నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 15:5వ వచనము తీసుకొనబడినది. ప్రభువు ఇలాగున అంటున్నాడు, "ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు...'' అని సెలవిచ్చినట్లుగానే, ఆయన మనకు ఆధారమై యున్నాడు. ఆయనే మన పునాది, మరియు మనం ఆయన మీద నిర్మించబడియున్నాము. ఆయన కదిలించబడలేని రాతి బండయై యున్నాడు, మరియు ఆయన మీద మరియు మనం ఆయన చేత, స్థిరంగా నిలిచి ఉండగల ఒక భవనంగా ఉన్నాము. ఈ సత్యాన్ని చక్కగా వివరించే ఒక కథను మా తండ్రిగారు తరచుగా నాతో పంచుకునేవారు. ఒక తండ్రి తన కుమారుని, తన యొక్క భుజాలపై మోసుకెళ్లుతూ, నది దాటుచుండెను. ఆ పిల్లవాని తండ్రి చాలా పొడవైన వ్యక్తి. కానీ, ఆ కుమారుని తన తండ్రి భుజాల మీద మోయుచూ, నదిని దాటుచుండెను. వారు నీటిలో నడుస్తున్న కొలది నదిలో నీళ్లు లోతుగాను, ఇంకను మరింత లోతుగా పోవుచుండెను. అతిత్వరలోనే, నెమ్మదిగా ఆ నది నీరు తండ్రి మెడ వరకు చేరుకున్నవి. దానిని చూచిన ఆ కుమారుడు భయపడి, 'నాన్న, నేను మునిగిపోతానా?' అని తన తండ్రిని అడిగాడు. తండ్రి అతనికి నమ్మకాన్ని కలిగించుచూ, ' నా కుమారుడా, నీవు మునిగిపోవాలంటే, దానికంటె ముందుగా నేను మునిగిపోవాలి. నేను అల్లకల్లోలమైన నీటి కంటే మరియు ఎత్తైన కెరటం కంటె నేను ఎంతో ఎత్తుగా ఉన్నాను మరియు నీవు నా భుజాలపై ఉన్నంత వరకు, నువ్వు భద్రంగా ఉంటావు. కానీ, నీవు మునిగిపోవు' అని చెప్పాడు.

అవును, నా ప్రియులారా, యేసు ప్రభువు మనకు ద్రాక్షావల్లి, ఆయనే మనకు నిత్యజీవమైన ద్రాక్షావల్లి. ఇంకను మనము ఆయనలో తీగలమై ఉన్నాము. ఆయన ఎల్లవేళల జీవించు ద్రాక్షవల్లియై ఉన్నాడు. ఆయన బలమైనవాడు మరియు అత్యంత శక్తివంతమైన రాతిబండయై యున్నాడు. ఆయన ఎన్నటికిని కదలించబడడు. ఆయన ఎన్నటికి ఎండిపోడు. మీరు ఆయనలో ఉన్నంత కాలం, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా, భద్రంగా ఉంటారు. మరియు మీరు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, మీరు ఎల్లవేళల అధికముగా ఫలించెదరు. దేవుడు మిమ్మును ఎల్లప్పుడు ఫలములు ఫలించే వృక్షమువలె చేస్తాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు, మీరు వాడిపోతున్నట్లు అనిపించవచ్చును, కానీ మిమ్మల్ని మీరు యేసుతో అనుసంధానించుకోండి. ఆయన జీవముగల ద్రాక్షావల్లి. మీరు ఆయన కొమ్మలుగాను మరియు శాఖలుగాను ఉన్నప్పుడు, మీరు నిత్యము ఆయనలో జీవించెదరు. ఆలాగుననే, ఆయనలో ప్రవహించు కృప ద్వారా మీరు ఇంకను ఫలములను ఫలించెదరు. మరియు ఆయన కృప ద్వారా మీరు అత్యధికమైన ఫలములను ఫలించెదరు. మీరు యేసుతో అనుసంధానించబడి నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి మరియు మీరు ఇంకను నేటి నుండి అధికంగా ఫలించెదరు.

