నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సంఖ్యాకాండము 14:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాడు. ఆ వచనము, "నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యా జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పెను'' ప్రకారముగా, దేవుడు మిమ్మును గొప్పవారిగాను మరియు బలమైనవారిగాను చేయబోవుచున్నాడు. వారికంటెను మిమ్మును బలమైన జనముగా చేయగోరుచున్నాడు. ఎవరు ఈ వారు అనేది ఎవరు? అని మనము చూచినట్లయితే, ఆ యొక్క అధ్యాయాన్ని మొదటి వచనము నుండి మీరు చదివినట్లయితే, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను వాగ్దాన భూమికి నడిపించుచున్నాడు. కానీ, ఒక ప్రాంతానికి రాగానే, రాక్షసులు వంటి పరాక్రమ యోధులు కనబడ్డారు. ఆ ప్రాంత ప్రజలు రాక్షులవలె చాలా ఎత్తుగా శక్తివంతులుగా కనబడుచున్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలు వారి యెదుట మిడుతల వలె కనబడుచున్నారు. రాక్షసుల వంటి ఇట్టి యోధుల మీద జయమిచ్చి, తమ స్వాస్థ్యపు భూభాగమును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అనే విశ్వాసమును వారు అక్కడ కోల్పోయి ఉన్నారు. అందుచేతనే వారు రోధించుచున్నారు. మోషే మమ్మును చంపివేయడానికి ఇక్కడకు తీసుకొని వచ్చావు, ఎందుకు మమ్మును ఇక్కడకు తీసుకొని వచ్చావు? మమ్మును చంపివేయడానికి కొరకు ఇక్కడకు తీసుకొని వచ్చావా? వారు దేవుని యందును మరియు ప్రవక్తయైన మోషే యందును వారు నమ్మిక యుంచలేదు. కనుక నా యందు నమ్మిక యుంచక, సణుగుతూ ఉన్నవారికంటెను, మహా గొప్ప బలముగల జనమును నీవలన పుట్టించెదనని వారిని గూర్చి దేవుడు మోషేతో ఈవిధంగా సెలవిచ్చియున్నాడు. కనుకనే మీరు భయపడకండి.
నా ప్రియులారా, ఈ రోజు కూడా రెండు రకాల ఆత్మలను మనము ఎదుర్కొంటున్నాము. మనము కూడా యేసు నామాన్ని భరించుచున్నందున బలాఢ్యులవంటి పరాక్రమశాలులు మనకు వ్యతిరిక్తముగా రావడము మనము చూస్తుంటాము. ప్రభువా, మేము అణిచివేతకు గురియవడానికి నీవు ఎందుకు అనుమతించుచున్నావు? ఎందుకు ప్రభువా అని అనుకుంటాము. ఇట్టి పరాక్రమమశాలుల నుండి మనలను విడిపించే యేసు శక్తియందు మనము నమ్మిక యుంచకుండా, ఆలాగున సణగడాన్ని ప్రారంభిస్తాము. ఆలాగుననే, ఈ భూభాగములో యోధులను చూస్తుంటాము, వారు, మేము అందరిని నాశనము చేయగలము అని అనుకుంటారు. వారి సూత్రాలను పాటించని ఎవ్వరినైన మేము నాశనము చేయగలము అని వారు అనుకుంటారు. కానీ, దేవుడు సెలవిచ్చుచున్నాడు, "మోషే, నీవు నా యందు నమ్మిక యుంచావు, కనుకనే, ఇట్టి యోధుల కంటెను మరియు సణగుచున్న జనముల కంటెను గొప్ప మహా జనమును నీ వలన పుట్టించెదను '' అని మోషేతో చెప్పాడు. కనుకనే, ఈ రోజున ప్రభువుతో చెప్పండి, ' ప్రభువా, బలాఢ్యులవంటి యోధులు ఉంటే ఉండవచ్చును, నేను సణగను, నేను ఏ మాత్రము నీకు ఆవేదన కలిగించను, నేను నీ యందు నమ్మిక యుంచుతాను, ప్రభువా, నన్నును మరియు నిన్ను ద్వేషించు జనముకంటె గొప్ప జనముగా నన్ను చేయుదువని నేను నమ్ముచున్నానుఅని చెప్పినప్పుడు,' దేవుడు మిమ్మును ఆలాగుననే చేస్తాడు.
