నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహెజ్కేలు 20:41 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను...'' అని దేవుడు సెలవిచ్చిన ప్రకారం మనందరికి కూడ మధురమైన పరిమళ సువాసనను అఘ్రాణించడము ఎంతగా యిష్టముగా ఉంటుందో కదా! మన పవిత్రమైన విధేయతగల హృదయము నుండి దేవుడు మధురమైన పరిమళ సువాసనను అఘ్రాణించువాడై యున్నాడు. దేవుడు ఒక గులాభీ వలె మనలను ఆయన ప్రేమించువానిగా ఉన్నాడు. యేసు యొక్క మధురమైన పరిమళ సువాసన త్యాగము ద్వారానే మీరు ఈ రీతిగానే అంగీకరించబడియున్నారు. మనలో ఉన్న యేసు దేవునికి మధురమైన పరిమళ సువాసనను ఇచ్చుచున్నాడు. మనము దేవుని యొక్క సాన్నిధ్యమును మరి ఎంతగా మోయవలసియున్నది కదా! యేసుక్రీస్తు ద్వారానే మీరు అంగీకరించబడియున్నారు. కనుకనే, ఆయన యెదుట పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు పరిమళ సువాసనగాను సమర్పించుకోవాలి.
పాతనిబంధన కాలములో వారు దేవునికి ఎన్నో బలియర్పణములు అర్పించుచూ ఉండేవారు. అవి దహన బలియర్పణ, నైవేద్యము, సమాధానార్థా బలి, పాపాపరిహారార్థబలి, అపరాధ పరిహారార్థబలి మొదలైన బలులను వారు సమర్పిస్తూ ఉండేవారు. అయితే, అవి ఏవియు కూడ తమ పాపముల నుండి వారిని శుద్ధీకరించేవి కావు. కేవలం యేసుక్రీస్తు రక్తము మాత్రమే సమస్త పాపముల నుండి మనలను కడిగి శుద్ధీకరించగలదు. కనుకనే మనము మన దేహమును దేవునికి సజీవయాగముగా అర్పించుకుందాము. ఎలాగైనను మన పాప స్వభావము ద్వారాను, అపవాది కుయుక్తి ద్వారాను మనము బాధించబడుతుంటాము. మనము ఈ యొక్క దుష్ట లోకములో జీవించుచుండగా, మనము సులభంగా అపవాది చేత శోధించబడుతుంటాము. అందుకోసమై మనలను మనము దేవునికి సజీవయాగముగా సమర్పించుకోవలసి యున్నది. దేవుడు మనలను భద్రపరచబడుట కొరకే మనము ఆయనకు సమర్పించుకోవాలి.
బైబిల్‌లో చూచినట్లయితే, యాకోబు 4:7లో ఏమని చెబుతుందనగా, " కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును'' ప్రకారము మనము ఏలాగున లోబడి ఉండాలి? మనము దేవుని వాక్యమునందు ఆనందించుట ద్వారానే, దేవునికి భయపడుట ద్వారా మనము దేవునికి లోబడి ఉండగలము. బైబిల్ నుండి యెషయా 11:3లో చూచినట్లయితే, "యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును'' అన్న వచనం ప్రకారం మనలో ఉండి యున్న దేవుని యందలి భయభక్తులు అఘ్రాణించడానికి, ఇంపైన పరిమళ సువాసనగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక యౌవనస్థురాలు, పేరు ఇవాంజెలిన్, ఒక రాజకీయ నాయకుని కలుసుకోవడానికి ఆలాగున వెళ్లుచున్నదని అనుకొనండి, ఆ యొక్క రాజకీయ నాయకుని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ఇవాంజెలిన్ వలె అనేకమంది కూడ అక్కడ ఉండియున్నారు. అయితే, ఈ యొక్క సహోదరి చేతిలో ఒక ప్రకటనాపత్రము (ప్లకార్డులు)పట్టుకొనియున్నది. దాని మీద, ' నేను మీ కొరకు ప్రార్థించుచున్నాను ' అని వ్రాయబడియున్నది. అయితే, ఈ రాజకీయ నాయకుడు దానిని చూడగానే ఎంతగానో ఆకర్షించబడ్డాడు. అతడు కేవలం తన వ్రేలు చాపి, ఆమెను చూపించి, తన యొద్దకు రమ్మని తెలియజేశాడు. అతడు ఇవాంజెలిన్ వైపు తన వ్రేలును చూపించి, తన యొద్దకు రావలెనని ఆమెను పిలిచాడు. అయితే, ఈమె నా చుట్టు ఎంతో మంది ఉన్నారు, నేను నీ యొద్దకు రాలేను అన్నట్టుగా ఉన్నప్పుడు, ఈ రాజకీయ నాయకులు నేరుగా ఆమె యొద్దకు వెళ్లి, ఆమె చేతిని పట్టుకున్నాడు. 