నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు ఒక గొప్ప దినము. అదేమనగా, నా భర్తగారైన డాక్టర్. డి.జి.యస్. దినకరన్‌గారు పరిశుద్ధాత్మ అభిషేకమును మరియు శక్తిని పొందుకున్నటువంటి దినము.

మేము కారుణ్య విశ్వవిద్యాలయమును ప్రారంభించిన దినములలో, మేము అనేక సమస్యలను ఎదుర్కొనేవారము. ఆ సమస్యల మధ్యలో ఒక రోజు, అక్కడ ఒక అద్భుతమైన కార్యము జరిగినది. అయితే, అక్కడ ఉన్న ఒక కాపల దారుడు భూమిని మరియు ఆకాశమును అంటునంతగా ఒక గొప్ప వెలుగును చూచాడు. కనుకనే, కారుణ్యలో అదే స్థలములో దర్శన కేంద్రముగా ఇప్పటి వరకు కలిగియున్నాము. నిజమే, కారుణ్యలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసియున్నాడు. మరియు అక్కడికి వచ్చినవారు ఆయన సన్నిధి అక్కడ అనుభూతి చెందుతూనే ఉంటున్నారు. అదేవిధముగా, 2 సమూయేలు 22:33వ వచనములో, "దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును'' ప్రకారం, దేవుని మార్గములో మనలను నడిపించడానికి
ఆయన మనకు బలమైన కోటగా ఉంటాడు.

నా ప్రియు స్నేహితులారా, మనము కేవలము దేవుని మాత్రమే నమ్మాలి. మన పూర్ణ విశ్వాసము ఆయన మీద ఉంచాలి. అప్పుడు, మనమందరము యేసయ్య యొక్క అభిషేకపు శక్తిని పొందుకొనగలము. అందుకే బైబిల్‌లో 2 సమూయేలు 22:1వ వచనములో మనము చూడగలము. దైవజనుడైన దావీదును చూచినట్లయితే, అతడు తన శత్రువుల నుండి విడిపించబడినప్పుడు ఈ పాట పాడినాడు. "యెహోవా తన్ను సౌలు చేతిలో నుండియు, తన శత్రువులందరి చేతిలో నుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను'' ప్రకారం, దావీదు దేవుని యందు స్థిరమైన విశ్వాసమును కలిగియుండెను. దావీదు దేవునిని మాత్రమే నమ్మాడు.

బైబిల్‌లో కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు''అని దావీదు అంటున్నాడు. కానీ, ఈ భాగమును మనము ఏ విధంగా చదువుతాము. 'దేవుడు నా కాపరి' అని మీరు ధైర్యముగా చెప్పగలుగుతారా? అవును, 'దేవుడు నాకు కాపరియై యున్నాడు.' సర్వశక్తిమంతుడైన దేవునిని దావీదు కాపరిగా కలిగియున్నాడు. కనుకనే, అతడు ధైర్యముగా చెప్పగలిగాడు. అందుకే బైబిల్‌లో కీర్తనలు 23:4 వ వచనములో చూచినట్లయితే, దావీదు ఇలాగున అంటున్నాడు, "గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును'' ప్రకారము మనము ఎటువంటి పరిస్థితులలో ఉన్నను సరే, మనకు ఎటువంటి అపాయము కలుగదు. ఆలాగుననే, దేవుడు మన పక్షమున ఉండగా, మనకు విరోధి యెవడు? కనుకనే, మీరు కూడా, "దావీదు నా కాపరి'' అని ధైర్యంగా చెప్పండి.

నా ప్రియులారా, నా భర్తగారు అభిషేకమును పొందుకున్న రీతిగానే, మీరు కూడా ఇటువంటి అభిషేకమును పొందుకుంటారు. నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు, మీరు కూడా ఇటువంటి దర్శనమును చూడగలుగుతారు. కనుకనే, నేడే 'దేవుడే నా కాపరి ఆయన శక్తి నాకు కావాలి' అని ప్రార్థించండి. ప్రభువు ఇప్పుడే తన పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మును నింపుతాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నీ బిడ్డల కొరకు దాచి పెట్టి ఉంచిన దీవెనలన్నిటిని వందనాలు. నిరశదావీదును కాపాడినట్లుగానే, మమ్మును కూడా నింపుము. దేవా, దర్శనముల కొరకు నీ శక్తియందు మేము విశ్వాసముంచి, విశ్వాసముతో నింపబడిన హృదయముతో నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీవు మా బలమైన ఆశ్రయం, మా కాపరి, మరియు మేము నీ యందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచాము. దేవా, దావీదు రాజును అభిషేకించి, ప్రతి శోధనలలో అతనిని నడిపించినట్లుగానే, ఈ రోజు మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, కష్టాలు మరియు గాఢాంధకార వేళలలో కూడా నీవే మా వెలుగు మరియు మా బలం. దేవా, డా.. డి.జి.యస్. దినకనరన్‌గారి జీవితంలో నీవు అద్భుతాలు చేసినట్లుగానే, మేము నీ శక్తిని అనుభవించాలని కోరుకుంటున్నాము. ప్రభువా, నీ సన్నిధితో మా హృదయాన్ని నింపుము, మమ్మును నీతిమార్గంలో నడిపించుము. దేవా, నీవు మా కాపరివని దావీదు వలె ధైర్యంగా ప్రకటించడానికి మాకు సహాయం చేయుము. మేము దేనికిని భయపడకుండా, నీ దుడ్డు కర్రయును, నీ దండముతో మమ్మును ఆదరించుము. మరియు నీ సౌఖ్యం ఎల్లప్పుడూ మమ్మును చుట్టుముట్టునట్లు చేయుము. దేవా, నీవు మా మీద కుమ్మరించుచున్న నీ శక్తివంతమైన అభిషేకానికి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచూ, యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో, మేము ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.