నా ప్రియ స్నేహితులారా, మన జీవితములో అద్భుతములు చేయుటకు నేడు దేవుడు ఇక్కడ మనతో కూడా ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉన్నప్పుడు ఎటువంటి అద్భుతములను మనము కనుగొనబోవుచున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:3వ వచనములో దానిని గురించి మాట్లాడుచున్నది. ఆ వచనము, "మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను'' ప్రకారం ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదములు మరియు మహాత్కార్యములు మీకు అనుగ్రహించబడియున్నవి. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదాల నిధులు మీరు స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నారా? ఈ వచనములో, యేసుక్రీస్తులో ఇట్టి ఆశీర్వాదాల చేత మనము దీవించబడియున్నాము. యేసును అంగీకరించినవారు ఇట్టి ఆధ్యాత్మిక ఆశీర్వాదములను స్వీకరిస్తారు. ఇవి మనకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కలుగబోవుచున్నవి. పరిశుద్ధాత్ముడు ఇట్టి ఆధ్యాత్మిక ఆశీర్వాదములు మనతో అనుసంధానము కావడానికి మనకు సహాయము చేస్తాడు.

అవి ఎటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు? మొదటి ఆశీర్వాదము రక్షణ. ఇది మన ఆత్మను మరణము నుండి కాపాడే గొప్ప ఆశీర్వాదము. రెండవది, వరములు మరియు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అను ఆశీర్వాదములు. మనము గొప్ప కార్యములను జరిగించు నిమిత్తము, ఇవి మన ఆత్మలో గొప్ప శక్తిని అధికారమును అనుగ్రహించును. మూడవది నిత్యజీవము అనే ఆశీర్వాదము. ఈ లోకములోను మరియు ఆలాగుననే పరలోకములో కూడా మనము నిరంతరము దేవుని ఆనందములో ఆలాగున జీవించెదము. ఇట్టి అద్భుతమైన ఆశీర్వాదములు నేడు మీ మీదికి వచ్చుచున్నందుకై మీరు దేవునికి వందనములు చెల్లించి, పరిశుద్ధాత్మను స్వీకరించండి. ఆయన ఇట్టి చర్యలను మీలో క్రియాత్మకము చేస్తాడు. మీలోనికి ఆయన ఈ ఆశీర్వాదములను తీసుకొని వస్తాడు.

ఈ రీతిగానే, నేను ఒక ఫర్యాయము నేను సెలవు కొరకు ఒక ప్రాంతమునకు వెళ్లినప్పుడు, ఈ ప్రాంతములో నా స్నేహితుడు ఉన్నాడు. కనుకనే, నేను విశ్రాంతిగా, సరదాగా అతనితో సమయమును గడుపుటకు వెళ్లాను. అయితే, అక్కడ సమయము గడుపుచున్నప్పుడు, ఆకస్మాత్తుగా అతడు నాతో, 'శ్యామ్ నాకు తెలిసిన ఒక స్నేహితుడు హాస్పిటల్‌లో ఉన్నాడు అని చెప్పాడు. అతడు పెద్ద వయస్సులో ఉన్న వ్యక్తి పక్షవాతమునకు గురియయ్యాడు. నీవు వచ్చి, అతని కొరకు ప్రార్థన చేస్తావా? అని అడిగాడు. ' అతడు ఆకస్మాత్తుగా చెప్పగానే, నేనేమి చేయాలి అని ఆలోచించాను. నేను దేవుని యందలి ఆత్మస్థైర్యముతో అతనితో కూడా వెళ్లాను. నేను అతనిని చూడగానే, చాలా నిరాశకు గురియై తలవాల్చినట్లుగా ఉండెను. అతడు కేవలం అక్కడ కూర్చుండిపోయాడు. నేను అతని యొద్దకు వెళ్లి, ' నా ప్రియ సోదరుడా, మీ కొరకు నన్ను ప్రార్థించనివ్వండి'' అని చెప్పాను. అయితే, నేను ప్రార్థనలను ప్రారంభించగానే, ఎవరో నన్ను స్వాధీనము చేసుకున్న ఒక అనుభూతి నాలో కలగడము జరిగింది. దేవుని ఆత్మను అనుభూతి చెందాను. ఆయన నన్ను పక్షవాతము కోసము అన్నట్టుగా ప్రార్థన చేయించలేదు. 