'నీవు చేయుచున్న ప్రార్థనల నిమిత్తము నీకు ఎంతో ధన్యవాదాలు' అని ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అక్కడున్న అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఈమె కూడ ఒక వ్యక్తిగా ఆహ్వానించబడినది. అప్పుడు ఆమె అతనిని వ్యక్తిగతంగా కలుసుకొని, ఆ రీతిగా అతనికి ప్రార్థన చేయగలిగినది. ఈనాటి కూడ పదే పదే అదే సంఘటనను ఆమె పునరావృతం చేయుచుండెను. ఈ గొప్ప రాజకీయ నాయకుని ద్వారా ఆమె అంగీకరించబడి యున్నందుకు ఎంతగానో ఆమె ఆనందించినది.
అదేవిధంగా, నా ప్రియులారా, ప్రభువు కూడ మిమ్మును అంగీకరించుచున్నాడు. ఆ గొప్ప దేవుడైన, ఆయన మిమ్మును చూచి, ' నా ద్వారా మీరు అంగీకరింపబడియున్నారు' అని అంటున్నాడు. యెషయా 11:4లో బైబిలేమని చెబుతుందంటే, " కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.'' అవును, మీరు దేవునికి విధేయులై ఉండి ఉన్నప్పుడు, మీరు ఆయన ద్వారా అంగీకరించబడతారు. దేవునికి చెందియున్నవన్నియు మీకు చెందినవిగా ఉంటాయి. మీరు దేవుని ప్రజల మధ్య ఏకమై ఉంటారు. దేవుని గొప్ప ప్రజల మధ్యలో మీరును ఒకరై ఉంటారు. దేవుని ద్వారా అంగీకరించబడుట అనునది ఎంత గొప్ప సంతోషమో కదా! ఆ రీతిగా మీరు ఇంపైన పరిమళ సువాసనగా దేవుని కొరకు జీవించుదురు గాక. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. తండ్రీ, నీవు మమ్మును అంగీకరించియున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును మధురమైన సువాసనగా అంగీకరించుము. దేవా, మేము నీ దృష్టిలో మమ్మును సంతోషపెట్టిన యేసు త్యాగానికి మేము కృతజ్ఞులమై యున్నాము. ప్రభువా, నీ యెదుట పరిశుద్ధమును నీకు అనుకూలమునైన సజీవ యాగముగా మా శరీరములను నీకు పరిమళ సువాసనగాను సమర్పించుకొనుటకు మాకు సహాయం చేయుము. దేవా, ఇది నీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుందని తెలుసుకుని, నీ వాక్యంలో ఆనందించేలా మరియు నీ యందు భయభక్తులతో జీవించునట్లుగా మమ్మును నడిపించుము. అపవాది యొక్క కుయుక్తి నుండి మమ్మును రక్షించి మరియు మా శోధనల నుండి మేము విడిపించడానికి మమ్మును బలపరచుము. ప్రభువా, నీ కాపుదల, రక్షణ మరియు కృప మీద నమ్మకంతో మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మా జీవితం నీకు పరిమళ సువాసనగా, మాలో ఉన్న యేసు సన్నిధిని ప్రతిబింబించునట్లు చేయుము. ప్రభువా, ఈ వాగ్దానమును మేము కొనసాగించునట్లుగాను, నీ నామానికి మహిమను తీసుకొని వచ్చునట్లుగా నీ బిడ్డలలో మేము ఒకరముగా జీవించుటనట్లుగా కృపను చూపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.