకు న్యాయము తీరుస్తాడు. కనుకనే, భయపడకండి. 

కర్నాటక నుండి ప్రకాశ్ అను ఈ ప్రియ సహోదరునికి అదే కార్యమును జరిగినది. అతడు సంపూర్ణంగా పరిచర్య చేస్తున్నాడు. అతను పరిచర్యకు పిలువబడిన తర్వాత, అతని చుట్టు ఉన్నవారు ఎందరో తనను విమర్శించేవారు. అతని గురించి చెడుగా మాట్లాడు చుండేవారు. కొందరైతే, తన భార్యకు ఎన్నో చెడు విషయాలు చెప్పియున్నారు. అందువలన వారు గొడవపడుతుండేవారు. అనేక అపార్థాలు వచ్చాయి. వారి కుటుంబములో ఎటువంటి సమాధానము లేదు. అతను ఎంతగానో నిరుత్సాహము చెందియున్నాడు. తన జీవితములో ఎటువంటి నిరీక్షణ లేదు. ఎవరిపైన కూడ ఆధారపడలేదు. ఆ సమయములో అతడు 2015వ సంవత్సరములో నిర్వహించబడిన హుబ్లీ ప్రార్థనా కూటములకు పాల్గొన్నాడు. ప్రార్థనా సమయములో మా తండ్రిగారైన డాక్టర్. పాల్ దినకరన్‌గారు అతనిని పేరు పెట్టి పిలిచియున్నారు. ‘‘ ప్రకాశ్, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. నీవెన్నడు ఎవరిని విమర్శించలేదు. దేవుడు నేడు నీ కుటుంబాన్ని కడతాడు. ఆయన నిన్ను ఘనపరుస్తాడు’’ అని చెప్పినప్పుడు, అతని హృదయములో గొప్ప సమాధానము పొందుకొనెను. అతను యింటికి సంతోషంగా తిరిగి వెళ్లాడు. క్రమముగా పరిస్థితులు మారడాన్ని అతను గమనించాడు. గొప్ప వెలుగు తన జీవితములోనికి వచ్చినట్లుగా అతడు భావించాడు. అతని భార్య కూడ పశ్చాత్తాపము నొంది తిరిగి కలిసిపోయారు. కుటుంబములో గొప్ప సమాధానము కలిగినది. విమర్శించిన వారందరు కూడ వారి మాటలను ఆపివేశారు. నూతన వెలుగుతోను మరియు నిరీక్షణతోను అతడు దేవుని పరిచర్యను చేయుటకు కొనసాగించాడు. తన పరిచర్య మీద ప్రకాశించిన ఆ వెలుగును తిరిగి పొందుకున్నాడు. చూడండి ఎంతటి గొప్ప భాగ్యము కదా!  
 
అవును, నా స్నేహితులారా, మీ జీవితములో కూడ నాకు న్యాయము తీర్చేవారు ఎవరు లేరు. నాకు సమాధానము మరియు నిరీక్షణ లేదు. నేను ఎలా ముందు కు కొనసాగుతాను. కానీ, దేవుని వెలుగు మీ మీద సూర్యుని వలె ప్రకాశించును. నేడు ఆయన మిమ్మును లేవనెత్తుతాడు. మీరు యథార్థముగా నడుస్తుండగా, ఆయన మీకు సూర్యుడును కేడెమునై యున్నాడు. ఆయన మీ జీవిత కాలమంతయు మిమ్మును నడిపిస్తాడు మరియు మీ పట్ల న్యాయము తీరుస్తాడు. కాబట్టి, ధైర్యము వహించండి. ఈ వాగ్దానమును మన జీవితములో స్వీకరిద్దాము. దేవుని మనము సూర్యుని, కేడెముగా కలిగియుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ వాగ్దానమును బట్టి నీకు కృతజ్ఞతలు, ఈ రోజు ఎటువంటి సమాధానము, నిరీక్షణ లేకుండా కృంగిపోయి ఉన్న మా జీవితాలలో నీ యొక్క సమాధానమును, వెలుతురు మా మీద ప్రకాశించునట్లు చేయుము. దేవా, ప్రజలు మాకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు, విమర్శించుచున్నారు. కుటుంబములో సమాధానము లేదు, ఎల్లప్పుడు మా యింటిలో గొడవలు, కొట్లాటలు జరుగుచున్నవి, మా కుటుంబములోను మరియు మా జీవితములోను, సమాధానము లేని ప్రతి కార్యములు తొలగించి, నీ వెలుగు ద్వారా మాకు నిరీక్షణ, భవిష్యత్తును, ఐక్యతను, సమాధానమును కలుగజేసి, నీవు మాకు సూర్యునిగాను, కేడెముగా ఉండుము. ప్రభువా, మాకు వ్యతిరేకంగా మాట్లాడు వారిని మరియు మా మీద విమర్శలు చేయువారిని నేడు నీవు మాకు అనుకూలంగా మార్చుము. దేవా, యథార్థంగా నడుచుకొనువారికి నీవు ఏ మేలు చేయకమానవని మేము నమ్ముచున్నాము. కనుకనే, మేము యథార్థముగా నడుచుకొనునట్లు మా హృదయాలను మార్చుము. ప్రభువా, మేము నీతిమంతులనుగాను మరియు మా విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఉండునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును నిలబెట్టి, మా జీవితంలోనికి న్యాయం చేకూర్చుస్తావని మేము నీ మీద నమ్మకం కలిగి ఉంటూ మరియు నీవు అనుగ్రహించే నిరీక్షణను పొందుకొనునట్లుగా మాకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.