హలో నా ప్రియ స్నేహితులారా, ఈ నూతన సంవత్సరములో మీ అందరితో మాట్లాడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ 2025వ సంవత్సరములో దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైన వాగ్దానమును కలిగియున్నాడు. ఆ వాగ్దానము బైబిల్ నుండి కీర్తనలు 121:5వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును'' ప్రకారం, మిమ్మును కాపాడువాడు మన దేవుడైన యెహోవాయే. కనుకనే, మీరు భయపడకండి.

అవును, నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువు మిమ్మును కాపాడుటకు ఆయన మీ వైపు చూస్తున్నాడు. అవును, మీకు ఎటువంటి కీడు ఎదురైనప్పటికిని సర్వశక్తిమంతుడైన నీడలో మిమ్మును మీరు భద్రపరచుకోండి. సాదారణంగా, ఆట స్థలములో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఉండుట చూచినప్పుడు, వారు తమ పిల్లలను గమనించుకోవడం లేదేమో అని అనుకుంటాము. వారు జాగ్రత్త వహించడం లేదేమో అని అనుకుంటాము. కానీ, ఆ పిల్లలు ఆ జారుడు బండి నుండి పడిపోతారు లేక ఆ ఊయల నుండి పడిపోతారు అన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు తమ పిల్లల యొద్దకు పరుగెత్తుకొని వెళ్లి వారిని కాపాడతారు. వారు పడిపోకముందే ఆ తల్లిదండ్రులు వారిని పట్టుకుంటారు. వారు పట్టించుకోవడం లేదేమో అన్నట్టుగా కనబడినప్పటికిని, బిడ్డకు ఒక చిన్న సమస్య రాగానే, పరుగెత్తుకొని వెళ్లి తమ పిల్లలను కాపాడతారు. వారి పట్ల వారు ఎప్పుడు కూడ జాగ్రత్త వహిస్తారు. వారి బిడ్డలను ఎల్లప్పుడు గమనిస్తుంటారు. అదేవిధముగా, ప్రభువు ఎల్లప్పుడు మీపైన దృష్టిని ఉంచుతాడు. 'ప్రభువు నన్ను చూస్తున్నాడా? నేను ఎదుర్కొనుచున్న సమస్యలు ఆయనకు తెలుసా? ఆయన ఎందుకు మౌనముగా ఉన్నాడు?' అని మీరు అనుకోవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, మనకు ఒక చిన్న కష్టము ఎదురైనప్పుడు కూడా ఆయన మన యొద్దకు వచ్చి మనలను కాపాడతాడు. ఒకవేళ మీరు పడిపోవుచున్నప్పుడు, మీరు పడిపోకముందే ఆయన మిమ్మును పట్టుకుంటాడు.

నా ప్రియులారా, మనపైన కఠినముగా ప్రకాశించే సూర్యుని ప్రకాశమును చూచినప్పుడు, మనము వెళ్లి నీడను వెతుక్కుంటాము కదా! అదేవిధముగా ప్రభువు మీకు నీడగా ఉంటాడు. ప్రతి హాని నుండి మిమ్మును కాపాడతాడు. ఆయన ఇశ్రాయేలీయులకు కూడా అదే చేశాడు. వారు అరణ్యములో నడుస్తున్నప్పుడు, పగటి వేళ మేఘస్తంభమును పంపించాడు. మండుచున్న ఎడారిలో సూర్యుని నుండి మేఘస్తంభము ఆదరించినది. అవును, స్నేహితులారా, ప్రభువు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాడు. ఆయన మిమ్మును దృష్టించుచున్నాడు. ఆయన బిడ్డలు ఎన్నడు హానిని చూడకూడదు అని ఆయన తన బిడ్డల పట్ల జాగ్రత్త వహిస్తాడు. ఇంకను ఎటువంటి కీడు వారిని తాకకుండా తన బిడ్డలు భద్రంగా కాపాడబడునట్లుగా రక్షిస్తాడు. కనుకనే, నేడు ఆయన మిమ్మును కాపాడడానికి పరుగెత్తుకొని మీ యొద్దకు వస్తాడు. ఆయన మీకు నీడగా ఉంటాడు. కాబట్టి, మీరు ఎటువంటి అపాయమును చూచి భయపడకండి, ధైర్యంగా ఉండండి.

నాకు ప్రియమైనవారలారా, ధైర్యము వహించండి. ఒకవేళ నేడు మీరు, 'ప్రభువు నాపైన తన దృష్టిని ఉంచుచున్నాడా? ఇంకను ఆయన నా పట్ల జాగ్రత్త వహిస్తున్నాడా?' అని అడగకండి. 'నేను అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాను కానీ, అవన్నియు ఆయనకు తెలుసా?' చింతించకండి, నా స్నేహితులారా, మీరు పడిపోకముందే ప్రభువు వచ్చి, మీకు ఎటువంటి అపాయము రాకుండా, ఆయన మిమ్మును పట్టుకుంటాడు. ఇంకను మీ కుడి ప్రక్కన మీకు నీడగా ఉంటాడు. కాబట్టి, నిరాశ చెందకండి, ఆయనకు వందనాలు చెల్లించి, ఈ వాగ్దానమును పొందుకుందామా? ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహిమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఎల్లప్పుడు మమ్మును విడిచిపెట్టకుండా నిరంతరం మా వైపు చూచుచున్న దేవునిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా కుడి ప్రక్కన మాకు నీడగాను మరియు రక్షకునిగా, సమస్త కీడు నుండి మమ్మును కాపాడి సంరక్షించుచున్నందుకై మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, నీవు మమ్మును చూడనట్లుగాను లేదా వినబడనట్లుగాను నీవు ఉన్నావని మాకు అనిపించినప్పటికిని, నీవు ఎల్లప్పుడు మమ్మును గమనిస్తున్నావని మేము విశ్వసించుచున్నాము. ప్రభువా, ఆపత్కాలములో మమ్మును రక్షించడానికి మా యొద్దకు పరుగెత్తుకొని వచ్చి, మేము పడిపోవుటకు ముందు మమ్మును పట్టుకొనుమని వేడుకొనుచున్నాము. యెహోవా దేవా, ఎడారిలో ఉన్న ఇశ్రాయేలీయులను మేఘస్తంభముతోను మరియు అగ్నిస్తంభముతోను నడిపించిన నీవే నేడు మాకు కూడా ఆదరణ మరియు ఆశ్రయం. ప్రభువా, మా జీవితం భారంగా అనిపించినప్పుడు కూడా నీ సన్నిధి మరియు నీ యొక్క వాగ్దానాల మీద మేము నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవే మా పట్ల శక్తిమంతుడైన రక్షకుడని గుర్తెరిగి మా హృదయాన్ని విశ్వాసంతో మరియు ఆనందంతో నింపుము. యేసయ్యా, నేడు మేము ఎదుర్కొనే ప్రతి సవాళ్లతో సంబంధం లేకుండా నీ నీడలో మమ్మును ఎల్లప్పుడును ఆశ్రయం పొందునట్లు చేయుము. ప్రభువా, నీ యొక్క ఎడతెగని ప్రేమ మరియు నిరంతర కాపుదలను మా మరియు మా కుటుంబము మీద ఉంచి, మమ్మును సురక్షితముగా కాపాడి సంరక్షించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.