నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 9:6వ వచనము కనుగొనబడినది. ఆ వచనము, "ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను...'' ప్రకారం మనము క్రిస్మస్‌ను వేడుక చేసుకొనుచుండగా మరియు ప్రభువైన యేసు మన కొరకు ఈ లోకమునకు వచ్చినందుకై మనము ఆనందించుచుండగా, ఈ వాగ్దానము ఏమని చెబుతుందని చూచినట్లయితే, ఆయన మన నిమిత్తమై అనుగ్రహింపబడియున్నాడు. కనుకనే, "ప్రభువా, నీవు మా కొరకై వచ్చియున్నావు, నీవు మా కొరకు అనుగ్రహించబడియున్నావు, నీవు ఈ లోకములో మా నిమిత్తము జన్మించియున్నావు,'' అని మీరు చెబుతారా? నీవు మాకు అనుగ్రహింపబడియున్నావు. అవును, 'ప్రభువా, మేము నిన్ను అంగీకరించుచున్నాము. మా కొరకే ఈ లోకములో పుట్టావు, వందనములు' అని చెప్పండి. యేసు మన కొరకు పుట్టాడని తెలుసుకోవడం ఎంత గొప్ప సంతోషం కదా!

సాదారణంగా, ఒక చిన్న బిడ్డ, ఆట బొమ్మతో ప్రేమగా ఆడుకుంటుందని ఊహించుకోండి. అవును, ఎవరైన లేక ఇతరులు ఎవరైన ఆ యింటిలోనికి వచ్చి, వారు ఆ ఆట బొమ్మను తీసుకొన్నప్పుడు, వెంటనే ఆ చిన్న బిడ్డ ఇది నా ఆట బొమ్మ అని అంటుంది కదా. మా అమ్మ నాకు ఈ బొమ్మను తీసి ఇచ్చారు అని అంటుంది కదా. అవును, ఈ రోజు కూడా యేసు మాకు చెందినవాడు అని చెబుతాము కదా! దేవుడు మా కొరకు ఆయనను అనుగ్రహించియున్నాడని చెప్పండి. అయినప్పటికిని, యేసు ఏమని సెలవిచ్చుచున్నాడనగా, "మీరు నన్ను స్వీకరించినట్లుగానే, మీరు ఇతరులకు నన్ను ఇవ్వాలి.'' మీరు ఎవరిని అందించాలో తెలుసా? మీరు యేసును అంగీకరించారు. అయినప్పటికిని, మనం యేసును స్వీకరించినట్లుగానే, ఆయనను ఇతరులతో పంచుకోమని కూడా మనలను పిలుచుచున్నాడు.

బైబిల్‌లో 1 తిమోతి 3:16వ వచనములో ఏమి చెప్పబడియున్నదో చూడండి, "నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై యున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.'' అవును, దేవుడు శరీరధారుడై ఈ లోకమునకు దిగివచ్చాడు. యేసు క్రీస్తు శరీరముతో మీ యొద్దకు దేవుడుగా దిగి వచ్చియున్నాడని సంగతిని విశ్వసించండి. ఆయన దేవుని కుమారునిగా మరియు మానవుని కుమారునిగా లోబడినప్పటికిని కూడా, ఆయన శరీరాకృతములో ఉన్న దేవునిగా మీరు గుర్తించాలి. ఆయనను దేవునిగా మీరు అంగీకరించండి. మీరు జీవమును కలిగి ఉండడాని కొరకే ఆయన జన్మించాడు. యేసు ఈ క్రిస్మస్ దినమున ఈ లోకములోనికి దిగివచ్చాడని కేవలం క్రిస్మస్‌ను ఆ రీతిగానే వేడుక జరుపుకొనకండి. 'యేసు మా కొరకు జన్మించాడు' అని ధైర్యంగా చెప్పండి. ఆయన మాకు అనుగ్రహించబడియున్నాడు. ఆయనను అంగీకరించియున్న వారికి దేవుని బిడ్డలుగా మార్చబడునట్లుగా ఆయన అధికారమును అనుగ్రహించుచున్నాడు. అందుకే యోహాను 1:12లో వాగ్దానము చేసినట్లుగానే, "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను'' ప్రకారం మీరు యేసును అంగీకరించినప్పుడు, మీరు దేవుని బిడ్డలు అవుతారు.

