నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మన జీవితములో ఒక ప్రత్యేకమైన కార్యమును జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుకనే, మీరు ఆయన యొద్ద నుండి పెద్ద మరియు గొప్ప కార్యాలను ఎదురు చూడండి. ఎందుకంటే, ఆయన ఎంతో శక్తిమంతుడై యున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:37 వ వచనము నుండి ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఆ వచనం, "అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము'' ప్రకారం దేవుడు ఈ రోజు మిమ్మును విజయం పొందిన వారినిగా చేయబోవుచున్నాడు. విజయము పొందినవారుగా ఆయన మిమ్మును బలపరుచుచున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, నేడు మీ జీవితములో ఉన్నతముగా పైకి రావడానికి అనేకమైన సవాళ్లు ఉన్నాయి అని మీరు చెప్పుచుండవచ్చును. ఇంకను " ప్రభువా, మాకెంతో కొదువ ఉన్నది, మేము ముందుకు వెళ్లలేకపోవుచున్నాము, మేము ముందుకు వెళ్లడానికి మాకు ఏ మార్గము కూడా కనబడుట లేదు. మేము ఏ విధంగా విజయమును పొందినవారముగా అవుతాము?'' అని అంటున్నారా? అయితే, చింతించకండి. నిశ్చయముగా, దేవుడు అన్ని విషయాలలో మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక యౌవనస్థురాలు ఉండెను. ఆమె రెండు సంవత్సరాల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయినది. ఆమె ఎంతో చిన్న బిడ్డ. కానీ, తండ్రి లేకుండా పెరగవలసి వచ్చినది. ఆలాగే వారు ధనికులు కూడా కాదు. ఆ బిడ్డ యొక్క తల్లి వారి జీవనోపాధి కొరకు ఎంతగానో కష్టపడి పనిచేయుచుండెను. ఆమెకు నలుగురు బిడ్డలు. ఎంతో కష్టపడి పనిచేసి, వారిని గురించి జాగ్రత్త పడడానికి ప్రయాసపడెను. ఆమెకు అసాధ్యమైనకార్యముగా అనిపించినది. కానీ, ఈ యౌవనస్థురాలు పెద్ద కలలను సార్థకము చేసుకొనుటకు అవకాశము లేదు అని అనుకొనెను. ప్రతిరోజు ఏదో ఒక విధంగా జీవితాన్ని కొనసాగించాలి. కనుకనే, ఎంతగానో చీకటి చేత నింపబడిపోయినది. ఇటువంటి సమయములో యేసు పిలుచుచున్నాడు యౌవన భాగస్థుల పధకమును గురించి ఎవరో ఆమెకు చెప్పారు. ఆమె తల్లి యౌవన భాగస్థుల పధకములో విశ్వాసముతో తన బిడ్డలనందరిని భాగస్థులుగా చేర్పించారు.
ఈ యౌవనస్థురాలు తన పాఠశాల విద్యను ముగించుకునే సమయములో, ఆమె ఎలాగైన వైద్య విద్యలో ప్రవేశము పొందాలని తలంచెను. అది అసాధ్యమైనను సరే, దానిని పొందుకోవాలని ఆశపడెను. కనుకనే, ఆమె నీట్ పరీక్షలు వ్రాసినది. మహా అద్భుతముగా, నీట్‌లో ఉత్తీర్ణురాలై ఉన్నత మార్కులను సంపాదించుకున్నది. తద్వారా, కొల్‌కత్తాలో ఉన్న ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయములో ఆమెకు సీటు లభించినది. ఆమె నమ్మలేకపోయినది. ఆమె ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ, గంతులు వేయుచూ, ప్రభువును స్తుతించుచుండెను. ఆ విద్యలో ఎంత కష్టమైనను సరే, ఆమె ఎమ్‌బిబియస్ చదువులను సంపూర్తి చేసుకొనెను. ఆ తర్వాత, ఆమె వైద్య వృత్తిని కొనసాగించుకొనాలని తలంచెను. అందుకోసము పోటీ పరీక్షలో ఆమె గెలుపు పొందవలసి వచ్చెను. ఎంతో మంది ఫోటీ పడుచుండెను. అయితే, దానిని సాధించడానికి ఆమెకు బలమును మరియు సామర్థ్యమును అనుగ్రహించాడు. నా స్నేహితులారా, ఆమె ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రభుత్వ వైద్య శాఖ అధికారిగా పనిచేయుచుండెను. ఇంకను ఆమె ఉన్నతమైన వేతనముతో, అనేకమంది పట్ల ఆమె జాగ్రత్త తీసుకొనులాగున దేవుడు ఆమెను స్థిరపరచాడు.
అదేవిధంగా, మా పెద్ద అక్కలు ముగ్గురు కూడా ఉన్నతంగా వర్థిల్లుచున్నారని తెలియజేసెను. ఇంకను అనేక జీవితాలకు ఆశీర్వాదం మరియు ఆమె కుటుంబానికి ఆనందం మరియు స్థిరంగా నిలిచియుండుటకు దేవుడు ఆధారముగా ఆమెకు నిలిచెను. వారు అప్పటి వరకు జీవించడానికి నిరీక్షణలేదు అన్నట్లుగా ఉండెను. కానీ, వారి కష్టాలను జయించునట్లుగా దేవుడు వారికి తగిన సామర్థ్యమును అనుగ్రహించాడని ఆమె తన సాక్ష్యమును పంచుకున్నారు. అంతమాత్రమే కాదు, వారి జీవితములో నిరీక్షణ లేని చోట దేవుడు వారిని ఉన్నతమైన మార్గములలో స్థిరపరచాడు. నేడు దేవుడు ఆలాగున మీకును జరిగించుటకు ఇష్టపడుచున్నాడు. దీనిని మీరు నమ్ముచున్నారా? ఆలాగైతే, నాతో కలిసి ప్రార్థన చేయండి. ఆయన మీకు బలమైన దేవుడు. ఉల్లాసంగా ఉండండి మరియు ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును కూడా స్థిరపరచి, పైకి లేవనెత్తి, ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నిరీక్షణ మరియు విశ్వాముతో నిండిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీ ప్రేమ ద్వారా మేము అన్నిటిలోను అత్యధికమైన విజయమును పొందుకొనునట్లుగా మమ్మును మార్చుము. దేవా, నేడు మా సవాళ్ల మరియు కష్టాల నుండి మమ్మును పైకి లేవనెత్తి, మేము వర్థిల్లే మార్గాలలోనికి మమ్మును నడిపించుము. దేవా, నీవు అసాధ్యమైన కార్యములను చేయగల నీ శక్తిపై మేము నమ్మకముంచినందున మా నమ్మకాన్ని బలపరచుము. ప్రభువా, మా ప్రతి కష్టాన్ని అధిగమించి, నీ ఉద్దేశములలో ఆనందాన్ని పొందేందుకు మాలో ధైర్యాన్ని నింపుము. దేవా, నీ సంకల్పం ప్రకారం మా జీవితాన్ని స్థాపించుము, యేసయ్యా, మా కష్టాలను జయించునట్లుగాను మరియు నీ ఆశీర్వాదాలు మా జీవితములో పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, మా ప్రతి పరిస్థితిలలోను నీ ప్రేమ మమ్మును స్థిరపరచునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితములో ఏ మార్గము కనిపించనప్పుడు, నీవు విజయము పొందే మార్గము ద్వారా మేము వెళ్లునట్లుగా చేసి, మాకు శాంతి మరియు బలాన్ని దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.