నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 42:8వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "...పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును'' ప్రకారం పగటివేళ దేవుడు తన కృపను మన మీద కుమ్మరించుచున్నాడు. ఆయనను గూర్చిన ప్రార్థన నిత్యము మనకు తోడుగా ఉంటుందని చెప్పబడియున్నది. కనుకనే, భయపడకండి.
కీర్తనాకారుడైన దావీదు జీవించియున్న దినములలో, కోరహు కుమారుల చేత ఈ కీర్తనయు వ్రాయబడియున్నది. వారు దేవాలయములో దేవుని ఆరాధించుచు ఉన్నట్లుగా అనిపిస్తుంది. దావీదు తన సొంత కుమారుని యొక్క భారిన పడకుండా దాగుకుంటున్న సమయములో వారు ఈ కీర్తన ఆలపించినట్లుగా మనము చూడగలుగుచున్నాము. దావీదు తన రాజ అంతఃపురము నుండి పారిపోయాడు. అతడు దేవుని ఆలయమునకు దూరముగా ఉండియున్నాడు. కనుకనే, అతడు దేవుని సన్నిధి కొరకు ఎంతగానో ఎదురు చూశాడు. అందుచేతనే కీర్తనలు 42:7వ వచనములో చూచినట్లయితే, "నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి'' అని వ్రాయబడియున్నది. అతడు తీవ్రమైన నిరాశలో ఉండి దేవునిని పిలుచుచున్నాడు. అదేవిధంగా, కీర్తనలు 42:3వ వచనములో చూచినట్లయితే, "నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను'' అని అంటున్నాడు.
అతడు తీవ్రమైన నిరాశ లోతులలో ఉండి ఉన్నప్పటికిని, అతడు మానసిక స్థైర్యముతో ఈలాగున ప్రకటన చేయుచున్నాడు."...పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును'' అని చెప్పబడిన ప్రకారం ఇటువంటి ప్రార్థన దేవునికి ఆరోపించబడియున్నది. ఎందుకంటే, దేవుడు దరిద్రుల యొక్క ప్రార్థనను ఆయన నిరాకరించువాడు కాదు అని వ్రాయబడియున్నది. ఆయన తన ధనాగారములో నుండి తన ప్రేమను కుమ్మరించువాడై యున్నాడు. ఆయన కనికరము ఎన్నటికిని కూడా తరిగిపోనిది.
నా ప్రియులారా, మనము ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన రాత్రి వేళయందు కూడా ఆయన మెళకువగా ఉండువాడు. కొన్ని ఉదయకాలములో మనము మేల్కొని ఉండునప్పుడు, కళ్ల నిండా కన్నీటితో మేల్కొంటుంటాము. అయినప్పటికిని ఆయన కనికరములు మన నిమిత్తము వేచియున్నవి. అటువంటి సమయములోనే దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. అనేక ఫర్యాయములు ఆయన ఒక వచనముతోనే నాతో మాట్లాడడము ద్వారా నేను ఆలకించియున్నాను. ఆయన బైబిల్ నుండి వచనమును క్రోడీకరించి మాట్లాడతాడు. నేను ఆ రాత్రంతయు, ఆ వచనమును, కంఠోపాఠము చేస్తాను. ఉదయకాలమున నేను మేల్కొనగానే, ఆ వచనము నాకెంతో ఆదరణను అనుగ్రహించిన అనుభూతిని నేను చెందియున్నాను.
అవును, నా ప్రియులారా, ప్రతి ఉదయకాలమున ఆయన కనికరములు మన కొరకు వేచియున్నవి. అవి ప్రతి ఉదయమున నూతనముగా పుట్టుచున్నవి. ఒకవేళ మనము ఒక వచనములను మరల మరల చదువుచున్నామేమో? అయినప్పటికిని అవి ఎన్నటికిని కూడా పాతగిలిపోవు. ఆయన కనికరములు ప్రతి ఉదయకాలమున నూతముగా ఉన్నవి. కనుకనే, నేడు మీరు దేవుని వాక్యమును చదవండి.
