నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మీకా 7:15వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "...నేను జనులకు అద్భుతములను కనుపరతును'' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అవును నిజంగానే, దేవుడు అద్భుతకరుడైన తండ్రిగా ఉన్నాడు. ఇంకను యెషయా 9:6వ వచనములో చూచినట్లయితే, "ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును'' ప్రకారం ఆయన ఆశ్చర్యకరుడు అని దేవుని యొక్క మనకు తెలియజేయుచున్నది. దంపతులు వచ్చి, 'నీ పేరేమి అని అడిగినప్పుడు, ఆయన నా పేరు ఆశ్చర్యకరుడు అని చెప్పెను.' దేవుడు అద్భుతము చేయు నిమిత్తము ఇక్కడ ఉండి ఉన్నాడు. ఆయన మీ కొరకు అద్భుతములను చేయుటకు సంసిద్ధుడుగా ఉన్నాడు. మీరు ఊహించినంతకంటె సమస్తమును జరిగించుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. అందుకే బైబిల్‌లో ఎఫెసీయులకు 3:20వ వచనమును చూచినట్లయితే, " మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి స్తోత్రము'' అని చెప్పబడియున్నది. మీరు అడుగుడు వాటన్నిటికిని అద్భుతములు జరిగించబోవుచున్నాడు. ఆలాగుననే నేడు దేవుడు మీ కొరకు అద్భుతాలను జరిగించుటకు ఇష్టపడుచున్నాడు.
నా ప్రియులారా, అటువంటి అద్భుత కార్యములు నాకు జరుగుతుందా? అని మీరు అనుకొనవచ్చును. మరియ కూడా ఆ రీతిగానే అనుకొని ఉన్నారు. నేను కేవలము కన్యకగా ఉన్నాను కదా! అయినప్పటికిని దేవునికి వందనములు, పరిశుద్ధాత్మ ఆమె మీదికి దిగివచ్చినది. ఒక బిడ్డగా దేవుడు నా గర్భములో రూపింపబడునట్లుగా ఆయనే చేసియున్నాడు. ఇది గొప్ప ఆశ్చర్యకరము కదా! దేవుడు ఆలాగున చేయగలిగినట్లయితే, మీరు యేసును మీలో కలిగి ఉండునిమిత్తము యేసు ఆశీర్వాదములను మీలో కలిగి ఉండునిమిత్తము సమస్తమును జరిగించగలరు. మీ హృదయమును కలవరపడనీయ్యకండి. కానా ఊరిలో ద్రాక్షరసము ఖాళీ అయిపోయినప్పుడు యేసు అద్భుతము ద్వారా తన మహిమను ప్రజల పట్ల కనుపరచాడు. యోహాను 2:11లో నీటిని మధురమైన ద్రాక్షరసముగా మార్చినట్లుగా ఈ అద్భుతమును మనము చూడగలము. ఆలాగుననే, ఆయన మీ కొరకు జరిగిస్తాడు. మీరు భయపడకండి.
సేలం నుండి సహోదరి రమణి తాను పొందుకున్న అద్భుత కార్యమును సాక్ష్యంగా మీతో పంచుకోవాలని కోరుచున్నాను. ఆమె చెన్నైలో నివసించుచున్నారు. తన భర్త పేరు సుందర్ రాజు. వారికి ముగ్గురు పిల్లలు. మూడవ బిడ్డ జన్మించినప్పుడు, ఆమెకు తీవ్రమైన తలనొప్పి వస్తుండేది. వంటి నొప్పులు, భౌతిక బలహీనత వస్తుండేవి. తద్వారా, పిల్లల కొరకు జాగ్రత్త వహించలేకపోయేది. ఇంకను ఏ పనిని కూడా చేయలేకపోవుచుండెను. వైద్యులకు వైద్యపరంగా ఆమెకు ఎటువంటి సమస్యలు కూడా కనబడలేదు. సంవత్సరము పాటు ఎంతగానో బాధపడెను. ఎంతో ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. తన భర్త రోజు వేతనము సంపాదించేవాడు మాత్రమే. కనుకనే తన తల్లి ఆమెను తన యింటికి తీసుకొని వెళ్లెను. వారు వైద్యపు ఖర్చులను కూడా భరించలేకపోయేవారు. కనుక మానసికంగా, భావోద్వేగాలపరంగా ఎంతగానో బాధపడుచున్నారు. మరి కొందరేమో, నీవు త్వరగా చనిపోతావు అని చెప్పారు. ఇంకను కొందరు "నీ యేసు నీకు ఏమి చేయగలడు? అని కూడ అన్నారు. ఆయనే స్వయంగా సిలువలో వ్రేలాడుచున్నాడు, అటువంటి ఆయన వచ్చి నీకు ఎలాగున సహాయము చేయగలడు అని చెప్పారు.' ఈ మాటలు శ్రీమతి రమణియొక్క హృదయాన్ని బ్రద్దలు చేశాయి. ఆమె తల్లిగారు కూడా ప్రభువును అనుసరించుచున్నందున ఎంతగానో ఆమెను నిరుత్సాహపరచారు. అయితే, శ్రీమతి రమణి, యేసు యందు మాత్రమే విశ్వాసముంచి ఆయనను హత్తుకొని జీవించెను.
