నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు నుండి మీ కొరకు దేవుని వాగ్దానంతో నేను మీకు శుభములు తెలియజేయడానికి నేను ఎంతగానో ఆనందించుచున్నాను. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 కొరింథీయులకు 3:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు'' అని వ్రాయబడియున్నది. ఒకవేళ, నేడు మీరు, 'నా జీవితములో నేను ఎన్నో నాటుచున్నాను, నేను చేయుచున్నవన్నియు విఫలమవుచున్నాయి, నేనేమి చేసినను అది వర్థిల్లడము లేదు, నా చదువులలో వైఫల్యము, నా వ్యాపారములోను, ఉద్యోగములో నష్టము కలుగుతుంది, నా కుటుంబ జీవితములో పోరాటాల ద్వారా సమాధానము లేదు, దేవుడు నా పట్ల ఏమి ఉద్దేశము కలిగియున్నాడో నాకు తెలియలేదు. నా జీవితములో విజయము కలుగుతుందా? అని చెప్పుకుంటూ బహుశా! మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, మనము ఏమి చేసినప్పటికిని, దేవుని ఆశీర్వాదము అందులో లేనట్లయితే, అది ఎదగదు, వర్థిల్లదు.
నా ప్రియులారా, ఈ రోజు మీరు వర్థిల్లాలని మీ పట్ల కోరుచున్నాడు. మీరు చేయునదంతయు ఆయన దీవిస్తాడు. నేను ఇందుకోసము ఎన్నో కష్టాలు పడలేదు, అని మీరు అంటున్నారు. కానీ, మీరు చేయుచున్న ప్రతి చిన్న పనిని, నేడు దేవుడు వర్థిలింపజేస్తాడు. ఇంకను మీరు చేయుచున్న చిన్న కృషిని కూడా ప్రభువు ఆశీర్వదిస్తాడు. కనుకనే, మీరు చింతించకండి.
మనము బైబిల్లో 1 రాజులు 17వ అధ్యాయములో మనము ఏలీయా మరియు ఒక విధవరాలి యొక్క కథను మనము చూడగలము. ప్రభువు సారెపతు అను గ్రామానికి ఏలీయాను వెళ్లమన్నాడు. "అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యాలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము; నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని'' అని చెప్పాడు. ఏలీయా ఆ స్థలమునకు వెళ్లినప్పుడు, అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి, ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. భూమిమీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు (1 రాజులు 17:8-14).
నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, మీ జీవితము పట్ల మీరు కొన్ని ప్రణాళికలను కలిగియున్నారేమో? నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఏది సరిపోలేదు అంటున్నారా? నా జీవితము అంతమైపోవుచున్నది. అంతా అయిపోతుంది. కానీ, ప్రభువు మిమ్మును మరియు మీ కుటుంబాన్ని దీవించడానికి మీ యొద్దకు వస్తున్నాడు. ఆయన మీ వ్యాపారాన్ని దీవించుచున్నాడు. మీ ఉద్యోగమును మరియు మీ కుటుంబ జీవితమును, మీ చదువులను దీవిస్తాడు. మీరు ఏమి చేసినను, అన్నిటిలో మీరు వర్థిల్లుతారు. ప్రతి కార్యాలలోను ఆశీర్వాదాలు పొంగిపొర్లుతాయి. మీరు అభివృద్ధిని చూస్తారు. అవి వస్తూనే ఉంటాయి, దీవెనలు వస్తూనే ఉంటాయి. మీరు చేయువాటన్నిటినిలో మీరు అభివృద్ధి చూస్తారు.
కాబట్టి, నా ప్రియులారా, మీరు ధైర్యము వహించండి, ప్రభువు ఈ రోజు మిమ్మును దీవించుచున్నాడు. మరియు మీరు చేయు ప్రతి ప్రయత్నములలోను మీరు విస్తరింపబడతారు. భయపడకండి, నిరాశ చెందకండి. ప్రభువు మిమ్మును దీవిస్తాడు మరియు మీకు విజయమునిస్తాడు. ఈ రోజు ఇటువంటి గొప్ప దీవెనలు పొందుకుందామా? నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహా ఘనుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఎదుగుదలను ఇచ్చువాడవు, అభివృద్ధిని ఇచ్చువాడవు నీవే. కనుకనే మేము చేయు మా చేతి పనులను దీవించుము. దేవా, మా ఉద్యోగములోను, వ్యాపారములోను మరియు కుటుంబములో నష్టములన్నిటిని తొలగించి, మేము అభివృద్ధిని చూచునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా కుటుంబ జీవితములో సంతోషమును మరియు ఆనందమును చూచునట్లుగా మాకు మరియు మా చదువులలోను దీవెనలు పొందునట్లు సహాయము దయచేయుము. దేవా, మా జీవితములో వైఫల్యమును తొలగించుము. మా విశ్వాస్యతను బట్టి మమ్మును ఘనపరచండి. ప్రభువా, నీవు లేకుండా ఏది చేసినను, అది నిజంగా వర్ధిల్లదని తెలిసి మా చింతలు మరియు కష్టాలతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మా జీవితం, మా కుటుంబం మరియు మా పనులలో నీ యొక్క ఆశీర్వాదాన్ని కురిపించుము, తద్వారా మేము చేయుచున్న ప్రతి చిన్న ప్రయత్నం నీ దయతో విస్తరింపజేయునట్లుగా మాకు నీ కృపను చూపుము. దేవా, సారెపతు విధవరాలికి కరువు సమయంలో నీవు అందించిన వర్థిల్లత వలె నీవు మా జీవితంలో ప్రతి అవసరాన్ని తీరుస్తావని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే, నీవు వృద్ధి కలుగజేయు దేవుడవు. దయచేసి నీ యొక్క వాగ్దానాలను పూర్తిగా విశ్వసించేలా మా విశ్వాసాన్ని బలపరచుము మరియు మా భయాలను వీడడానికి మాకు ధైర్యాన్ని అనుగ్రహించుము. ప్రభువా, కృతజ్ఞతతో కూడిన హృదయంతో మేము ఈరోజు నీ సమృద్ధియైన ఆశీర్వాదాలను పొందుకొని, ఆనందించునట్లు చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.