సేలం నుండి రామస్వామి అను సహోదరుడు ఈ విధంగా సాక్ష ్యమిచ్చాడు. అతడు ఒక రైతు, వారి కుమార్తె పాఠశాలలో ఉండెను. అక్కడ ఆమె దురాత్మల చేత గురియగుచూ, అణచివేత చేత బాధపడుచుండెను. ఆ సమయములో యేసు పిలుచుచున్నాడు పరిచర్యను ఒకరు ఆమెకు యేసు పిలుచుచున్నాడు పరిచర్యను ఆమెకు పరిచయము చేశారు. వారు ప్రార్థన కూటమునకు వచ్చారు. మేము ప్రార్థించినప్పుడు, దురాత్మలు ఆ బిడ్డను విడిచి వెళ్లిపోయారు. కుటుంబమంతయు యేసునకు వారి జీవితములను సమర్పించుకున్నారు. వారు యేసు యొక్క బిడ్డలుగా మార్చబడ్డారు. త త్ఫలితముగా, వారి కుటుంబ సభ్యులైనవారు మరియు వారి బంధువులందరు కూడా, వారి యొక్క సంపదను, మరియు వస్తువులన్నిటిని విసిరివేసి, వారిని యింటి నుండి గెంటివేశారు. కనుకనే, అతడు, తన భార్య, తన బిడ్డలు కూడా భార్య యొక్క తల్లిదండ్రులతో కూడా జీవించడానికి వెళ్లిపోయారు. కానీ, ఎల్లవేళల, యేసు పిలుచుచున్నాడు పరిచర్యలోని ప్రార్థనలు వారికి ఎంతో ఆదరణగా ఉండెను.
మహా అద్భుతంగా, వారి ప్రాంతానికి వారు మరల రాగలిగారు. అతడు విత్తనాలు వేయడానికి ప్రారంభించాడు. అతడు చెరకు పంటను సాగు చేశాడు. అదే సమయములో, యేసు పిలుచుచున్నాడు వ్యాపార భాగస్థుల పధకములో భాగస్థులుగా నమోదు చేసుకున్నారు. ఈ యొక్క ప్రణాళిక ద్వారా మేము ఇతరుల నిమిత్తమై ప్రార్థన చేయడానికై, ఈ పరిచర్యకు సహకారము అందించారు. దేవుడు అతని వ్యవసాయమును ఆశీర్వదించాడు. తద్వారా అతనికి గొప్ప పంట లభించినది. అతనికి చెరకు పంట, ఆలాగుననే, పసుపు పంట కూడా ఉండెను. అంతమాత్రమే కాదు, అతడు బెల్లమును కూడా ఉత్పత్తి చేశాడు. వాణిజ్యములో కూడా అతనిని మహా అద్భుతంగా స్వీకరించారు. దేవుడు అతనిని వర్థిల్లింపజేశాడు. తన బంధువులందరికంటె ఇతనికి ఎక్కువ రాబడి లభించినది. యేసును బట్టి అతనిని గెంటి వేసిన వారి యొక్క బంధువులందరికంటె మహా బలము గల గొప్ప జనముగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువు ఆలాగుననే, నేడు మీకును జరిగించును. కనుకనే, ఆయన యందు నిరీక్షణ ఉంచండి. దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోక తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నీ యందు నిరీక్షణ కలిగి ఉండుట ద్వారా మేము పొందియున్న అవమానమునంతటిని ప్రతిగా యోధులవంటి పరాక్రమశాలలు నుండి మమ్మును విడిపించుము. దేవా, మేము సణగకుండా, నీ యందు నమ్మిక కలిగి ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మేము ఎక్కడ ఉన్నను సరే, ఆ స్థలములో మమ్మును ఆశీర్వదించుము. ఉద్యోగములోను, వ్యాపారములోను, కుటుంబములోను, చదువులలోను నీవు మమ్మును దీవించుము. దేవా, మా సవాళ్ల కంటే మమ్మును గొప్పగా మరియు శక్తివంతంగా చేస్తానని నీవు చేసిన వాగ్దానానికి వందనాలు. ప్రభువా, మేము రాక్షసుల వంటి సందేహం, భయం మరియు అణచివేతను ఎదుర్కొన్నప్పుడు, మమ్మును విడిపించే నీ శక్తిపై నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ వాగ్దానాలపై మేము సణుగుతున్నప్పుడు లేదా విశ్వాసం లేనప్పుడు మమ్మును క్షమించుము. యేసయ్యా, మా యెదుట ఉన్న ఏ ఆటంకములైనను గుర్తించి, నీ వాక్యంలో స్థిరంగా నిలబడాలని మాకు నేర్పించుము. ఇంకను మమ్మును వ్యతిరేకించే వారి సమక్షంలో కూడా నీవు మమ్మును పైకి లేపుతావని నమ్మునట్లుగా మా హృదయాన్ని బలపరచుము. దేవా, నీవు మా ప్రతి సవాళ్లను విజయంగా మార్చినపుడు నీ గొప్పతనానికి మా జీవితం సాక్ష్యమిచ్చునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, కదిలించబడని విశ్వాసంతో మమ్మును నింపుము, తద్వారా ఎటువంటి పరిస్థితులలో నిన్ను ఘనపరచడానికి మాకు నీకృపను అనుగ్రహించుము. దేవా, మా స్వంత బలము మీద కాదు, కానీ మేము నీ యొక్క బలం మీద ఆధారపడాలని నిర్ణయించుకున్నాము, కనుకనే, మేము నిత్యము నిన్ను వెంబడించునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.