సహోదరి తమిళ్ సెల్వి, యేసు పిలుచుచున్నాడు కూటాల ద్వారా ఆమె మొట్టమొదటగా యేసును గురించి విన్నారు. ఆమె యేసు ప్రేమకు ఆకర్షితురాలై, ఆమె ప్రార్థనా గోపురమునకు రావడం ప్రారంభించెను. తర్వాత, ఆమె తన కుమారుని Äౌవన భాగస్థుల పధకములో భాగస్థునిగా చేర్చించెను. ఆమె కుటుంబమును, కుటుంబ ఆశీర్వాద పధకములో తన కుటుంబాన్ని నమోదు చేసుకొనెను. తర్వాత, ప్రార్థనా గోపురములో చేయుచున్న ప్రార్థనల ద్వారా ఆమె యేసుతో అనుసంధానించబడి ఉండటంతో, ఇతరుల కొరకు ప్రార్థించాలనే లోతైన వాంఛ ఆమెలో కలిగి యుండెను. కనుకనే, ఆమె యేసు పిలుచుచున్నాడు శక్తి సేవా పరిచర్యలో పాల్గొనుట ద్వారా పరిశుద్ధాత్మ చేత ఆమె అభిషేకించబడి, ప్రార్థన గోపురంలో ఇతరుల కొరకు స్వచ్ఛందంగా ప్రార్థించడానికి శిక్షణ పొందియుండెను. ఆమె స్వచ్ఛందంగా ప్రార్థన గోపురంలో ఇతరుల కొరకు ప్రార్థించడానికి ప్రారంభించినప్పుడు, ఆమె చేయుచున్న ప్రార్థనల ద్వారా అద్భుతాలు జరగడం ప్రారంభించబడినవి. ప్రజలు ఆమెను ఎంతగానో ప్రేమించుట ద్వారా, వారు ఆమె వైపునకు ఆకర్షితులయ్యారు మరియు అనేకమంది ఆమె ప్రార్థనల ద్వారా యేసుక్రీస్తునకు సమీపమయ్యారు. ఇంకను అనేకమంది పరిచర్యలో భాగస్థులయ్యారు. దేవుని బిడ్డలైన తర్వాత, వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్న తర్వాత, దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరచి, దేవుడు ఆమె వృత్తిలో పైకి తనను లేవనెత్తాడు. దేవుడు ఆమెను తన ఉద్యోగములో అత్యంత ఉన్నత స్థానమును అనుగ్రహించాడు. ఈ రోజు ఒక విద్యా వ్యవస్థలో పరీక్షలలో పర్యావేక్షణ అధికారిగా ఆమె హెచ్చింపబడియున్నారు. ఇతరులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరమైన జీవితమును ఆమె కలిగియున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.

కాబట్టి, నా ప్రియమైన వారలారా, నేడు మీరు కూడా అత్యధికంగా ఫలించాలంటే, మిమ్మును మీరు దేవుని హస్తాలకు సమర్పించుకొనండి. ఇంకను జీవముగల నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుతో అనుసంధానించబడినప్పుడు, మీ మోడుబారిన జీవితాలను ఆయనలో చిగిరింపజేసి, మిమ్మును ఫలభరితమైన జీవితముగా అనేకులకు దీవెనకరముగా మారుస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా మీరు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన తీగెలుగా ఉన్న మీకు అత్యధికంగా ఫలభరితమైన జీవితమును అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా బలమైన పునాదిగాను మరియు కదిలించబడలేని రాతి బండగాను నీవు ఉన్నందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీవు నిజమైన ద్రాక్షావల్లివి, మరియు మేము నీలో తీగెలుగా ఉన్నాము. కనుకనే, మేము ఎల్లప్పుడూ నీలో నిలిచి ఉండటానికి మాకు సహాయం చేయుము. దేవా, ఈ లోక శ్రమలు కెరటాల వలె పైకి లేచి భయం మమ్మును ఆక్రమించినప్పుడు, మేము నీ భుజాలపై సురక్షితంగా ఉన్నామని మాకు గుర్తు చేయుము. ప్రభువా, నీ జీవము ఇచ్చే కృప మా ద్వారా ప్రవహించి, అలసిపోయిన మా ఆత్మను పునరుజ్జీవింపజేసి, మమ్మును ఫలవంతంగా చేయుము. దేవా, మా జీవితాలను నీలో రూపాంతరపరచబడి, నీ కృప ఇప్పుడే, యేసు నామములో మా మీదికి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మేము ప్రార్థించునప్పుడు, మా ద్వారా అద్భుత కార్యాలు జరుగునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. దేవా, నీలో లోతుగా పాతుకుపోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, ఎండి పోయిన మా జీవితాలు ఫలభరితమైనదిగా ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, తీగెలముగా మేము నీలో నిలిచియుంటూ, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి మరియు అత్యధికంగా ఫలించడానికి మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపుము. ప్రభువా, మేము ఎప్పుడూ ఎండిపోకుండా, ఎల్లప్పుడూ నీ యొక్క జీవజలము యొక్క ఊటలతో మమ్మును నింపి, నిత్యము కదిలించలేని పునాది మీద మేము నీలో కట్టబడుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నేడు మేము ఎదుర్కొంటున్న మా భయాలను, మా పోరాటాలను మరియు మా సందేహాలను నీ చేతులలోనికి అప్పగించుచున్నాము, మేము నీతో పూర్తిగా అనుసంధానించబడి జీవించుచునట్లుగాను మరియు మా జీవితం నీకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.