ఇటువంటి సమయములో, యేసు పిలుచుచున్నాడు ఆవడి, ప్రార్థనా ఉత్సవమును గురించి విన్నారు. బంధువులు ఆమెను అక్కడకు తీసుకొని వచ్చారు. ఆ కూటములో దేవుడు ఆమెను స్వస్థపరచాలని ఆమె ఎంతో భారముతో ప్రార్థించారు. అటువంటి సమయములో 'ప్రభువా, నీ ప్రజలకందరికి తల నొప్పిని తొలగించుమని' నేను ప్రార్థించాను. శ్రీమతి రమణి ఆ ప్రార్థనను గట్టిగా చేపట్టుకున్నారు. 'ప్రభువా, నన్ను స్వస్థపరచుమని' ప్రార్థించారు. ఆ తర్వాత స్వస్థతా కూటము ముగిసినది. ఆమె తన స్నేహితులతో కలిసి, బస్సు ఎక్కడానికి వెళ్లెను. అటువంటి సమయములో ఆమెను ఒక దైవీక బలము నింపినట్లు అనిపించినది. ఇటువంటి ఆరోగ్యమును, బలమును ఇంతవరకు నేను ఎప్పుడు కూడా అనుభూతి చెందలేదు కదా అని ఆమె మనస్సులో తలంచుకొనెను. ఆమెకు తన పాత సామర్థ్యము మరియు బలము తిరిగి వచ్చినట్లుగా అనిపించినది. ప్రభువు ఆమెకు సంపూర్ణ పునరుద్ధరణను అనుగ్రహించాడు. తదుపరి రోజు ఆమె సంపూర్ణంగా స్వస్థపరచబడి, తన యింటికి తిరిగి వెళ్లినది. ఇప్పటి వరకు వందశాతము ఎంతో బాగున్నారు. ఇంకను ఆమె తన ముగ్గురు బిడ్డలను యౌవన భాగస్థుల పధకములో నమోదు చేసుకొనెను. అప్పటి నుండి నిరాంతరాయంగా ఆమె యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురము సందర్శించుచుండెను. దేవుడు నాకు అద్భుతములను కనపరుచాడు అని ఆమె ఎంతో ఆనందముతో తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే, దేవుడు మీకు అద్భుతములను కనపరచును. ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుకునే అద్భుతాలు చేయు తండ్రి. కనుకనే, ఆయనను గట్టిగా పట్టుకోండి, ఆయన వాగ్దానాలను నమ్మండి మరియు ఆయన మహిమ మీ నిమిత్తము కుమ్మరింపబడుట మీరు చూడగలరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు అద్భుతాలను కనుపరచి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, అద్భుతమైన మరియు అద్భుతాలు చేయుచున్న దేవుడుగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు పై చెప్పబడిన నీ వాగ్దానాన్ని మేము గట్టిగా పట్టుకున్నాము. నీవు మా జీవితాలలో అద్భుతాలను కనుపరుస్తావని నమ్ముచున్నాము. దేవా, మా శరీరములో ఉన్న రోగమును నీవు తాకి స్వస్థపరచుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో నివసించి, మా జీవితంలోనికి యేసు ఆశీర్వాదాలను తీసుకొని వచ్చునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, కానా ఊరిలో నీవు నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చినట్లుగా, నేడు మా యొక్క క్లిష్టమైన పరిస్థితికి అద్భుతమైన పరివర్తనను కలుగునట్లు చేయుము. దేవా, నీవు వాగ్దానం చేసినట్లుగా, మేము అడగగలిగే లేదా ఊహించగలిగే దానికంటే అత్యధికంగా అద్భుతాలను చేయుము. ప్రభువా, దయచేసి నీ యందు మేము విశ్వాసముంచడానికి మరియు నీ వాగ్దానాలను గట్టిగా పట్టుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ యొక్క మంచితనాన్ని మేము సాక్ష్యమిచ్చునట్లుగాను మా జీవితంలో నీ మహిమను వెల్లడిపరచునట్లు చేయుము. ప్రభువా, అద్భుత శక్తి మా జీవితానికి శాంతి, ఆనందం మరియు సమృద్ధిని తీసుకొని వచ్చునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.