నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 37:5వ వచనము మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, " దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును'' ప్రకారం దేవుడు మాట్లాడినట్లయితే, అద్భుతాలు జరుగుతాయి. అందుకే బైబిలేమంటుందో చూడండి, కీర్తనలు 33:9లో చూచినట్లయితే, "ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను'' అని చెప్పబడియున్నది. అనేకసార్లు, నా భర్తగారి ద్వారా దేవుడు మాట్లాడడము నేను గ్రహించాను. మేము కుటుంబముగా కలిసి ప్రార్థించుచున్నప్పుడు, ప్రభువు తన ప్రవచన వాక్యాల ద్వారా మాతో మాట్లాడిన సంభవములు ఎన్నో ఉన్నాయి. మానవుడు మాట్లాడే విధానానికి మరియు ప్రభువు మాట్లాడే విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా చూడవచ్చును. ప్రభువు ఉరుము ధ్వని చేయుచున్నాడు! దేవుడు ఉరుములాంటి స్వరంతో మాట్లాడినప్పుడు, మనం ఆయన యెదుట భయముతో వణికిపోతాము. ఆలాగుననే, మా కుటుంబ ప్రార్థనలో దేవుడు మాతో ఏమైతే మాట్లాడతాడో, ప్రభువు ఆ కార్యక్రమమును తప్పకుండా మా పట్ల నెరవేరుస్తాడు. దేవుడు మాకు అనుగ్రహించిన ప్రతి ప్రవచనమును, మేము స్వాధీనము చేసుకుంటాము. ప్రభువు మాకు ఇచ్చిన ప్రతి ప్రవచనాన్ని మా స్వంతం చేసుకుంటాము, ఆయన తన ప్రతి మాటను నిర్థారిస్తాడని మాకు తెలుసు.

అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మనలో ప్రతి ఒక్కరి ప్రార్థనను గుర్తెరిగి యున్నాడు. మీరు ఎటువంటి సమస్యల గుండా వెళ్లుచున్నారో నిశ్చయంగా ఆయనకు తెలుసు. దేవునికి మీ యొక్క పేరేమిటని కూడా తెలుసు. అందుకే బైబిల్‌లో యెషయా 40:26వ వచనములో చూచినట్లయితే, " మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు'' ప్రకారం వాటి లెక్కచొప్పున దేవుడు వాటన్నిటికి పేర్లు పెట్టినవాడు ఆయనే. ఆయన సృష్టించిన సృష్టి మీద సర్వాధికారమును కలిగియున్నాడు. మనము ఎప్పుడైతే, ఆయన సృష్టిపై ఆయనకు అంత శక్తి కలదు. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన మనలను చూచి ఒక మాట మాట్లాడుతాడు! అదేవిధముగా, శిష్యులు తుఫానులో చిక్కుకున్నప్పుడు, ఏమి చేయాలో వారికి తోచలేదు. భయంతో వారు ప్రభువైన యేసు వైపు చూచి, "ప్రభువా, ప్రభువా, మేము నశించిపోవుచున్నాము,'' అని కేకలు వేశారు. వెంటనే, యేసు లేచి, గాలిని మరియు సముద్రమును గద్దించాడు. గాలి సముద్రము నిమ్మళించెను. శిష్యులు ఆశ్చర్యంతో, " వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి!'' దేవుడు ఒక అద్భుతం జరిగించినప్పుడు, అది మన అవగాహనకు మించినది. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడే, ఆయన మీ కొరకు ఒక గొప్ప అద్భుతమును జరిగిస్తాడు.

