నా అమూల్యమైన స్నేహితులారా, దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. ఎందుకనగా, యేసు నామమునకు మీరు భయపడుచున్నారు కాబట్టి, ఇంకను మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులగుచున్నారు. కనుకనే, ఆయన మీ నిమిత్తమై తన రెక్కల చాటున ఆరోగ్యమును కలిగి యుండి, ఆయన మీ మీద ఎగరనై యున్నాడు, మీ కోసం జాగ్రత్త వహించడానికి ఆయన నీతిపరుడని మీ పట్ల చూపించుకొనునట్లుగా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మలాకీ 4:2వ వచనములో ఈలాగున మనకు తెలియజేయుచున్నది. ఆ వచనము, ‘‘ అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు’’ ప్రకారం నేడు ఆయన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యమును మీకు కలుగజేస్తాడు. 

అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. మధురై ప్రాంతమునకు చెందిన రీను కృతికా. ఆమె దంత వైద్యములో బిడియస్ డిగ్రీని పూర్తి చేసుకొనెను. ఆమె చదువులలో మొదటి శ్రేణిలో ఉన్నతమైన మార్కులు వచ్చాయి. ఆమె తన యొక్క పీజియైన ఉన్నత చదువులను పూర్తి చేసుకోవాలనుకొనెను. ఆమెకున్న అవసరతల నిమిత్తమై ప్రార్థనా గోపురమునకు వచ్చి, ప్రార్థనా విన్నపమును విన్నవించుకొని ప్రార్థనా యోధులను ప్రార్థించమని కోరుకొనెను. మహా అద్భుతముగా, ఆమెకు పీజి విద్యలో దేవుడు అవకాశమును కల్పించాడు. అయినప్పటికిని, ఆ కోర్సు చాలా కష్టముగా ఉన్నందున, నేను ఇందులో ఎందుకు చేరాను అని అనుకొనెను. తద్వారా, ప్రతిరోజు తనతో కలిసి ఎవరైన ప్రార్థన చేయు టకు దేవుని సహాయము నిమిత్తము ప్రార్థనా గోపురమునకు ఫోన్ చేయుచుండెను. ప్రార్ధనా యోధులు దేవుని యొక్క వాక్యమును ఉపయోగించి, ఆమెతో కలిసి ప్రార్థన చేయుచుండగా, సమూలాగ్రముగా ఆమె జీవితములో మార్పు వచ్చినది. 

తన యొక్క చివరి పరీక్షలలో అగ్రస్థానములో ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఆమె ఒక వ్యక్తిగా తను కూడ నిలిచినది. సుస్థిరమైన వైద్యశాలలో దేవుడు ఆమెకు ఉద్యోగమును అనుగ్రహించాడు. ఆ తర్వాత, దేవుడు ఆమెకు వివాహ జీవితమును దయచేశాడు, మంచి వ్యక్తితో ఆమెకు వివాహము జరిగినది. తన యొక్క భర్త అత్యుత్తమ వైద్య కళాశాలలో పీజి డిగ్రీని పూర్థి చేసిన వ్యక్తిగా అక్కడ ఉండెను. మొట్టమొదటగా వివాహ సంబంధముగా ఈ యొక్క బాంధవ్యము ఆమెకు దేవుడు కలిగించాడు. వెనువెంటనే ఆమెకు వివాహము జరిగినది. ఆమె ఈలాగు చెప్పినది, దేవుడు నా జీవితములో సమస్తమును శ్రేష్టమైన వాటిని అనుగ్రహించాడు. ఆమెకు ఎంతగానో విలువ నిచ్చే అందమైన బైబిల్‌ని మేము వారి వివాహము జరుగుచున్న సందర్భములో వారి కొరకు పంపించాము. ఎంత అద్భుతమైన సాక్ష్యము కదా!

అవును, నా ప్రియులారా, నిజముగా మీరు దేవుని నామమందు భయభక్తులు కలిగి ఆయన మిమ్మును ఆశీర్వదించుటకు మీరు ఆయన యందు వేచి యున్నట్లయితే, తన రెక్కల క్రింద స్వస్థతను కలిగియున్న వానిగా, మీ మీదకు ఆయన లేచి, గొప్ప కార్యములను  మీ నిమిత్తము ఆయన జరిగించనై యున్నాడు. ఇప్పుడే, మీ నిమిత్తమై ప్రార్థన చేయగోరుచున్నాను. నేటి వాగ్దానము ద్వారా నా అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. 

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా జీవితాన్ని నీ వాక్యంతో సరిదిద్దడం ద్వారా నీ పేరును గౌరవించడానికి మరియు ఘనపరచడానికి నీవు మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము చెప్పుచున్న లేదా చేయుచున్న ప్రతిదానిలో మొదట నిన్ను వెదకడానికి నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, మా ప్రయత్నాలన్నిటికి నీవు కేంద్రంగా ఉండాలని కోరుకుంటున్నాము. దయచేసి మా మార్గాలను నిర్దేశించునట్లుగాను మరియు నీ చిత్తానుసారంగా నడవడానికి నీ ఆత్మతో మమ్మును నడిపించుము. దేవా, మేము ఒక అద్భుతం కోసం నిన్ను విశ్వసించుచున్నప్పుడు, నీవు నీ రెక్కలలో స్వస్థతతో పైకి లేస్తావనియు, మా వ్యాధులన్నిటిని ముట్టి స్వస్థపరుస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా పట్ల సమస్తమును సరిగ్గా ఉంచుతావనియు మరియు నీ ఘనత కొరకు ఎన్నో  సాధించడానికి మాకు సహాయం చేస్తావనియు మేము విశ్వసించుచున్నాము. ఎందుకంటే నీవు నీతిమంతుడవైన దేవుడవు. ఇంకను దేవా, చదువుకుంటున్న మా జీవితాలలో ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించుము, నీ జ్ఞానము మా ఆత్మలో ప్రవహించునట్లు చేయుము. అన్నిటిని అవగాహన చేసుకునే జ్ఞానమును దయచేయుము. మా అందరి జీవితములో చదువుల పట్ల ఉన్న భయమును తొలగించుము. ఉద్యోగము కొరకు వేచియున్న మా జీవితములో ఒక మంచి ఉద్యోగమును దయచేయుము. ప్రభువా, నీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యమును మాకు దయచేయుము. దేవా, ఈనాటి నుండి మేము విభిన్నమైన వ్యత్యాసమును చూచునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.