నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 3:12వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఆయన యందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి'' అని చెప్పబడిన ఈ వచనము మీ కొరకైన వాగ్దానంగా ఉన్నది. కనుకనే, మీరు యేసునందలి విశ్వాసము ద్వారా, స్వాతంత్య్రము కలిగి ఉండునట్లుగా, మీరు దేవుని సంధించినప్పుడు, మీరు స్వతంత్రులుగా ఉంటారు.
అవును, నా ప్రియులారా, మీరు అనేక ఫర్యాయములు మీ సమస్యల నుండి బయటకు రావడానికి సహాయము కొరకు ఎవరి యొద్దకు వెళ్లాలి లేక ఎవరిని సంధించవలెనని తలంచియుండవచ్చును. మీకు సహాయము చేయడానికి ఎవరిని మీరు కనుగొనలేనప్పుడు, ఎంతో నిరుత్సాహము పొందుకుంటారు. అంతమాత్రమే కాకుండా, 'నాకు సహాయము చేయడానికి ఎవరు కూడా లేరు కదా' అని అనుకుంటారు. ఎవరు నన్ను ఇష్టపడుట లేదు. నా జీవితము అంతమైపోతుందేమో, నాకు ఇక భవిష్యత్తులేదేమో అని అంటున్నారా? లేదు నా ప్రియ స్నేహితులారా, మీ స్వాతంత్య్రమునకు ముఖ ద్వారముగా ఆయన మీకు సమీపముగా ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఈ రోజు ఆయన మిమ్మును చూచి, ' నా కుమారుడా/కుమార్తె నా యొద్దకు రండి! 'యేసు అను నేను మీ భారములన్నిటిని తీసుకొని, మీకు నేను విశ్రాంతిని కలుగజేయుదును. నేనే మార్గమును, నేను మిమ్మును మరియు మీ కొరకు కలిగియున్న ప్రణాళిక యొద్దకు నడిపించెదను' అని సెలవిచ్చుచున్నాడు. అవును, నా ప్రియులారా, ఈ రోజు నుండి దేవుని యొద్ద నుండి మీ కొరకు ఉన్న ప్రతి ప్రణాళిక మీ యొద్దకు వస్తుంది. మీరు విశ్రాంతిని కలిగి యుండెదరు, ఇంకను మానసిక స్థైర్యమును కలిగియుండెదరు. మీరు అధికమైన విజయమును పొందినవారుగా ఉంటారు. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. నేడు మీ జీవితాన్ని దేవునికి సమర్పించి ఉన్నాము అని అంటున్నారా? అయితే, ధైర్యము తెచ్చుకొనండి. ఆయన తన యొద్దనున్న ప్రతి దైవీకమైన ఆశీర్వాదమును నేడు మీ యొద్దకు తీసుకొని వస్తాడు. ఈ రోజు మీరు విడుదలను పొందుకుంటారు, నేడు మీరు జీవించునట్లుగా మానసిక స్థైర్యమును కలిగి ఉంటారు. ప్రభువు అందునిమిత్తము సమస్తమును మీ పట్ల పరిపూర్ణము చేస్తాడు. కేవలము మీరు ఆయనను నమ్మండి. మీకు యేసు కావాలి, మీరు యేసునందు విశ్వాసము కలిగి ఉండాలి. ఇది దేవుడు మీకు చేసిన వాగ్దానం! మీరు మీ జీవితాన్ని యేసుకు సమర్పించియున్నారా? అయితే, ధైర్యంగా ఉండండి. ఆయన మీ జీవితంలోనికి ప్రతివిధమైన దైవీక ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాడు.
సహోదరుడు తంగరాజ్ అనే యువకుడు పొందుకున్న అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. అతడు 12వ తరగతి చదువుచున్నప్పుడు, తన తండ్రిని మరియు తల్లిని కోల్పోయాడు. వారిద్దరు కూడా మరణించుట ద్వారా అతడు ఒంటరివాడుగా ఉండెను. అయితే, అతని బంధువులు తనను వారియింటికి తీసుకొని వెళ్లారు. అతని యొక్క ఇల్లు మరియు తనకు ఉన్న ఆస్తులన్నియు వారి స్వంతము చేసుకున్నారు. అతనిని నిరాశ్రయునిగా త్రోసివేశారు. అతడు నిరాశ్రయుడైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అయితే, 2013వ సంవత్సరములో అతని మీద ఒక కోర్టులో కేసు నమోదు చేయబడినది. అది దాదాపు 8 సంవత్సరములుగా కేసు కొనసాగుచుండెను. కానీ, ఆ కేసు చివరి దశకు వచ్చినది. బంధువులు అతనిని ఎంతగానో బెదిరించుచుండెను. ఇతరులను అతనికి విరుద్ధముగా రెచ్చగొట్టుచుండెను. కేవలం అతని చేతులలో 350 రూపాయలు డబ్బులు మాత్రమే ఉండుట చేత, వారి ఆధిపత్యము నుండి బయటకు తప్పించుకొని వెళ్లిపోయాడు. అది కోవిడ్ సమయము, అతను వెళ్లి ఏదో ఒక ఆశ్రయములో చేరాలనుకున్నాడు. అయితే, అది