నా ప్రియ స్నేహితులారా, దేవుడు చేసిన ఈ దినమును మీరు ఆనందించండి. ఎందుకంటే, ఆయన తన ఆశీర్వాదములతో మిమ్మును నింపుతాడు. కనుకనే, విజయాల కొరకు సంసిద్ధంగా ఉండండి. కనుకనే, నేటి దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 5:12వ వచనము కనుగొనబడినది. ఆ వచనము, "యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు'' ప్రకారం దేవుడు నీతిమంతులను ఆశీర్వదించుటకు సమర్థుడై యున్నాడు. నీతిమంతులను దేవుడు తన దయతోను మరియు అనుగ్రహముతోను కప్పువాడు, అది కేడెము వలె మన చుట్టు ఉంటుంది. ఆయన సంపూర్ణమైన అనుగ్రహముతో మనలను కప్పుతాడు.

నా ప్రయులారా, నేడు దేవుడు మనుష్యుల దృష్టిలో మీకు అట్టి దయను అనుగ్రహిస్తాడు. లూకా సువార్త 2:52లో చెప్పబడినట్లుగానే, " యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను'' ప్రకారం, మనుష్యుల దృష్టిలో దేవుని అనుగ్రహం మరియు దయ మీ మీదికి వస్తుంది. దేవుని చిత్తము మీ జీవితములో జరిగించబడునట్లుగా, నిరంతరాయంగా మార్గములు తెరువబడతాయి. ఎటువంటి ఆటంకాలు మిమ్మును అడ్డకోలేవు. మీరు ముందుకు సాగివెళ్లడానికి ఏ ఆటంకాలు ఉండవు. కనుకనే, ధైర్యముగా ప్రభువునందు ఆనందించండి.

మా జీవితములో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకమునకు వస్తుంది. ప్రభుత్వములో ఉన్న అధికారి కొరకు మా యొక్క ఆమోదాలు మరియు అనుమతుల పునరుద్ధరణ కొరకు మేము వెళ్లియున్నప్పుడు, అక్కడ ఉన్నవారు, ఇటువంటి అధికారి ఉండడము మీకు చాలా దురదృష్టవశాత్తు. ఎందుకంటే, దేవుని ప్రజలు అంటే ఆయనకు ఇష్టము ఉండదు. ఆయన వారిని ద్వేషిస్తాడు. అన్ని కూడా వారి కొరకు క్రింద పడిపోయేలా కారణమును కనుగొంటాడు. వారి అభ్యర్థనలను తిరస్కరించడానికి కారణాలను వెతుకుతాడు అని చెప్పారు. మేము ఆ మాటలన్నియు వినగానే, మా భయాలన్నిటిని దేవుని చేతులకు అప్పగించాము. "ప్రభువా, నీవే మా జయము '' అని ఉపవాసముండి ప్రార్థించాము. 'దేవా, నీ చిత్తము ఏదియు కూడా ఆటంకపరచబడనేరదు' అని ప్రార్థనతో మేము వాటిని ఆయనకు సమర్పించియున్నాము. అధికారి మా బృంద సభ్యులను పిలిచినప్పుడు, మహాద్భుతముగా ఆయన మాట్లాడిన భాష చాలా విభిన్నముగా ఉన్నది. అనుమతులు మరియు అమోదాలు మంజూరు చేయబడుచున్నట్లుగా తగిన మార్గాలు ఆయన చూస్తున్నట్లుగా కనబడుచున్నది. అతను వేరొక భాషలో మాట్లాడాడు - ఒక సహాయం, ఆమోదాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సలహాలను అందించడం, సరైన పదాలతో కూడా మాకు సహాయం చేయడం జరిగింది. చూడండి, మనుష్యుల దృష్టిలో పరిపూర్ణమైన అనుగ్రహము, దయను దేవుడు మాకు అనుగ్రహించాడు. అంతమాత్రమే కాదు, మా పట్ల గొప్ప కార్యాలను జరిగించాడు.

నా ప్రియులారా, దేవుడు మన ప్రతి కదలికలను నియంత్రిస్తాడు. సరైన ప్రజలను మన కొరకు సిద్ధపరుస్తాడు, తగిన నిధులను విడుదల చేస్తాడు. మనకు భద్రతను అనుగ్రహిస్తాడు. అధికారులతో మాట్లాడడానికి తగిన జ్ఞానమునిస్తాడు. అన్నిటిలో కావలసిన దయను మరియు అనుగ్రహమును ఇస్తాడు. దేవుని దయ కేడెము వలె మన మీదికి వస్తుంది. అటువంటి అనుగ్రహము మీ జీవితములోనికి రావడానికి మీరు సిద్ధపడండి. ఆయన అనుగ్రహం ఒక కేడెమువలె మీమీదికి వస్తుంది, అన్ని విషయాలలో మిమ్మును చుట్టుముడుతుంది. కాబట్టి, ప్రియమైన స్నేహితులారా, మీ జీవితాన్ని నింపడానికి అటువంటి సహాయానికి సిద్ధపడడానికి మీ జీవితాలను దేవునికి అప్పగించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు మనుష్యుల దయ యందు మరియు దేవుని దయ యందును మీరు వర్థిల్లునట్లుగా చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
దయగలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, ఇటువంటి నీ యొక్క ఉన్నతమైన అనుగ్రహమును మేము పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, ఇప్పుడే నీ దృష్టి మా మీద అనుగ్రహముగా కనబరచాలని మేము కోరుకుంటున్నాము. ప్రభువా, కొందరు రధముల మీద న మ్మిక కలిగియుంటారు. కానీ, మేమైతే, నీ యొక్క నామము మీద నమ్మకమును కలిగియుండునట్లుగా మాకు నీ కృపను చూపుము. దేవా, నీ కనికరము మరియు దయ మా మీద ఎల్లప్పుడు ప్రకాశించునట్లుగా చేయుము. దేవా, మేము వెళ్లు అధికారులు మరియు మా యజమానులు మరియు కుటుంబ సభ్యుల దృష్టిలో మాకు దయను కలిగించుము. ప్రభువా, ప్రతిరోజు నీ దైవీకమైన రక్షణ మరియు సదుపాయంతో మమ్మును కప్పుము. ప్రభువా, నీవు యేసు కొరకు చేసినట్లుగానే, ఇతరుల దృష్టిలో మాకు దయను అనుగ్రహించుము. యేసయ్యా, మా జీవితంలో మూయబడిన తలుపులు తెరువు, తద్వారా నీ యొక్క సంపూర్ణ సంకల్పం అడ్డంకులు లేకుండా నెరవేర్చునట్లు చేయుము. దేవా, మా జీవితంలోనికి సరైన వ్యక్తులను మరియు అవకాశాలను తీసుకురావడానికి మా ప్రతి అడుగును నడిపించుము. ప్రభువా, మా నిర్ణయాలన్నింటిలో నీ దైవీకమైన జ్ఞానాన్ని అనుగ్రహించి, నీ నమ్మకమైన ఏర్పాటుపై పూర్తిగా నమ్మకం ఉంచి మా ప్రణాళికలన్నింటిని నీకు అప్పగించుచున్నాము. దయతో మా పట్ల వాటన్నిటిని నెరవేర్చుమని యేసుక్రీస్తు దయగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.