నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి, కీర్తనలు 54:4వ వచనమును మనము నేడు ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు.'' తమిళ బైబిల్ అనువాదములో 'దేవుడే నాకు సహాయకుడు, నా జీవితములో నాకు సహాయము చేయువారితో కూడా, ఆయన ఉండును' అని వ్రాయబడియున్నది. పై వచనము ప్రకారము ప్రభువు మీకు సహాయము చేస్తాడు. ఆలాగుననే, మీకు సహాయము చేయువారికి కూడా ఆయన సహాయము చేస్తాడు. ఆయన వారితో కూడా ఉంటాడు. ఒకవేళ, మీ యొక్క తల్లిదండ్రులు, మీ బిడ్డలు, మీ జీవిత భాగస్వామి, ఆలాగుననే, మీతో కూడా పనిచేస్తున్నవారు. మీకు ఆర్డర్‌లు ఇవ్వడము ద్వారా మీకు సహాయము చేసేవారు. ఆర్థిక విషయాలలో మీకు సహకరించేవారు, మీకు సహాయము చేయు నిమిత్తము, వారు దేవుని చేత ఏర్పరచబడిన దేవదూతలై యున్నారు. వారు మీకు సహాయము చేసినప్పుడు, దేవుడే తన దూతలను వారికి పంపించి, వారికి సహాయము చేస్తాడు.

నా ప్రియులారా, ఒకవేళ నేడు మీరు ఆశ్చర్యపడవచ్చును, నాకు సహాయ పడినవారికి నేను వారికి సహాయము చేయలేకపోవుచున్నాను? నేను వారికి ఎలాగున సహాయము చేయాలి? అని మీరు అనుకుంటుండవచ్చును. అయితే, మీరు భయపడకండి, మీకు సహాయపడినవారికి దేవుడే వారికి సహాయము చేస్తాడని మీరు మరచిపోకండి. దేవుడు వారితో కూడా ఉంటాడు. దేవుడే వారి జీవితాన్ని చేపట్టి, వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి, మీ హృదయాన్ని కలవరమును చెందనీయ్యకండి.

నా ప్రియులారా, ఈ రోజున కూడా, యేసు పిలుచుచున్నాడు పరిచర్యల ద్వారా మరియు మీరు సమర్పించుచున్న కానుకల ద్వారా, ఈ పరిచర్యలో భాగస్థులుగా ఉంటున్న మీరు లక్షలాది మంది జీవితాలను పైకి లేవనెత్తి, చేపట్టుకుంటున్నవారుగా ఉంటున్నారు. అవును, మీరు లక్షలాది మంది ప్రజలకు సహాయము చేయుచున్నారు. ప్రభువు మీ జీవితాన్ని కూడా పైకి ఎత్తి పట్టుకుంటాడు. అంతమాత్రమే కాదు, ప్రభువు మీకు సహాయము చేస్తాడు. ప్రభువు మిమ్మును ఆశీర్వదిస్తాడు.

దేవుని ద్వారా అద్భుతంగా సహాయమును పొందుకున్న ఒక సహోదరి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను మీ పట్ల కోరుచున్నాను. ఒక ప్రియమైన సహోదరి పేరు డైసీ రాణి, ఆమె ప్రధాన అధ్యాపాకురాలిగా ఉన్నారు. ఆమె 20 సంవత్సరాలుగా యేసు పిలుచుచున్నాడు పరిచర్యతో భాగస్థులుగా ఉన్నారు. అంతమాత్రమే కాదు, ఆమె ఈ పరిచర్యలో కుటుంబ ఆశీర్వాద పధకములో సభ్యురాలుగా ఉండెను. ఆమె కుమారుడు యౌవన భాగస్థుల పధకములో భాగస్థుడుగా ఉన్నాడు. అయితే, ఆమె కుమారుడు కారుణ్య విశ్వవిద్యాలయములో చదువుచున్నాడు. కానీ, ఆకస్మాత్తుగా ఎవరో వారికి విరోధంగా చేతబడి చేశారు. అది ఆమెను ప్రభావితం చేసింది. తద్వారా ఆమె గొప్ప భయముతో నింపబడినది. ప్రచండమైన భయము ఆమెలోనికి వచ్చినది. ఇంకను ఆమె వ్యాధిగ్రస్థురాలుగా మారిపోయినది. ప్రతి రోజు ఒక స్వరము ఆమె దగ్గరకు వస్తుండేది. ఆ స్వరము ఆమెతో, 'నీవు ఎందుకు పనికిరావు, అని చెబుతుండేది. నీకు బలమే లేదు, నీవు ఓటమి పాలు అవుతావు. నీ ఆరోగ్యము కూడా క్షీణించిపోతుంది. నీవు పనిచేయడానికి వెళ్లలేవు' అని చెప్పు స్వరము ఇది మరల మరల ఆమె యొద్దకు వచ్చి, ఆమె హృదయమును కలతకు గురిచేయుచుండెను.

అటువంటి సమయములో, సెలవుల తర్వాత ఆమె తన కుమారుని కారుణ్య విశ్వవిద్యాలయమునకు హాస్టల్‌లో విడిచిపెట్టి వెళ్లడానికి కారుణ్యాకు రావలసి వచ్చినది. ఆమె అక్కడకు వచ్చినప్పుడు, నేను మరియు నా భార్య ఇవాంజెలిన్ బేతెస్ద కేంద్రంలో ప్రజల కొరకు ప్రార్థించుటకు వస్తున్నామన్న సంగతి ఆమె విన్నది. కారుణ్య విశ్వవిద్యాలయము కోయంబత్తూరులో ఉన్నది. బేతెస్ద కారుణ్య విశ్వవిద్యాలయము ప్రక్కనే ఉంటుంది. ఇది సౌందర్యవంతమైన ప్రార్థనా కేంద్రము. భారత దేశమందంతట నుండి ప్రజలు అక్కడికి వచ్చి, ప్రార్ధనా సౌలభ్యాలను పొందుకొనుటకు అక్కడ బస చేసి ప్రార్థించుకొంటారు. ఈ అందమైన ప్రార్థన కేంద్రం భారతదేశం నలుమూలల నుండి వచ్చి దాని ప్రశాంతమైన పరిసరాలలో దేవుని శక్తిని అనుభవించడానికి ఆహ్వానించబడుచున్నారు.

