నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 43:1వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి యున్నాను భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు'' అని ప్రభువు అంటున్నాడు. కాబట్టి, మీరు భయపడకండి.
నా ప్రియులారా, ఈ లేఖనము ప్రకారము మీరు దేనిని గురించి భయపడవద్దు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన మిమ్మును విమోచించియున్నాడు. ఇంకను మీ పేరు పెట్టి మిమ్మును పిలిచియున్నాడు. 'మీరు నా సొత్తు అని అంటున్నాడు.' ఒకవేళ, మీరు, ' నేను మరల మరల పాపము చేయుచున్నాను, ప్రభువు నన్ను క్షమిస్తాడా? అని అంటున్నారేమో? లేక నా పాపమును విడిచిపెట్టి మరచిపోవాలనుకుంటున్నాను. కానీ, నాకు తెలియకుండానే, మరల మరల నేను పాపము చేయుచున్నాను, ప్రభువు నన్ను క్షమిస్తాడా? ఆయన మరల నన్ను చేర్చుకుంటాడా? అని ఆలోచించుచున్నారేమో?' ప్రభువే మీ పాపమును అధిగమించడానికి మీకు సహాయము చేస్తాడు.
నా ప్రియులారా, ప్రభువు మిమ్మును ప్రేమ హస్తాలతో హత్తుకుంటాడు మరియు మిమ్మును పేరు పెట్టి పిలుచుకొని యున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును చూచి, 'మీరు నా సొత్తు అంటున్నాడు.' కనుకనే, మీరు ఆయన యొద్దకు పరుగెత్తండి. మీ పాపములన్నిటిని విడిచిపెట్టి వేయండి. మీరు ప్రభువు చిత్తమును జరిగించండి. ప్రేమ గలిగిన యేసయ్య దృష్టిలో ఏది మంచిదో దానినే చేయండి. అప్పుడు ఆయన మిమ్మును విజయపథంలోనికి నడిపిస్తాడు. అంతమాత్రమే కాదు, మీరు చేయు పనులన్నిటిలోను మీకు విజయమును అనుగ్రహిస్తాడు. ఈ విమోచన కొరకై ప్రభువుకు వందనాలు చెబుదాము. ఈ రోజే ఆయన వద్దకు పరుగెత్తుకొని వెళ్లదాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసూ, మమ్మును విమోచించినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును పేరు పెట్టిపిలిచినందుకై, మేము నీ సొత్తు అని చెప్పినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు కూడ మా దేవుడవై ఉన్నావని మాకు కనుపరచుకొని నీకు దగ్గరకు చేర్చుకున్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, ఈ రోజు పాపముతో బంధింపబడియున్న మమ్మును నీ రక్తము ద్వారా విమోచించపబడుటకును, ప్రతి పాపమును అధిగమించే కృపను మాకు దయచేయుము. ప్రభువా, మా మరియు మా ప్రియులగు వారి యొక్క ప్రతి వ్యసనమును నుండి తొలగించుము. దేవా, లోకాశలపై ఉన్న మా దాహాన్ని తొలగించుము మరియు నీ యొద్ద నుండి కానిది ప్రతిది కూడా, నీ బిడ్డలైన మమ్మును ఇప్పుడే విడిచిపెట్టి వెళ్లిపోవునట్లు చేయుము. ప్రభువా, మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించుచున్నాము, మా ప్రియులైనవారిని విమోచించుము. యేసయ్యా, నీ రక్తము ద్వారా మమ్మును మరియు మా ప్రియులైన వారి పాపమును కడిగి శుభ్రపరచి, నూతన పురుషునిగాను, స్త్రీనిగాను ఈ రోజే మమ్మును మార్చుము. దేవా, భయము లేకుండా, మేము పరుగెత్తుకుంటూ నీ యొద్దకు వచ్చునట్లు చేయుము. ఇంకను ఏ నేరారోపణ లేకుండా, నీ చాచిన బాహుల యొద్దకు పరుగెత్తుకుంటూ వచ్చునట్లుగాను, నీ విమోచన శక్తిని అనుభూతిని చెందునట్లుగా చేయుము. ప్రభువా, నీవు ఇచ్చు నూతన జీవము మేము అనుభవించునట్లు చేసి, నీ యొక్క నూతన జీవములో మేము సంతోషించునట్లుగాను మరియు మేము ఎల్లప్పుడు నీకు చెందినవారముగా ఉండునట్లుగా చేయుము. దేవా, నీ దృష్టిలో మంచిని చేయునట్లుగాను మరియు విజయప«థంలో మేము ముందుకు సాగునట్లు కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.