క్రీస్తునందు నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దానమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, బైబిల్‌లో, యోహాను 15:7వ వచనము చదువుదాము. యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, " నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి యుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.'' హల్లెలూయా! అది ఎంత అద్భుతమైన అనుభవము కదా. దేవుని వాక్యము చదవడము ద్వారా మనకు ఏమి లభిస్తుంది? ఈ వచనములో ఏమి వ్రాయబడియున్నదో జాగ్రత్తగా పరిశీలించుదాము. మనము దేవుని యందును మరియు ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. అంతమాత్రమే కాదు, ఆయన మాటలు మీలో నిలిచి ఉండాలి. అది లోతైన ్రకైస్తవ జీవితము. దేవుని వాక్యమును నామాకార్థముగా చదవకూడదు. మీరు చదివే వచనమును అర్థము చేసుకునేంత వరకు విడిచిపెట్టకండి. ఆ భాగమును మరల మరల చదువుతూనే ఉండండి. ఆ వాక్యము యొక్క అర్థాన్ని, అర్థము చేసుకొని దీవించబడండి. ప్రభువు యందు మీరు నిలిచి ఉండడము మరియు ఆయన మాటల యందు మీరును నిలిచి ఉండడము కూడా అదియే అయ్యి ఉంటుంది. మీరు ఆలాగున చేసినప్పుడు ఏమి జరుగుతుంది? మీకు ఏది ఇష్టమో దానిని అడుగుతారు, అది మీకివ్వబడుతుంది. అది ఎంత అద్భుతము కదా! మీరు ఆయన మాటల యందు నిలిచి ఉన్నప్పుడు, మీకు ఏది ఇష్టమో దానిని అడిగినప్పుడు అవన్నియు మీకు అనుగ్రహించబడతాయి. అది ఎంత గొప్ప ఆశీర్వాదము కదా!

నా ప్రియులారా, నేడు మీరు ఎంతగా వీలైతే, అంతగా వాక్యమును చదవాలి. దేవుని వాక్యమును మీరు 'భుజించాలి' అని సెలవిచ్చుచున్నది. మనకు ఇష్టమైన ఆహారము తినడము ఒక అలవాటు కదా. అదేవిధముగా, వాక్యమును తినండి, ఎంత వీలైతే అంత అధికముగా ఉంటుంది. అందుకే బైబిల్‌లో యోహాను 14:23వ వచనమును చదివినట్లయితే, " యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము'' అని చెప్పబడినట్లుగానే, ఆ వాక్యములో చెప్పబడినట్లుగా చేసినట్లయితే, పరిశుద్ధుడైన తండ్రి మీ యందు ఇష్టపడతాడు. తండ్రి మరియు కుమారుడు వచ్చి మీతో కూడా ఉంటాడు. హల్లెలూయా! అదేవిధముగా, లూకా 11:28 వ వచనము ప్రకారము "ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.'' నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యమును ఎంతగా విని, దానిని ఎంతగా ప్రేమించుచున్నారు? దేవుని వాక్యమును చదవడానికి ఎంత సమయమును వెచ్చించుచున్నారు? ఉదయముననే లేచి దేవుని వాక్యమును చదవండి. ప్రభువు వచ్చి, తన సన్నిధితో మిమ్మును నింపుతాడు.

నా జీవితములో చూచినట్లయితే, నేను ప్రతిరోజు ఉదయము 4.30 గంటలకు లేచి ప్రభువు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాను. ఇంకను వాక్యమును చదువుతాను. అప్పుడు బలమైన దేవుని సన్నిధిని అనుభూతి చెందుతాను. మీరు వృద్ధురాలైనను ఎలాగున ఆత్మీయ జీవితములో ఇంత పట్టుదలగా ఉండగలుగుచున్నారు అని కొంతమంది నన్ను అడుగుచున్నారు. మీరు ఒంటరిగా ఎలా జీవించుచున్నారు? మీరు ఎలాగున ఒంటరిగా ఉండగలుగుచున్నారు? నేను ఒంటరిదానను కాదు, ఒకవేళ నేను ఒంటరిగా ఉండవచ్చును. అయితే, దేవుని వాక్యము ద్వారా ఆయన ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నాడు, ఆయన సన్నిధి ద్వారా నేను ప్రభువునందు నిత్యము ఆనందించుచున్నాను. ఈ చిన్న ఉదాహరణను అనుసరించండి. హల్లెలూయా! మీ జీవితము బహుగా దీవించబడుతుంది. ప్రభువునందు మీరు నిలిచి ఉండండి. ఆయన వాక్యము మీలో నిలిచియుండును గాక. అప్పుడు మీరు కోరుకున్నది అది మీ జీవితములో జరుగుతుంది. మీరు ఈ రోజు ప్రార్థన చేసి ఈ ఆశీర్వాదాన్ని పొందగలరా? ఆలాగుననే నేడు మీరు దేవుని వాక్యమును చదివి, ఆయన యందు నిలిచి ఉండండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మిక్కిలి ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీలో నిలిచి ఉండమని మమ్మును పిలిచినందుకు మరియు నీ వాక్యం మా హృదయంలో నిలిచిపోయేలా చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, ఈ ప్రాముఖ్యమైన విషయమును మాకు నేర్పించినందుకై నీకు వందనాలు. దేవా, మేము నీ వాక్యమును విని, మా జీవితములో మేము నీ వాక్యమునకు విధేయత చూపునట్లుగాను మమ్మును నీ సన్నిధితో నింపుము. ప్రభువా, మేము కుటుంబముగాను లేక ఒంటరిగా ఉన్నను సరే, మేము నీ వాక్యమును శ్రద్ధతో చదువుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, దయచేసి నీ వాక్యమును గురించి మరింత ఆలస్యం చేయడానికి మరియు దాని అర్థాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయుము మరియు కేవలం అలవాటు ప్రకారముగా చదవకుండా, నీ వాక్యమును శ్రద్ధతో చదవడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ వాక్యం కొరకు మాకు తృష్ణను దయచేయుము. దేవా, మేము నీ వాక్యమును భుజించునట్లుగాను, తద్వారా మేము దానిని మాకు ఆధ్యాత్మిక పోషణగా ప్రతిరోజు భుజించునట్లుగాను మాకు నీ కృపను దయచేయుము. దేవా, ప్రతిరోజు మా ఆలోచనలు, కోరికలు మరియు క్రియల వైపు మమ్మును నడిపించి, నీ వాక్యం మాలో సమృద్ధిగా ఉండునట్లు చేయుము. తండ్రీ, మేము నీ వాగ్దానాలను ధ్యానించుచున్నప్పుడు, నీ శక్తివంతమైన సన్నిధి మరియు దైవీకమైన శాంతితో మమ్మును నింపుము. దేవా, ఉదయమును లేచి, నీ ముఖకాంతిని వెదకడం మరియు నీ పరిశుద్ధ లేఖనములతో ఉన్న జ్ఞానంతో ఆశీర్వదించబడడం మాకు నేర్పించుము. ప్రభువా, మేము నీలో నిలిచి ఉంటూ, నీ వాక్యమును అంగీకరించి, నీకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి మాకు నీ కృపను షనుగ్రహించుము. దేవా, నీ సంకల్పం ప్రకారం మా కోరికలు నెరవేరునట్లుగా చేయుము. ప్రభువా, నీ వాగ్దానాలు మరియు దయతో నిత్యము ఆశీర్వదించబడిన నీలో అద్భుతమైన జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.