నా ప్రియ స్నేహితులారా, ప్రభువు సన్నిధిలో కూర్చుని ఆయన మాటలను ఆలకించడం ఎంతో సంతోషకరమైన ఆశీర్వాదం కదా. ఆయన మన హృదయాలను ఎల్లప్పుడు వర్ణించలేని తన సంతోషంతో నింపుతాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 60:2వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది.'' అవును, ప్రభువు యొక్క మహిమ మన మీదికి దిగివస్తుంది. అయితే, ఈ చీకటి మన జీవితాలలోనికి ఎలాగున ప్రవేశిస్తుంది? మనం ప్రతికూలతను మనలో వేళ్ళూనుకోవడానికి అనుమతించినప్పుడు అది జరుగుతుంది. మనం కూర్చుని ఇతరులను గురించి నిరంతరం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే, ఎవరిని గురించియైన చెడుగాను లేక వ్యర్థమైన మాటలను మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే, ఎవరిని గురించియైన ఫిర్యాదు చేయుచు లేదా ఎవరి గురించియైన ఎగతాళి చేస్తూ ఉంటాము, మనము మంచి విషయాలను వారిని గురించి మాట్లాడము. అ టువంటి వ్యతిరిక్తమైన మాటలను నిరాంతరాయముగా మాట్లాడుకుంటున్న ప్పుడు, చీకటి, చింతలు మన హృదయాలను ఆవరిస్తాయి. అదేవిధంగా, నిరాంతరాయంగా ప్రజలతో మనం ఆందోళనకరమైన లేదా ఇబ్బందికరమైన సంగతులను మాట్లాడుతూ ఉన్నట్లయితే లేక ఆలాంటివి వారి యొద్ద నుండి వింటున్నట్లయితే, 'అయ్యో, మా ఉద్యోగాలకు భద్రత లేదు, లేక మా కుటుంబ పరిస్థితి ఎన్నో సమస్యలలో కూరుకుపోయి ఉన్నది లేదా మేము చేయవలసిన కార్యాలకు లేక మా కావలసిన అవసరతలకు డబ్బులు ఎలాగున మరియు ఎక్కడ నుండి వస్తాయి?' అను ఇటువంటి విషయాలు మనము వింటున్నప్పుడు, భయం మన హృదయాలలోనికి ప్రవేశిస్తుంది. మరియు మనం భోగేచ్ఛల సంబంధమైన దృశ్యాలను వీక్షిస్తున్నట్లయితే లేదా వాటిలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఒక గాఢమైన చీకటి మనలను ఆవరిస్తుంది. ఈ లోకము ఇట్టి అంధకారమును మనకు కలిగిస్తుంది. ఈలాగుననే అంధకారము మనలను ఆవరిస్తుంది.
కానీ, నా ప్రియ స్నేహితులారా, మరొక మార్గం కలదు. మీరు ప్రభువు సన్నిధిలో కూర్చుని ఆలకించినప్పుడు, బైబిల్‌ను చదివినప్పుడు, ఆత్మలో ప్రార్థించినప్పుడు లేదా ఎవరితోనైనా ప్రార్థనలో చేతులు కలిపి ప్రార్థించినట్లయితే, సంపూర్ణమైన ఉత్సుకతతో ప్రభువు కొరకు పని చేయుటకు బయలు వెళ్లినట్లయితే, ఆయన వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది. మీరు ఆయనను ఉత్సాహంగా సేవించినప్పుడు మరియు దేవుని సేవకులు యొద్ద లేక ఆయన యొక్క వాగ్దానాలను ప్రకటించడాన్ని లేదా ప్రవచనాత్మకమైన దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించినప్పుడు, ప్రభువు మీలో నుండి లేవడాన్ని మీరు చూచెదరు. అంతమాత్రమే కాదు, ఆయన మహిమ మీ మీద ఉదయించడం మీరు చూచెదరు. అవును, మీరు ఆయన మహిమను చూచెదరు. ఇంకను, ఆయన దైవీకమైన సన్నిధితో మీ జీవితము ఆవరించబడుతుంది. అప్పుడు మీ జీవితము దేవుని యొక్క మహిమ చేత నడిపించబడుతుంది. మీరు చేయు ప్రతి పనిలో మిమ్మును ముందుకు కొనసాగునట్లుగా నడిపిస్తుంది. ఆదాము హవ్వలను జ్ఞాపకము చేసుకున్నట్లయితే, వారు దేవుని పనిని చేయుచుండగా, ప్రతిరోజు ప్రభువుతో నడచుచూ, ఆయన ఉద్దేశాలను నెరవేర్చుచున్నప్పుడు, దేవుని మహిమ వారి మీద నిలిచి ఉండె ను. కానీ వారు పాపంలోనికి ప్రవేశించి, ఆయనకు అవిధేయత చూపిన అదే క్షణంలోనే, ఆయన మహిమ వారి నుండి తొలగిపోయింది మరియు అంధకారము వారిని కమ్మివేసింది. పాపపు శాపం వారి జీవితాలను కప్పివేసింది.