నా ప్రియ స్నేహితులారా, రాత్రివేళ మన చింతలు మరియు విచారములన్నియు అత్యున్నతమైన స్థాయిని చేరుకుంటాయి. దేవుడు తన సన్నిధితో మనలను నింపుటకు అది ఒక మంచి సమయమై యున్నది. ఆయన తన సన్నిధితో మనలను నింపినప్పుడు, మన హృదయములో నుండి ఒక కీర్తన ఉప్పొంగుచున్నది. మా యొక్క కుమార్తె స్టెల్లా రమోలా, నూతన గీతాలు ఆల్భమ్ విడుదల చేస్తున్నప్పుడల్లా, ఆమె రాత్రి వేళ దేవుడు ఆ కీర్తనను నాకు అనుగ్రహించియున్నాడని నాతో ఆమె చెప్పుట నేను వినియున్నాను.
అవును నా ప్రియులారా, మనము దేవుని సన్నిధిని మనకు సమీపముగా ఉంచుకున్నప్పుడు, ఆయన మనకు కీర్తనను అనుగ్రహించును. నూతనమైన కీర్తనను అనుగ్రహిస్తాడు. ప్రియ స్నేహితులారా, దేవుడే మనకు స్వయంగా కీర్తన అయి ఉన్నాడు. మనము దేవునికి అత్యంత సమీపముగా ఆయన సన్నిధిని ఉంచుకొని ఉన్నప్పుడు, మనము ప్రార్థన కొనసాగిస్తూ ఉంటాము. ప్రార్థనయు, స్తుతియు ఆ విధంగా కలిసి ఆయన సన్నిధికి వెళ్లతాయి. అది మన అంతరంగములో నుండి ఒక కీర్తనను వెలికి తీసుకొని వస్తుంది.
అవును, నా ప్రియులారా, ఈ రోజును కూడ దేవుడు తన ప్రేమను దయను మీ మీదికి ఆజ్ఞాపించును గాక. దేవుని యొక్క కీర్తన మరియు ప్రార్థన ఎల్లప్పుడు మీతో కూడా ఉండును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ వాగ్దానము ప్రకారము కనికరము కలుగునట్లుగా ఆజ్ఞాపించుము. ప్రభువా, ప్రతి ఉదయకాలమున నీ కనికరమును ప్రతిరోజు మా జీవితం మీద నీ ప్రేమను ఆజ్ఞాపిస్తున్నందుకై నీకు వందనాలు. దేవా, మా రాత్రులు మెలకువగా ఉండి, మా మొఱ్ఱలను వింటున్నందుకు మరియు మమ్మును నీ వాక్యము ద్వారా ఓదార్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము ప్రతి ఉదయం నీ వాత్సల్యము నూతనముగా మా మీద పుట్టునట్లుగా చేయుము మరియు నీ వాక్యం మా అలసిపోయిన హృదయాన్ని బలపరుచునట్లు చేయుము. దేవా, నిరాశ నిస్పృహలలో ఉన్న మమ్మును దయచేసి నీ సన్నిధితో నింపి, మా ఆత్మను నూతన వాత్సల్యముతో పునరుద్ధరించుము. ప్రభువా, నీ వాగ్దానాలు మా హృదయంలో ప్రతిధ్వనించునట్లుగాను, మరియు సమస్త అవగాహనలను మించిన నీ శాంతిని తీసుకొని వచ్చునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ కీర్తన మాలో ఉన్నతముగా ఎదుగునట్లు చేయుము. దేవా, ఎప్పటికీ చెరిగిపోని నిరీక్షణ మరియు ఆనందం యొక్క శ్రావ్యతను మాకు దయచేయుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి మా పాట, మా బలం మరియు మా ఆశ్రయం నీవే కనుకనే. దేవా, నీవు మా ప్రార్థన మరియు స్తుతులు నీ చిత్తానికి అనుగుణంగా ప్రవహించేలా మమ్మును నీ దగ్గరికి ఆకర్షించుకొని, నిత్యము నీ యందు భయభక్తులు కలిగి జీవించునట్లు కృపను చూపుమని యేసుక్రీస్తు కనికరము కలిగిన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.