నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 41:12వ వచనచము తీసుకొనబడినది. ఆ వచనము, "నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు'' అన్న వచనము ప్రకారము నా ప్రియులారా, మీ యొక్క ఉద్యోగములోను మరియు మీ ప్రభుత్వ ఉద్యోగములలోను, మీ యొక్క యింటి వ్యవహారములలోను, సామాజిక సంబంధమైన విషయాలలోను, మీరు యథార్థతతో నడుచుకుంటున్నారేమో? అయినప్పటికిని, మీ పేరును, ప్రఖ్యాతిని పాడు చేయడానికి, మీకు విరుద్ధమైన బాణాలు లేచుచున్నవేమో? కానీ దేవుడు మీకు న్యాయమును జరిగిస్తాడు. మీరు యథార్థత గల స్త్రీ/పురుషుడని ఆలాగున కనుపరచుకొనుటకు దేవుడు మీ పట్ల నిరూపిస్తాడు. ఆయన ఎల్లప్పుడు తన సానిధ్యములో తన ఆదరణచేత మిమ్మును బలపరచుచూ, అట్టి బాణములను ఎదుర్కొనునట్లుగా చేస్తాడు. చివరిగా ఆయన మీకు న్యాయమును జరిగించును, మీరు అన్ని విషయాలలోను జయించెదరు. మీ యొక్క పాఠశాలలోను, మీరు పనిచేయుచున్న స్థలములలోను, ఆలాగే ప్రభుత్వములోను, సమాజములోను, మీరు అన్నిటిలోను అత్యధికమైన విజయమును పొందుతారు. మీకు విరుద్ధముగా చేయబడిన అన్యాయము ఏదియు కూడ వర్థిల్లదు. మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము కూడ వర్థిల్లదు.


చెన్నై నుండి 73 సంవత్సరాల వయస్సుగల ఒక సహోదరుడు జయవేలు తన సాక్ష్యాన్ని ఇలాగున పంచుకొనియున్నారు. ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని మనము చూద్దాము. అతడు 2008వ సంవత్సరములో ప్రభుత్వ విద్యుత్త్ శాఖ సంబంధమైన ఉద్యోగము నుండి అతడు పదవి విరమణ చేశాడు. పదవి విరమణము చేసిన తర్వాత, కొన్ని దినములలోనే, ప్రభుత్వము ద్వారా ఒక హెచ్చరిక జారీ చేయబడినది, అతనికి విరుద్దముగా అతనిపై ఛార్జ్ షీట్ ఉందని మరియు కేసు నమోదు చేయబడి ఉన్నదని ప్రభుత్వం నుండి నోటీసు పొందుకున్నాడు. అతడు యథార్థత గల వ్యక్తి గనుక ఆ మాటలు విన్నప్పుడు అతని గుండె బ్రద్ధలై పోయినది. ఆవిధంగా విచారణను అతడు ఎదుర్కొనవలసి వచ్చినది. అతడు దానికి సహకరించాడు. ఆలాగుననే 2010లో ఒక విచారణ, 2011లో మరొక విచారణ,2015 వ సంవత్సరములో మరొక విచారణను అతడు ఎదుర్కొనవలసి వచ్చినది. ఎప్పుడు కూడ అతనిని ఏ మాత్రము సమాధానముగా ఉంచలేదు. వేదింపుల వెంబడి వేదింపులు అతనికి కలుగజేశారు. ఒక యథార్థత గల వ్యక్తికి ఈలాగున జరిగింది. చివరిగా అధికారులు అతని జీవిత విధానములో ఏ మాత్రము అక్రమము, తప్పు లేదని నిర్ధారణను జరిగించారు. అయితే, 8 సంవత్సరముల తర్వాత, తన యొక్క ఉన్నత అధికారిని కలుసుకోవడం కొరకు అతడు మాములుగా వెళ్లాడు. తన పై అధికారి, తాను నిర్ఘాంతపోయే ఒక విషయాన్ని అతనికి తెలియజేశాడు. వివాదన, విచారణ చేయుచున్న అధికారి, తాను వెళ్లిపోక ముందు, ఆ ఫైల్‌ను మూసివేయలేదనియు, అది ఇంకను విచారణలోనే ఉన్నదని చెప్పారు. 15 సంవత్సరాలు అనవసరంగా తప్పుడు నేరారోపణతో ఎంతగానో అతడు వేదింపునకు గురయ్యాడు.


