నా అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 15:2వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, "యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను'' అని తెలియజేయుచున్నది. అవును, నేడు దేవుడు తన బలాన్ని మీ జీవితంలోకి తాజాగా మరియు శక్తివంతమైన విధంగా కురిపించబోవుచున్నాడు. కనుకనే, మీరు ఉల్లసించండి.
నా ప్రియులారా, యేసు, "నీ బలహీనతలో నా బలం పరిపూర్ణమగును మరియు నేను నా బలమును మీకు అనుగ్రహిస్తాను'' అని చెప్పాడు. గుర్తుంచుకోండి,ఈ రోజు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారా? మీ జీవితంలో కార్యాలు జరిగించలేనంతగా బలహీనంగా ఉన్నారా? మీ యొక్క కుటుంబములోను, ఉద్యోగములోను, మీ యొక్క సేవా పరిచర్యలోను, మీరు కోరుకున్న మార్పును తీసుకురాలేక భారంగా భావించవచ్చును. కానీ ప్రభువు మీతో ఇలా చెప్తున్నాడు, " నేను మీకు బలం, ఆపత్కాలంలో నేను మీకు నమ్ముకొనదగిన సహాయకుడనై యున్నాను. నేను మీరు నన్ను గూర్చి ఆనందించునట్లుగా చేయుచున్నాను. నేను మిమ్మును సంతోషింపజేస్తాను. నేను మీ హృదయంలో ఒక కొత్త గానమును ఉంచుచున్నాను, నా మంచితనాన్ని మరియు విశ్వాసాన్ని ప్రకటించే ఒక గానముగా అది ఉండబోవుచున్నది'' అని సెలవిచ్చుచున్నాడు.
అవును, నా ప్రియులారా, మీరు మీ విజయమును గానము చేయడము కాదు, యేసును ఆరీతిగా గానము చేసెదరు. ఎందుకంటే, ఆయనే వర్థిల్లతను తీసుకొని వస్తాడు. మీ హృదయమును కలవరపడనీయ్యకండి. యేసు మీకు సహాయము చేస్తాడు. ఈ రోజున మీ ఆత్మ, దేహమును, జీవమును ఆయనకు స్వాధీనపరచుకొనండి. ఆయన బలము ఇప్పుడే మీ మీదికి వచ్చుచున్నది. ఈ పోరాట సమయములో కూడా ఆయన హస్తము శక్తివంతంగా చలించుట మీరు చూచెదరు. ఆయన మిమ్మును ఆదరిస్తాడు, మిమ్మును హెచ్చిస్తాడు మరియు మీ హృదయాన్ని ఆనందంతో నింపుతాడు. మీ హృదయం కలత చెందకండి, ఎందుకంటే ప్రభువు తానే మీ బలం. ఆయన మార్గం లేనట్లుగా కనిపించే మార్గాన్ని సరాళము చేస్తాడు మరియు ఆయన మీకు బలమైన దుర్గము, మీ ఆశ్రయం మరియు మీ కోటగా ఉంటాడు.
నా ప్రియులారా, ఈ రోజు, మీ ఆత్మ, మీ జీవము మరియు మీ శరీరం సమస్తమును ఆయనకు అప్పగించడానికి కొంత సమయం కేటాయించండి. ఆయనకు ప్రతి చింత మరియు ప్రతి భయాన్ని అప్పగించండి మరియు ఆయన బలం మీ మీదికి వచ్చునట్లుగా చూడండి. ఆయన మీ ఆత్మను, మీ నిరీక్షణను పునరుద్ధరిస్తాడు మరియు ఆయన సమాధానమును మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఎటువంటి పోరాటములు ఎదుర్కొన్నప్పటికి, మీరు అడుగు లేదా ఊహించిన వాటన్నిటికంటే ఎక్కువగా, సమృద్ధిగా ఆయన చేయగలడని గుర్తుంచుకోండి.
నా ప్రియులారా, కాబట్టి, ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ఆనందంతో ప్రభువుకు గానము చేయండి. ఆయన బలం పరిపూర్ణమైనది మరియు ఆయన మీకు స్థిరంగా నిలబడడానికి మీకు సహాయం చేస్తాడు. దేవుని యందు ఆనందించండి. ఎందుకంటే, ఆయన మీ బలం మాత్రమే కాదు, మీ గానము, మీ రక్షకుడు మరియు మీ విజయం కూడా! కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
బలవంతుడైన మా ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. యేసయ్యా, నీవే, మా గానము మరియు ఆనందమునై యున్నావు. కనుకనే, ప్రియమైన ప్రభువా, మా బలహీనతను మరియు నీ బలం కొరకు మా లోతైన అవసరాన్ని అంగీకరిస్తూ ఈ రోజు మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మేము భారంగా భావించే ప్రతి ప్రాంతంలో - మా ఆర్థిక, కుటుంబం, ఉద్యోగం మరియు మా పరిచర్యలో కూడా మేము నీకు సమస్తమును అప్పగించుచున్నాము. దేవా, బలహీనంగా ఉన్న మా పట్ల నీవే మా బలం, ఆపత్కాలములో మేము నమ్ముకొనదగిన సహాయకుడవు. ప్రభువా, మా బలహీనతలో నీ బలం పరిపూర్ణమైందని నీ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. దేవా, నీ సంతోషంతో మా హృదయాన్ని నింపుము, నీ మంచితనం గురించి మా ఆత్మ గానము చేయునట్లుగాను మా జీవితాలను మార్చుము మరియు ప్రభువా, మా ఆశ్రయం, మా బలమైన కోట మరియు మార్గం లేని చోట మాకు మార్గాని సరాళము చేయుము. దేవా, మా ఆత్మను ఉత్తేజపరచుము మరియు మా నిరీక్షణను పునరుద్ధరించుము. దేవా, మా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మా హృదయాలను మరియు జీవితాలను అధిగమించునట్లు చేయుము. ప్రభువా, నీవు బలహీనమైన మరియు వృద్ధిలేని మా జీవితాలలోను నీవు నీ యొక్క బలమును మరియు అభివృద్ధిని కలుగజేసి మేము నీ కీర్తిని మరియు మహిమను గానము చేయునట్లుగా మమ్మును మార్చుము. యేసయ్యా, మేము నిన్ను మా గానముగాను, మా రక్షకుడిగా మరియు మా విజయంగా గానము చేయునట్లుగా మమ్మును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము, మేము బలహీనపడిన ప్రతి మార్గాన్ని విజయవంతముగా మార్చుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.