నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి గలతీయులకు 6:9 వ వచనం ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆ వచనము, "మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము'' ప్రకారము, పరిస్థితులు కష్టతరంగా ఉన్నప్పుడు, మన పనులలో ప్రతిఫలము రానప్పుడు, దానిని ఏ మాత్రము కూడ విడిచిపెట్టకండి. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు విడిచిపెట్టాలనే తాపత్రయం ఎల్లప్పుడు ఉంటుంది. ఇంకను సవాలు సహితమైన స్థితిగతులు ఎదురైనప్పుడు, విడిచిపెడదాము అన్నట్టు శోధనలు ఎదురవుతాయి. మీరు ఆ విధంగా విడువకుండా వుండిన యెడల, నిశ్చయముగా పంట కోతురని గుర్తుంచుకోండి.

ఒక ఫర్యాయము, ఒక యౌవన దైవజనుడు ఫోన్ ద్వారా నా భర్తగారితో మాట్లాడుచున్నప్పుడు నేను గమనించాను. దేవుని సేవ చేయుచున్నందు వలన అనేకులు అతనిని కించపరచడం, విమర్శించడం జరుగుట ద్వారా అతడు తన హృదయములో ఎంతగానో కలత చెందాడు. అన్ని వైపుల నుండి అతనిని ఎగతాళి చేయుచున్నారు. అతనికి ఆ సమయములో ఆ పరిస్థితులు చూచుటకు ఆ రీతిగానే ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించినది. కనుకనే, అతడు ఏ మాత్రము కూడ ముందుకు వెళ్లలేకపోవుచున్నానని చెప్పాడు. అతడు నా భర్తతో ఏమని చెప్పాడనగా, 'నేను ఇక దీనిని విడిచిపెడతాను, నేను ఏదైన ఒక క్రొత్త వ్యాపారమును ప్రారంభించుకొని, నా జీవితాన్ని కొనసాగించుకోనా? లేదా? అని నా భర్తను సలహా అడిగాడు. అయినప్పటికిని నా భర్త వారికి సమాలోచన చెప్పారు. నా భర్తగారు, అతనికి సలహా ఇస్తూ, "వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తడానికి కృషి చేయండి'' అని చెప్పారు. ఈ ఒక్క మాట అతనిని తాకియున్నది. దేవుని ఆ రీతిగా చేపట్టుకొని, గట్టిగా అంటిపెట్టుకొని యున్నాడు. ఈ రోజున బలముగా దేవుని చేత వినియోగింపబడుచున్న ఒక గొప్ప కాపరిగా ఉన్నారు. ఈ రోజు దేవుని అద్భుతకార్యాలను జరిగించడానికి దేవునిచేత బలముగా వాడబడుచున్న ఒక కాపరిగా ఉన్నారు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ఎప్పుడు కూడ విడిచిపెట్టకండి. స్నోడ్రాప్ ( మంచు చుక్క) అని పిలువబడే ఒక మొక్క ఉన్నది. అది చాలా మృదువైనదిగాను మరియు ఆ యొక్క పుష్పము చాలా ధవళమైన రంగులో ఉంటుంది. అది చాలా సున్నితంగాను, మృదువుగాను ఉంటుంది. అది పుష్పించినప్పుడు, తెలుపు రంగులో కనబడుతుంది. సహజంగా పువ్వులు వికసించే వేళలో, అది కూడ వికసిస్తుంది. ఎందుకంటే, చలికాలం, శీతాకాలం చివరలో లేదా వసంత ఋతువు ప్రారంభంలో వికసించే తొలి తోట పువ్వులు, కొన్నిసార్లు మంచు నేలపై ఉన్నప్పుడు ఉద్భవిస్తుంది. మొక్క క్రీస్తు వలె నిరీక్షణ మరియు నూతన జీవాన్ని సూచిస్తున్నది. స్నోడ్రాప్ (మంచు చుక్క)అనే మొక్క మనకు ఇచ్చే సందేశము ఏమనగా, 'ఏ మాత్రము పనిని మధ్యలో విడిచిపెట్టకండి.' ఇది క్రీస్తులోనూతనమైన జీవమునకు, నిరీక్షణకు సాదృశ్యమై యున్నది. ఈ మొక్కవలె, మీ కష్టకాలంలో కూడా, బయటకు వచ్చి, చచ్చుకొని, ముందుకు వచ్చి వికసించేలా మీరు కూడ ఆలాగననే కొనసాగాలి, మీరు ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా పంట కోసెదరు.