కాబట్టి నా ప్రియులారా, ఈరోజు, ప్రభువును మనతో మరియు మనకు సమీపముగా ఉంచుకునే విషయములో మనం జాగ్రత్తగా ఉందాము. ఆయ నను ఇలాగున అడుగుదామా? 'ప్రభువా, భూసంబంధమైన విషయాల నుండి ప్రవేశించకుండా, వాటికి దూరంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. భూసంబంధమైన మార్గములను గురించి మేము మాట్లాడకుండా ఉండునట్లుగాను లేదా ప్రజలు సూచించే చెడు కార్యములు చేయకుండునట్లుగా చేయుము. తప్పులపై మనం దృష్టి పెట్టకూడదు. వారి బెదిరింపులకు మరియు వారి హెచ్చరికలకు ఏ మాత్రము భయపడకుండునట్లు చేయుము. కానీ, మా హృదయములు నీ వాక్యముతో భద్రపరచబడి యుం డాలి. ప్రభువా, మాతో నిరంతరాయంగా మాట్లాడుము. బైబిల్ నుండి మేము అనేక సత్యాలను నేర్చుకోవాలి, ఆత్మలో నీ స్వరమును వినాలి. మా హృదయాలు నీ వాక్యమందు స్థిరముగా నిలిచి ఉండాలి. దేవా, నీ చిత్తమును జరిగించాలి. పరిశుద్ధాత్మ మాకు సహాయము చేయుము. దేవుని మహిమ నేడు మీపై ఉదయించి మీ జీవితాన్ని నడిపించునట్లు చేయుమని ' మీరు ప్రార్థించినట్లయితే, ఆయన వెలుగుతో మీరు ప్రకాశవంతంగా ప్రకాశిస్తారు మరియు ఆయన సన్నిధి మీ ప్రతి అడుగును నడిపిస్తుంది. ఈ రోజు దేవుని మహిమ మిమ్మును నడిపించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ సన్నిధి కొరకు తృష్ణగొని యున్న మేము నీకు విధేయతగల హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, ప్రభువా, మాపై నీ వెలుగును ప్రకాశింపజేయుము, మమ్మును చిక్కులలో పెట్టడానికి ప్రయత్నించే ప్రతి చీకటిని తరిమికొట్టుము. ప్రభువా, నీతో మా సంబంధాన్ని ప్రభావితం చేయుచున్న ప్రతి వ్యతిరిక్తమైన మాటలను, భయం మరియు పాపం నుండి దూరంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ వాక్యపు ఆనందంతో మరియు నీ ఆత్మ యొక్క బలంతో మమ్మును నింపుము. ప్రభువా, నీ వాగ్దానాలపై నమ్మకం ఉంచి, నీ పరిపూర్ణ చిత్తానికి సంపూర్ణంగా విధేయతతో నీలో నడవడానికి మాకు నేర్పించుము. దేవా, నీ ఆత్మశక్తితో మమ్మును నింపి, మా జీవితాలను మహిమవంతము చేయుము. ప్రభువా, బలహీనులమైన మమ్మును నీ మహిమ కప్పునట్లుగాను మరియు శక్తివంతులనుగా చేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువైన దేవా, అంధకారములో ఉన్న మా జీవితాలలో నీ మహిమ మా మీద ఉదయించి, మేము వేయుచున్న ప్రతి అడుగులో మమ్మును చక్కగా నడిపించుము. దేవా, మా జీవితం ఎల్లప్పుడూ నీ దెవీకమైన సన్నిధిని ప్రతిబింబించునట్లు చేయుము మరియు నీ నామానికి మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుమని యేసుక్రీస్తు మహిమ గల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.