ఆలాగుననే, జెనీఫర్ అను ఒక సహోదరి యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. గత సంవత్సరము అక్టోబరు మాసములో ఆమె ఉపవాస ప్రార్థనలో పాల్గొనెను. ఆమెకు తండ్రి లేడు. తన తల్లి కూడా తన టీచర్ ఉద్యోగమును కోల్పోయినది. జెనీఫర్ తన యొక్క మూత్రాశయములో రాళ్లతో బాధపడుచుండెను. ఆమె చెల్లెలు ఉద్యోగం లభించక ఇబ్బందులు పడుచుండెను. వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారంతో సతమతమవుచుండెను. వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో, అధిక అప్పులతో బాధపడుచుండెను. తద్వారా, నిరాశతో, వారు తమ భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ప్రార్థన సమయంలో, వారు ప్రభువునకు మొరపెట్టి, 'ప్రభువా, ఏదొక ఒక అద్భుతము చేసి మమ్మును దీని నుండి బయటకు తీసుకు రమ్ము!' అని మొఱ్ఱపెట్టారు. ఆ రోజు నేను ప్రజల కొరకు ప్రార్థించుచుండగా, వారు కూడా నాతో కూడా ప్రార్థించారు. మేము అందరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించాము. వెళ్ళే ముందు, వారు తమ ప్రార్థన విన్నపములన్నింటిని వ్రాసి ప్రార్థన విన్నపమును పెట్టెలో వేశారు. వెంటనే, ప్రభువు వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు! వారు నిరీక్షణతో ఎదురు చూస్తుండగా, ప్రభువు శక్తివంతంగా చలించిపోయాడు. జెన్నిఫర్ కిడ్నీ సమస్య పూర్తిగా స్వస్థపరచబడినది. ఆమె చెల్లెకి ఉద్యోగం వచ్చింది మరియు వారి భూమి అమ్మబడినది. వారు తమ ఆర్థిక ఇబ్బందుల నుండి మరియు అప్పుల నుండి విడుదల పొందారు. ప్రభువు వారి ఊహించినదానికంటె అనేక అద్భుతాలు జరిగించాడు! దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ కుటుంబానికి కూడా మేలు జరిగిస్తాడు! ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానీ, అది మీ అవగాహనకు మించినది. మన ప్రభువు మన ప్రార్థనలలో ఒకదానికి మాత్రమే జవాబు ఇచ్చుటకు పిసినారి దేవుడు కాదు. ఆయన ధారాళముగా ఇచ్చే దేవుడు! ఇప్పుడు కూడా, ఆయన ఒక మాట పలుకుతాడు, మరియు మీరు మీ అద్భుతాన్ని పొందుకుంటారు. ఆయన వాగ్దానమును నమ్మండి మరియు అద్భుతాలను పొందుకొని ఆనందించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ మహాశక్తికి భయముతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, నీ స్వరం అద్భుతమైన మార్గాలలో ఉరుము ధ్వనులు కురించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. మరియు నీవు మేము ఊహించువాటన్నిటికంటె అత్యధికముగా గొప్ప కార్యాలు జరిగించుము. ప్రభువా, మా హృదయంలో దాగి ఉన్న ప్రతి ప్రార్థన విన్నపములు నీకు తెలుసు, గనుకనే, నీవు మమ్మును పేరు పెట్టి పిలిచి, మా పట్ల గొప్ప కార్యములను జరిగిస్తావని మేము నమ్ముచున్నాము. ఓ ప్రభువా, నీవు ఒక్క మాట మాట్లాడుము, మరియు నీ యొక్క పరిపూర్ణ చిత్తం ప్రకారం మా జీవితంలో అద్భుతాలు బయలుపరచుము. దేవా, మా జీవితంలో నీవు మాట్లాడిన ప్రతి ఆశీర్వాదం మరియు ప్రవచనాన్ని మేము స్వంతం చేసుకొనుచున్నాము. ప్రభువా, నీ పిల్లలకు నీవు ధారాళంగా మంచి కార్యాలను జరిగిస్తావనియు మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మాకున్న ప్రతి సమస్య నుండి మమ్మును విడిపిస్తావని మేము నీకు మొఱ్ఱపెట్టుటకును మరియు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నడవడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.