అది విన్న ఆమె నమ్మకముతో నింపబడి, ప్రార్థనా డోమ్ దగ్గరకు డైసీ రాణి పరుగెత్తుకొని వచ్చినది. ఆమె ప్రార్థన కొరకు మా యొద్దకు వచ్చినప్పుడు, నేను మరియు నా భార్య ఇవాంజెలిన్ ఆమె మీద చేతులు ఉంచి, నేను ప్రార్ధిస్తూ, 'ఈ పాత భయము మరియు పిరికితనము ఆమెలో నుండి ఇప్పుడే బయటకు రావాలి, ప్రభువైన యేసయ్యా, ఆమెకు విడుదలను దయచేయము, ఇంకను సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించుమని చెప్పాను.' అదేవిదముగా, సహోదరి ఇవాంజెలిన్ కూడా, ఆమెలో ఉన్న భయము మరియు పిరికితనము బయటకు వెళ్లిపోవాలని భారముతో ప్రార్థించారు. డైసీ రాణి వెంటనే పరిపూర్ణమైన విడుదల పొందుకున్న అనుభూతి కలిగినది. అంతమాత్రమే కాదు, ఒక దైవీకమైన శాంతి తన హృదయములోనికి వచ్చినది. భయమును కలిగించు దురాత్మ శక్తులు ఆమెను పూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోయినవి. ఆమె పరిపూర్ణముగా విడుదల పొందుకున్నారు. గొప్ప శాంతి, ఆమెలోనికి వచ్చినది. ఆమె దేహములో ఉన్న వణకు అంతయు ఆమెను విడిచి పెట్టి వెళ్లిపోయినది. తిరిగి వెళ్లి తన పని చేసుకోవడానికి తగిన బలమును దేవుని యొద్ద నుండి పొందుకొనిన ఒక నూతన వ్యక్తిగా మార్చబడి, ఆమె యింటికి వెళ్లడము జరిగింది. ఎటువంటి గొప్ప దేవుని మనము కలిగియున్నాము కదా.

నా ప్రియ స్నేహితులారా, డైసీ రాణికి సహాయము చేసి మరియు ఆమె భయము నుండి ఆమెను విడిపించి, ఆమెకు కావలసిన సహాయము చేశాడు. మీరు యేసుతో కూడా భాగస్థులు లైనప్పటికిని ఆయన మీకు సహాయము చేస్తాడు. యేసు మీకు నిత్య సహాయకుడుగా ఉంటాడు. అదేవిధంగా, భయముతో ఉన్న దురాత్మలను మీలో నుండి తోలివేస్తాడు. మీలో ఉన్న పిరికితనమును తొలగించి, ఆయన మిమ్మును కౌగలించుకొని, మీకు నిత్య సహాయకుడుగా ఉంటాడు. యేసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుచున్న దయ్యాలను తరిమివేస్తాడు మరియు ఆయన ప్రేమగల చేతుల్లో మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు. ఆయనయందు విశ్వాసముంచండి మరియు ఆయన మిమ్మును ఎప్పటికీ విడిచిపెట్టడని లేదా ఎడబాయడని గుర్తుంచుకొని, దేవుని యొద్దకు రండి, ఆయన నుండి విడుదలను పొందుకొనండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మా జీవితంలోని ప్రతి క్షణంలో మమ్మును నీ నడిపింపుతో నడిపిస్తున్నందుకు మరియు ఆదరిస్తున్నందుకు, మాకు ఎల్లప్పుడూ సహాయకుడిగా ఉన్నందుకు నీకు మేము వందనాలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీవు మా రక్షకుడివి, నీవు మాతోనూ, మాకు సహాయం చేయు వారితోనూ ఉంటావని మేము విశ్వసిస్తున్నాము. దేవా, మా కుటుంబాన్ని, మా స్నేహితులను మరియు ఈ ప్రయాణంలో మాకు సహాయము అందించే వారందరినీ ఆశీర్వదించుము. యేసయ్యా, నీవు వారితో ఉండుము మరియు నీ దయ మరియు బలంతో వారి జీవితాలను నిలబెట్టుము. ప్రభువా, నీవు మమ్మును ఎల్లప్పుడు విడువకుండా, ఎడబాయకుండా, నీ హస్తముల క్రింద మమ్మును సురక్షితముగా కాపాడి సంరక్షించుము. ఇంకను దేవా, నీ ఎడతెగని ప్రేమలో మేము శాంతి మరియు భద్రతను పొందుకొనునట్లుగాను మరియు మా హృదయంపై భారంగా ఉన్న అన్ని భయాలను మరియు ఇబ్బందులను తొలగించుము. ప్రభువా, నీ ప్రేమగల హస్తములకు మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము, మమ్మును కౌగలించుకొని, నీ ఆదరణ మరియు సహాయమును మాకు అనుగ్రహించుము. దేవా, ఎల్లప్పుడూ నీపై ఆధారపడటానికి మాకు సహాయం చేయుము, నీ సమృద్ధికరమైన దీవెనలను మేము పొందుకొని ఆనందించునట్లు చేయుమని యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.