నా అమూల్యమైన స్నేహితులారా, నేటి దినమున దేవుని వాక్యమును మీ యొద్దకు తీసుకొని రావడము గొప్ప సంతోషముగా నేను భావించుచున్నాను. దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. నిశ్చయముగా ఆయన మిమ్మును పైకి లేవనెత్తును. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 75:10వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో వాక్యము ఈలాగున తెలియజేయుచున్నది, "...నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును'' అన్న వచనము ప్రకారము దేవుడు నిశ్చయముగా, మీరు ఎట్టి పరిస్థితులలో ఉన్నను సరే, దానిని నుండి ఆయన మిమ్మును పైకిలేవనెత్తుతాడు.

అదేవిధంగా ఒక అద్భుతమైన సాక్ష్యమును నేడు నేను మీతో పంచుకోవాలని కోరుచున్నాను. సహోదరి సాల్సా తన చిన్న కుమార్తెను గర్భము ధరించియున్న సమయములో ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత ఆమెకును మరియు ఆమె పెద్ద కుమారునికి నివసించడానికి గృహము లేదు. వారు ఒక చిన్న పూరి పాకలో నివాసము చేస్తున్నారు. అక్కడే ఆమె తన రెండవ బిడ్డకు జన్మనిచ్చినది. చాలా కష్టతరమైన పరిస్థితులలో ఆమె తన బిడ్డలను పెంచారు. భోజనము చేయడానికి ఆహారము లేదు. ఆమె చాలా కష్టపడి పనిచేసి డబ్బును సంపాదించేవారు. అక్షరాల కూలి వలె పనిచేసేవారు. ప్రతిరోజు కూడ దినసరి వేతనము కోసం అన్నట్టుగా కూలికి పనిచేసేవారు. అటువంటి సమయములోనే, యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును గురించి వారు విన్నారు. అక్కడ సమర్పించబడిన ప్రార్థనల ద్వారా ఆమె ఎంతగానో ఆశీర్వదించబడెను. కనుకనే, ఆమె తన యొక్క చిన్న సంపాదనలో నుండి పరిచర్యకు సహకరించడం ప్రారంభించింది. అయినప్పటికిని, ఇతరులను రక్షించుటకును మరియు వారి పట్ల జాగ్రత్త వహించు నిమిత్తము ఆమె పరిచర్యకు తన కానుకలు సమర్పిస్తుండగా, దేవుడు ఆమెను ఆశీర్వదించడము ఆయన ఆరంభించియున్నాడు. యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమము చూచుటకు ఆమె ప్రారంభించినది. అదియు కూడ తన పొరుగువారి యింటిలో నుండి చూస్తుండగా, ఆ కార్యక్రమములో నేను ప్రార్థన చేసిన ప్రతిసారి నా జీవితములో కూడ ఒక అద్భుతము జరుగుతుందా? అని తలంచుకొనుచుండేది.

ఒకరోజున నేను దేవుని యొక్క వాక్యమును అందించుచుండగా, నా మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా ఆమెతో మాట్లాడి ఉన్నాడు. నేను చెప్పాను, ' దేవుడు ఇప్పుడు మిమ్మును లేవనెత్తుచున్నాడు. దేవుని చిత్తము మీ జీవితములో పరిపూర్ణము చేయబడుతుంది.'' ఆ యొక్క వాక్కులే ఆమె హృదయములోనికి స్వస్థతను కలిగించే గుగ్గిలము వలె ప్రవేశించాయి. ఆ ప్రార్థన తర్వాత దేవుడు ఆమె జీవితములో పనిచేయుటకు ప్రారంభించాడు. ఆమె పెద్ద కుమారుడు తన యొక్క స్నేహితునితో కలిసి ఒక వ్యాపారమును ప్రారంభించాడు. ఇప్పుడు అతడు తన స్వంత వ్యాపారములో విస్తరించాడు. దేవుడు ఆ కుటుంబమును ఎంతగానో ఆశీర్వదించాడు. వారికి ఇప్పుడు స్వంత గృహమున్నది. ఎంత సంతోషము కదా! వారిని చూచి, ప్రతి ఒక్కరు కూడ నిర్ఘాంతపోయారు. నిజముగా దేవుడు వారిని పైకి లేవనెత్తి యున్నాడు మరియు వారి కొమ్ములను హెచ్చించియున్నాడు. నా స్నేహితులారా, నేడు మీ కొరకు కూడ ఆలాగున చేయగలడు. దేవుని యొక్క వాక్యము చెబుతుంది, 'ఆయనే, మన తలను పైకెత్తువాడనియు' మరియు మీరు ఎక్కడైతే, అవమానము, కించపరిచే విధానము, పేదరికమును ఎదుర్కొన్నారో, అక్కడే దేవుడు మిమ్మును పైకి లేవనెత్తువాడై యున్నాడు. అందుచేతనే, యేసు సిలువ మరణము పొందునంతగా, తన్నుతాను తగ్గించుకొని యున్నాడు. తద్వారా మీ యొక్క పేదరికమును అర్థము చేసుకొని, మిమ్మును ఆయన నేడు దీవించుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే, భయపడకండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.


Prayer:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, మేము ఈ రోజు కృతజ్ఞత మరియు నిరీక్షణతో నిండిన హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీవు నీతిమంతులను పైకి లేపుతావని వాగ్దానం చేసినందుకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నీ బిడ్డలైన మా మీద కారుణ్యమును చూపించుము. మా జీవితములో అత్యల్పస్థాయిలో ఉన్న మమ్మును ఉన్నత స్థాయి లేవనెత్తుము. దేవా, మా చేతిలో ఏమి లేదు, మాకు సహాయము చేయువారెవరు లేరు. కానీ, నీవు మా పరలోకపు తండ్రి గనుకనే, మేము ప్రార్థన ద్వారాను, ఇతర విధానముల ద్వారాను, నమ్మకముగా పరిచర్యకు కానుకలు సమర్పించుకొనుటకు సహాయము చేయుము. ప్రభువా, మా కష్టాలు మరియు సవాళ్ల మధ్య కూడా నీవు మా జీవితంలో పనిచేస్తున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా ప్రస్తుత పరిస్థితి నుండి మమ్మును పైకి లేవనెత్తుమని మేము కోరుచున్నాము. దేవా, మా విశ్వాసాన్ని బలపరచుము మరియు మా జీవితానికి నీ పరిపూర్ణ సమయం మరియు ప్రణాళికపై నమ్మకం ఉంచడంలో మాకు సహాయము చేయుము. యేసయ్యా, మా తలను పైకి ఎత్తువాడవని తెలిసి మా చింతలను, భయాలను నీకు అప్పంచుచున్నాము. దేవా, నీ నెమ్మదితో మమ్మును నింపుము మరియు నీ జ్ఞానముతో మమ్మును నడిపించుము. ప్రభువా, మాకు అవసరమైన సమయంలో కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేందుకు మాకు సహాయం చేయుము. దేవా, మా వేదనను అర్థం చేసుకున్నందుకు మరియు సిలువపై నీ త్యాగానికై వందనాలు చెల్లిస్తూ, నీవు ఎల్లప్పుడూ మాతో ఉంటావనియు, ఇది మాకు నిరీక్షణను మరియు నమ్మకాన్ని కలిగించుటకై నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా, మా కొమ్ములను హెచ్చించి, మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.