'మరల, మరల దేవుడు మీ గురించి ఆలోచన చేయుచున్నాడు, యేసు మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్నాడు, ఆయన మిమ్మును మరచిపోలేదు. ఆయన మీ పట్ల మంచి కార్యాలను జరిగిస్తాడు ' అని చెప్పులాగున చేసియున్నాడు. ఆ మాటలనే నేను మరల మరల పునరావృతము చేస్తూ ప్రార్థన చేశాను. కానీ, స్వస్థత కొరకు ఏమాత్రము ప్రార్థన చేయకుండానే, నేను ప్రార్థనను ముగించాను. ముగింపులో అతని కళ్లలో కన్నీరు మిగిలిపోయాయి. కేవలం అతడు ఎంతగానో దుఃఖించుచుండెను. కారణము, అతడు యేసు ప్రేమతో నింపబడ్డాడు. అవును, పరిశుద్ధాత్ముడు మనలను ఎలా ఉపయోగించుకోవాలో ఎరిగి యున్నాడు. ఆధ్యాత్మిక ఆశీర్వాదములను స్వీకరించడానికి, మనలను వినియోగించుకుంటాడు. కనుకనే, మనము ఆయనను స్వీకరించుదామా? నేడు ఇటువంటి ఆత్మీయ ఆశీర్వాదమును మీరు కూడా పొందుకోవాలని తలంచిన్లయితే, నిశ్చయముగా, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి, ఆయన మీకు ఈ లోక మరియు పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదములను ఆయన మీకు అనుగ్రహించి, నేటి వాగ్దానము మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, క్రీస్తు యేసులో ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదంతో మమ్మును ఆశీర్వదించినందుకై నీకు వందనాలు. దేవా, మా ఆత్మను రక్షించి, మమ్మును నీ దగ్గరకు చేర్చే రక్షణ వరమును మాకు అనుగ్రహించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, పరిశుద్ధాత్మ నిన్ను మేము మా హృదయములోనికి ఆహ్వానించుచున్నాము. నీవు మాలోనికి వచ్చి, మమ్మును నీ శక్తిచేత మమ్మును నింపుము. పరిశుద్ధాత్మ వరములు మాలోనికి వచ్చునట్లుగాను, స్వస్థతా వరము, బుద్థి వరమును, పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక వరములను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము పరిశుద్ధాత్మ యొక్క వరములు మరియు శక్తితో నింపబడాలని కోరుకుంటున్నాము. యేసయ్యా, నీ మహిమ కొరకు గొప్ప కార్యములు చేయుటకు మాకు బలమును మరియు అధికారమును అనుగ్రహించుము. దేవా, నిత్యజీవమను వరమును మాకు ఇచ్చినందుకు మరియు నిత్యము నీ సన్నిధిలో జీవించే ఆనందానికి వందనాలు. ప్రభువా, ఈ దివ్య సంపదలను సంపూర్ణంగా మేము అంగీకరించడానికి మా హృదయాన్ని తెరువుము. దేవా, ఈ ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవడానికి మరియు నీ ప్రేమ యొక్క ప్రవాహముగా ఉండటానికి మాకు సహాయం చేయుము. పరిశుద్ధాత్మ దేవా, దయచేసి మా జీవితాన్ని నీ స్వాధీనం చేసుకొని, నీ సత్యంలోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, నీ యొక్క అద్భుతాలు మా ద్వారా పని చేయునట్లుగాను, తద్వారా నీ నామము మహిమపరచబడునట్లు చేయుము. దేవా, మమ్మును మరణము నుండి తప్పించి, రక్షణ మార్గములూనికి నేడు నడిపించుము. అపవాదిని ఓడింపజేసే వరములను మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.