కూడా పని చేయలేదు. అతడు తిరిగి అతని యింటికి వెళ్లిపోవుటకు సిద్ధపడుచుండగా, అతని హృదయములో చాలా భారమును కలిగియుండుట ద్వారా తాను ఆత్మహత్య చేసుకోవాలని తలంచుకున్నాడు. అయితే, మార్గమధ్యములో బేతెస్ద ప్రార్థనా కేంద్రము ఉన్న కారుణ్య నగర్ వైపునకు వెళ్లుచున్న బస్సును అతడు చూశాడు. ఆ యొక్క స్థలమునకు వెళ్లుటకు ఏదో ఒకటి అతనిని ఆకర్షించినది. ఆ బస్సును ఎక్కి, అతడు అక్కడకు వెళ్లాడు. ఆ స్థలములో బోధించుచున్న దైవజనుడు, 'మీరు మీ చేతులలో ఏమియు లేకుండా, ఖాళీ చేతులతో ఇక్కడకు వచ్చియుండవచ్చును. కానీ, నేడు ప్రభువైన యేసయ్యా, నూరురెట్లు ఆశీర్వాదాలతో మిమ్మును సంపూర్ణులనుగా నింపబోవుచున్నాడు' అని చెప్పాడు. కనుకనే, అతడు ఒక వారం రోజుల పాటు, కారుణ్య నగర్‌లో ఉన్న వసతి గృహంలో విశ్రమించాడు. మహా అద్భుతంగా ఒక వ్యక్తిని అక్కడ కలుసుకోవడం జరిగినది. అతడు తిరిగి వెళ్లే సరికి, ఆ కోర్టు కేసు ముగింపు దినము రానే వచ్చినది. అయితే, దేవుని యొక్క మహా కృప ద్వారా తనకు అనుకూలమైన విధంగా ఆ కేసు ముగిసిపోవడం జరిగినది. ఆ కోర్టు యొక్క న్యాయమూర్తి, ఇతని యొక్క ఇల్లు మరియు ఆస్తి అంతయు అతనికి తిరిగి ఇవ్వాలని తీర్పును జారి చేశాడు. దేవునికి స్తోత్రము. ఈ రోజున అతని ఆస్తి అతనికి తిరిగి వచ్చినది. ఇంకను అతనికి వివాహమైనది. యేసును ప్రేమించే ఒక అమ్మాయితో అతనికి వివాహము జరిగించబడినది. ఈ రోజు అతడు ఒక సజీవమైన అద్భుత సాక్ష్యముగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, ఆలాగుననే, యేసు నేడు మీ కొరకు కూడా జరిగిస్తాడు! నేడు మీ జీవితాన్ని యేసునకు సమర్పించుకొనండి, యేసునందు నమ్మిక ఉంచండి. ఆయనే మీకు దేవుడు, ఆయన మీ జీవితాలను పునరుద్ధరించేవాడు, విమోచించేవాడు మరియు అత్యధికంగా మనలను ఆశీర్వదించే దేవుడు. కనుకనే, నేడు, మీరు స్వాతంత్య్రముగా జీవిస్తారు. నేడు, మీరు నమ్మకంతో ముందుకు నడుస్తారు. తద్వారా, ప్రభువు మీ కొరకు సమస్తమును పరిపూర్ణం చేస్తాడు. కనుకనే, మీరు ఆయనను నమ్మండి! నేటి వాగ్దానము ద్వారా దేవుని విడుదలను మరియు ఆశీర్వాదములను పొందుకొనండి. నేడు దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన తండ్రీ, నీ సన్నిధి కొరకు వాంఛ కలిగియున్న మా హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా విడుదలను మరియు విశ్వాసం యొక్క వాగ్దానానికి మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు. దేవా, మేము అందరి చేత విడువబడినట్లుగాను మరియు నిరాశ చెందినట్లుగా అనిపించినప్పుడు, నీవు ఎల్లప్పుడూ మాకు సమీపముగా ఉన్నావని మాకు గుర్తు చేయుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, నేడు మా భారాలను మేము నీకు అప్పగించుచున్నాము. దేవా, దయచేసి వాటిని నీ మీద వేసుకొని, మాకు నీ యొక్క విశ్రాంతిని దయచేయుము. ప్రభువా, మా జీవితానికి నీవు సిద్ధపరచిన దైవీకమైన ఉద్దేశములలోనికి మమ్మును నడిపించుము. దేవా, మమ్మును అన్నిటికంటె అత్యధికమైన విజయమును నీ నామమున ద్వారా పొందుకొనునట్లుగా, కృపను అనుగ్రహించుము. యేసయ్యా, మా అమూల్యమైన రక్షకుడా, నీవు మాకు సంబంధించిన సమస్తమును పరిపూర్ణం చేస్తావని మేము గుర్తెరిగి, నిన్ను పూర్తిగా విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, ఈ రోజు, మేము నీలో స్వాతంత్య్రమును, విశ్వాసం మరియు ఆనందాన్ని పొందుకొనునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మేము కోల్పోయినవాటన్నిటిని మరల పొందుకొనునట్లుగాను, మా కోర్టు కేసులో మాకు జయమును అనుగ్రహించుమని సమస్త స్తుతి మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.