అటువంటి సమయములో అతడు యేసుపిలుచుచున్నాడు ప్రార్థన గోపురము సహాయము కొరకు అక్కడకు వచ్చియుండగా, దేవుడు వారికి న్యాయము జరిగించాలని ప్రార్థన యోధులు ఎంతో భారముగా ప్రార్థించి యున్నారు. ఆ తర్వాత యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా కూటములలో వారు వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలుసుకొని యున్నారు. నేను వారితో కలుసుకొని ప్రార్థించి, 'ప్రభువా, నా పట్ల న్యాయము జరిగించుము, ఈ కేసు ముగింపునకు వచ్చునట్లుగా సహాయము చేయుమని, అడిగాను.' మహా అద్భుతంగా అదే సంవత్సరము ఆ కేసు మూత వేయడము మరియు న్యాయము కూడా జరిగింది. ఇతనిలో ఏ తప్పు కూడ మేము కనుగొనలేదు అని వారు చెప్పారు. దేవుడు మా పట్ల న్యాయమును జరిగించియున్నాడు అని జయవేలు చెప్పాడు. నేను ఎక్కడైతే, అన్యాయపు మార్గము ద్వారా వెళ్లియున్నానో, అక్కడ దేవుడు నాకు న్యాయమును జరిగించియున్నాడు. అతని యొక్క యథార్థతను బట్టి, దేవుడు అతని పేరు చేపట్టుకొని, వారికి న్యాయమును జరిగించియున్నాడు. దేవుని సాన్నిధ్యము ద్వారా అట్టి ఆవేదన వేదింపునంతటిని భరించులాగున చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియులారా, నేడు దేవుడు ఆలాగుననే మీకు జరిగించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
నీతిగల న్యాయాధిపతివైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా నిందారోపణల నుండి మాకు విడుదలను అనుగ్రహించుము. అట్టి దుష్ట ప్రజల నుండి మమ్మును విడిపించుము. దేవా, మా మీద మోపబడిన తప్పుడు కేసులను తొలగించి, మా పట్ల న్యాయము జరిగించుము. ప్రభువా, మా యొద్ద డబ్బును తీసుకొని ఇవ్వకుండా ఉన్నవారితో ఇప్పుడే మాట్లాడుము, ఇంకను రావలసిన డబ్బు న్యాయమైన రీతిలో మాకు తిరిగి వచ్చునట్లు చేయుము. దేవా, మాకు పదోన్నతిరావాలి, ఉన్నతమైన స్థాయిని పొందుకోవాలి. ఇంకను సమస్తమును రెండింతలుగా పొందుకోవాలి. నీ బిడ్డలమైన మేము యథార్థతను కలిగి జీవించునట్లుగా కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీ అచంచలమైన ప్రేమ మరియు న్యాయానికి కృతజ్ఞతతో నిండిన హృదయంతో మేము నీ యొద్దకు వస్తున్నాము. దేవా, మమ్మును నిలబెట్టినందుకు మరియు నీ సమక్షంలో మమ్మును ఏర్పాటు చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితంలోని అన్ని అంశాలలో-ఉద్యోగములో, ఇంటిలోను మరియు మా సంఘంలో, మా సమగ్రతను కాపాడుకునే శక్తిని మాకు అనుగ్రహించుము. దేవా, అన్యాయమైన నిందారోపణలు మరియు మా పేరును చెడగొట్టే ప్రయత్నాలను ఎదుర్కొన్నప్పుడు, నీవే మా రక్షకుడవనియు మరియు న్యాయానికి కర్తవై ఉన్నావని మాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, మాకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధం వర్థిల్లదని మేము గుర్తెరుగనట్లుగాను మరియు మేము స్థిరంగా నిలబడటానికి మాకు అధికారమును దయచేయుము. యేసయ్యా, మేము ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు నీ సౌలభ్యం, బలం మరియు శాంతితో మమ్మును నింపుము. దేవా, నీవు మా పట్ల న్యాయం చేస్తావనియు మరియు మా చుట్టూ ఉన్నవారికి మా యథార్థతను బయలుపరచుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, నీవు మా రక్షకునిగా మరియు మా న్యాయాధిపతిగా ఉండి మమ్మును నీతిమార్గములో నడిపించుమని యేసుక్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.