బైబిల్‌లో, 2 దినవృత్తాంతములు 15:7లో ఈలాగున చెబుతుంది,"కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును'' అన్న వచనం ప్రకారం మీ మంచి కార్యము సఫలమగును. ప్రతి ఒక్కరికి కూడ దేవుని యొద్ద నుండి పిలుపు ఉన్నది. దేవుడు మిమ్మును ఏ పని చేయు నిమిత్తమై పిలిచియున్నాడో కేవలం అట్టి పనిని మీరు జరిగించండి. కానీ, దానిని ఎప్పుడు కూడ విడిచిపెట్టకండి. ప్రభువు మిమ్మును మరియు మీ యొక్క కుటుంబములోను, సంఘములోను, పరిచర్య పొలము అను పరిథిలోను మీరు వినియోగింపబడునట్లు చేస్తాడు. తద్వారా, మీ యొక్క కార్యము సఫలమగుతుంది, మీకు తగిన ప్రతిఫలము వస్తుంది. మేలు చేయుటలో ఏ మాత్రము నిరుత్సాహము చెందకండి మరియు విసుకకండి, తగిన సమయమందున మీకు ప్రతిఫలము వచ్చును. రైతు పంట పుష్పించి వికసించుటకు సరైన సమయము వస్తుందని ఎదురు చూస్తుంటాడు. ఒక రైతు పంట రావడము కోసం ఎంతో సహనముతో వేచి ఉంటాడు. ఆ రీతిగా మీరును కూడ సహనముతో వేచి ఉండండి. మీరు తగిన కాలమందు పంట కోసెదరు. నా ప్రియ స్నేహితులారా, దేవుని సౌందర్యము మీలో కనబడును గాక. ప్రభువు మీ చేతి పనిని అంతటిని ఆశీర్వదించును. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలైన మమ్మును నేడు ఆశీర్వదించు ము. దేవా, నీ యెడల, నీ ప్రజల యెడల మేము చూపించిన ప్రేమ ప్రయాసను మరచిపోవుటకు నీవు కృతజ్ఞతలేని దేవుడవు కాదు, నేడు మేము చేసిన ప్రతి పనికి నీవు మాకు తగిన ప్రతిఫలమును దయచేయుము. దేవా, నీ హస్తము చేత మమ్మును పైకి లేవనెత్తుము. ప్రభువా, దయచేసి ఈరోజు మమ్మును ఆశీర్వదించుము. దేవా, నీవు మా పనులకు తగిన ప్రతిఫలమును ఇస్తావనియు మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము నిన్ను విశ్వసించాలనియు మరియు నీ ఆశీర్వాదాల కొరకు ఎదురుచూస్తున్నాము. దేవా, బలహీనమైన మా చేతులను బలపరచుము మరియు మా యెదుట నీవు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా కుటుంబం మరియు కార్యాలయంలో ప్రతిఫలాన్ని చూచునట్లుగాను మరియు మేము నీ కొరకు చేయుచున్న ప్రతిదానిలో సమృద్ధిగా పంటను అనుభవించునట్లు చేయుము. తండ్రీ, మేము మా జీవితంలో నిరీక్షణ, భవిష్యత్తు మరియు నూతన ప్రారంభం కొరకు ఎదురు చూస్తున్నాము. మా జీవితంలో ప్రతిదీ వికసించి, వర్ధిల్లునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.