నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ఒక గొప్ప నమ్మకము మనకు కలదు. దేవుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడుచున్నాడు. కనుకనే నేడు ఈ వాక్యమును మీ హృదయాలలో అంగీకరించండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 14:14వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వాగ్దాన వచనము, "యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెను...'' ప్రకారం ఇది ఎంత గొప్ప వాగ్దానము కదా! కాబట్టి, యెహోవాయే నేడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు. కనుకనే, మీరు ఎటువంటి పోరాటాలను ఎదుర్కొన్నను సరే, మీరు ధైర్యంగా ఉండండి. ఆయన మీ పక్షమున యుద్ధము చేస్తాడు.

నా ప్రియులారా, ఈ రోజు మీ వ్యాపారమును తగ్గించడానికి మరియు మీకు నష్టాలను తీసుకొని రావడానికి మరియు మిమ్మును క్రిందికి నెట్టివేయాలని పోటీలు ఏర్పడుచున్నాయేమో? తద్వారా వారు విభిన్న విధాలుగా ప్రయత్నించుచున్నారేమో? లేక మీ ఉద్యోగము కొరకు మరొకరు పోరాడుచున్నారేమో? లేక అనేక కార్యాల చేత మిమ్మును క్రిందికి తీసుకొని రావాలని కోరుచున్నారేమో? అందును బట్టి మీరు ఎంతగానో బాధపడుచున్నారేమో? కానీ, మన యొక్క పని వెళ్లి వారిని శత్రువులనుగా చేసుకోవడము కాదు. వారి యొక్క కుయుక్తులను మనము వినియోగించుకొని, వారికి కాళ్లు లేకుండా చేయడము కాదు. ప్రభువు మన పక్షమున యుద్ధము చేస్తాడు. గనుకనే, మీరు కేవలము ఊరకనే ఉండాలని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. మన యొక్క విజయము వారితో నేరుగా యుద్ధము చేయడము ద్వారా కాదు, కానీ, ప్రార్థనలో పోరాడడము ద్వారా వారితో దేవుడు పోరాడుతాడు. భౌతిక ప్రపంచంలో పోరాడుటకంటే, అందుకు బదులుగా, మీరు చేయవలసిన కార్యమేదనగా, "ప్రభువా, నీవు మా పక్షమున పోరాడుము లేక యుద్ధము చేయుమని'' దేవుని యొద్ద చెప్పాలి. సాధారణంగా కాదు, నా ప్రియ స్నేహితులారా, మీరు మోకాళ్ల మీద పోరాడండి. నిశ్చయముగా మీకు విజయము వస్తుంది.

మా జీవితములో, మేము కూడా ఆలాగున చేయుడము నేర్చుకున్నాము. కాబట్టి, యేసు పిలుచుచున్నాడు మరియు కారుణ్యలో మేము ఎదుర్కొన్న ప్రతి పోరాటములలో కూడా ప్రభువు లేచి, ఆయన మా పక్షమున పోరాడుటకు మాకంటె ముందుగా వెళతాడు. మరియు ఆయన మాకు సంపూర్ణమైన విజయాన్ని అనుగ్రహించాడు. పురాతన కాలపు యుద్ధాలలో తన సైన్యముల కొరకు మరియు తన ప్రజల కొరకు ప్రభువే యుద్ధము జరిగిస్తాడు. ఎలాగనగా, శత్రువులు ఒకరినొకరు నాశనం చేసుకునేంత వరకు గందరగోళాన్ని సష్టించేవాడు. అవును, దేవుడు అద్భుతమైన కార్యములను మన పక్షమున చేస్తాడు. కాబట్టి, మీ శత్రువులను చూచి భయపడకండి.

ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన ఒక తల్లి మరియు కుమార్తె యొక్క సాక్ష్యం నాకు జ్ఞాపకమునకు వచ్చినది. ఆ సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. ఆ తల్లి నాతో ఇలాగున అన్నారు, 'నా భర్త ఎక్కడికి వెళ్లిపోయా డో నాకు తెలియలేదు, నా కుమార్తె, నా భర్త పూర్తిగా విడిపోయినట్లుగా ఉన్నారు. మా కొరకు దయచేసి, ప్రార్థించండి' అని చెప్పారు. అప్పుడు నేను ఆమెతో కలిసి ప్రార్థించగా, మేము ఆశ్చర్యము పొందునట్లుగా, ఆమె భర్త ఎక్కడ నుండి వచ్చాడు. తిరిగి వచ్చిన ఆమె భర్తతో కూడ వారు మరుసటి నెలలో, ఆ కూటములలో పాల్గొన్నారు. అప్పుడు, అతడు తన భార్యతో, " నేను నీతో కూడా కలిసి జీవించాలని కోరుచున్నాను'' అని చెప్పాడు. చూడండి, ఆమె ప్రార్థనలో పోరాడినది. కనుకనే, ప్రభువు ఆమె పక్షమున యుద్ధము చేశాడు మరియు వారు కలిసి జీవించుటకు కృపను చూపించాడు. రండి! మనము కూడా ప్రార్థించి, ఇటువంటి ఆశీర్వాదమును పొందుకుందాం. నా ప్రియులారా, నేడు మీ జీవితములో కూడ పోరాటాలను ఎదుర్కొంటున్నట్లయితే, నేడే మీరు మీ మోకాళ్లపై ప్రార్థనలో దేవుని సన్నిధిలో పోరాడండి, అప్పుడు దేవుడు మీ పక్షమున యుద్ధము చేసి, మీకు విజయమును దయచేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరాక్రమవంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నేడు ఈ వచనమును మేము స్వతంత్రించుకొనుచున్నాము. దేవా, మా యొక్క పోరాటము ప్రార్థనలో, కనుకనే, దేవా, నేడు మా సమస్యలను బట్టి పోరాడుటకును మరియు మోకాళ్లతో ప్రార్థించుటకును మాకు నేర్పించుము, అందుకు మాకు కావలసిన బలమును, శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు నీ యొద్దకు వచ్చుచున్నాము. మా భారాలన్నింటిని నీ పాదాలపై ఉంచుచున్నాము. దేవా, నీవు మా యుద్ధాలతో పోరాడి మాకు విజయాన్ని అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు మా పక్షమున యుద్ధము చేస్తావని మా పోరాటల మధ్యలో మేము మౌనముగా ఉండుటకు మాకు నేర్పించుము. యేసయ్యా, మా జీవితంలోని ఏ ప్రాంతంలోనైనా మేము సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, భయము లేదా ఇతరుల పన్నాగల వలన మమ్మును కృంగిపోనివ్వకుండా చేయుము. బదులుగా, ప్రార్థనలో నీ వైపు తిరగాలని, మా మోకాళ్లపై పోరాడాలని మరియు అన్నింటినీ నీకు అప్పగించాలని మాకు గుర్తు చేసిందుకై నీకు వందనాలు. దేవా, నీవు బైబిల్‌లో నీ ప్రజల కొరకు పోరాడినట్లుగానే, ఇప్పుడు నీవు మా కొరకు మరియు మా సమస్యల పట్ల పోరాడతావని మేము నమ్ముచున్నాము. దేవా, మా శత్రువులను ఓడించి, అది వ్యాధి, అప్పు, సంతానలేమి, ఉద్యోగ సమస్యలు ద్వారా బ్రద్ధలు చేయబడిన మా ప్రతి పరిస్థితిలో నీ శాంతి మరియు పునరుద్ధరణ మా మీదికి వచ్చునట్లు చేయుము. దేవా, నీవు మా పక్షముగా ఉండి, పోరాటల మధ్య మాకు విజయమును అనుగ్రహించుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.