నేను ఒక చక్కటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుచున్నాను. టుటికోరిన్‌కు చెందిన సౌంద్ర పాండియన్ రెండేళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. అతడు తన యొక్క ఇద్దరు సోదరులతో పెరిగాడు. అతనికి ఇద్దరు అన్నదమ్ముళ్లు మాత్రమే, తన జీవితములో అతనికి బోధించుటకు గురువుల స్థానములో ఎవరు కూడ లేకపోవడంతో అతడు పాప జీవితంలో పడిపోయాడు. అతనికి 15 సంవత్సరముల ప్రాయం వచ్చినప్పటికిని, అతను అక్రమ మద్యం తయారు చేయుచుండెను. అందరితో కూడా పోట్లాడుచుండెను. అక్షరాల, అతడు నేరస్థుల ముఠాకు నాయకుడు ఉండెను. అంతమాత్రమే కాదు, అతడు పాపముతో నిండిపోయాడు. ఒకరోజు ఒక వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తమిళనాడు నుంచి కేరళ రాష్ట్రమునకు వెళ్లుచుండగా, ఆకస్మాత్తుగా అతని ముక్కు నుంచి రక్త కారుట మొదలైంది. వైద్యులైతే, నీవు 99 శాతము నీ రక్తమును కోల్పోయావని చెప్పారు. భయంకరముగా నీ యొక్క అవయవములు పాడైపోయాయి. నీ ప్రాణము ప్రమాదములో ఉన్నది. నీవు మరణమునకు చేరువుగా ఉన్నావు అని చెప్పారు.

కానీ, హాస్పిటల్ గదిలో అతడు మరణ పడక మీద ఉన్నప్పుడు, యేసు సిలువ మీద వ్రేలాడుచున్నట్లుగా అతడు ఒక దర్శనమును చూచాడు. యేసు అతనికి ప్రత్యక్షమయ్యాడు. యేసునందు అతనికి విశ్వాసము లేనప్పటికిని, అతడు యేసు పాదాల చెంత మొఱ్ఱపెట్టాడు. యేసు అతనితో మాట్లాడెను. 'కుమారుడా, భయపడకు, నేను నీ నిమిత్తము సిలువలో మరణించాను, నేను నీకు శాంతిని ఇస్తాను, నీవు ఇక పాపము చేయకు అని చెప్పాడు.' మహా అద్భుతంగా,ముక్కు వెంబడి రక్తము కారడం ఆగిపోయినది. అతని జీవితము సంపూర్ణంగా మార్చబడినది. ఆ తర్వాత, నేనును మరియు నా తండ్రిగారు అందించిన సందేశమును వినుటకు ప్రారంభించాడు. తద్వారా, యేసును వెంబడించడానికి ప్రారంభించాడు. అతడు సేవాపరిచర్య కొరకు పిలువబడ్డాడు. అతడు చదవలేడు, కేవలం కీర్తనలు 91వ అధ్యాయము మాత్రము ధ్యానిస్తూ ఉంటాడు. అతనికి వివాహమైనది, అతనికి పిల్లలు కూడా ఉన్నారు. అతని పిల్లలు చదువులలో ఎంతో ఉన్నతముగా ఎదుగుతున్నారు. ఇంకను అతడు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో భాగస్థుడయ్యాడు. ఈ రోజు అతడు ప్రతిచోట యేసు పిలుచుచున్నాడు పరిచర్యను గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఛానల్‌ని అతడు ఎప్పుడు వీక్షిస్తుంటాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా. ప్రభువు అతనికి తండ్రిగా ఉండుటకు అతని కొరకు ఆయన జన్మించాడు. అతడు ఒక శిశువుగా జన్మించినప్పటికిని, ఆయన అతనికి ఒక తండ్రిగా ఉన్నాడు. చూడండి, ఇది గొప్ప ధన్యత కదా.

అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువైన యేసు మీకు తండ్రిగా ఉండుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే, ఆయనతో చెప్పండి, " తండ్రీ, నా నిమిత్తము జన్మించావు, నీవు నా కొరకు అనుగ్రహింపబడియున్నావు, నిన్ను నేను నా తండ్రిగా అంగీకరించుచున్నాను'' అని చెప్పినప్పుడు, ఆయన మీలోనికి వచ్చి, మీ పాత జీవితాన్ని తొలగించి, ఈ క్రిస్మస్ దినములలో, ఆయన మీలో నూతనంగా జన్మిస్తాడు. మీకు ఈ క్రిస్మస్ ఆనందమును అనుగ్రహిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, మా కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితాలను నీ సిలువ చెంత మరుగుపరచి, మమ్మును నీ బిడ్డలవలె రూపాంతరపరచుము. దేవా, మాకు మరియు మా ప్రియులగు వారి జీవితాలలో ఉన్న ప్రతి దుర్‌వ్యసనములు ఇప్పుడే దూరపరచుము. దేవా, మేము నిత్యజీవం మరియు నిరీక్షణ పొందేందుకు యేసును మా స్వంత రక్షకునిగా మాకు అనుగ్రహించినందుకై మేము ఆనదించుచున్నాము. ప్రభువైన యేసు, మేము నిన్ను మా స్వంత రక్షకునిగా మరియు మా రాజుగాను అంగీకరించుచున్నాము. దేవా, ఇతరులకు నీ ప్రేమను చాటించుటకును మరియు నీ సత్యాన్ని ప్రతిబింబిస్తూ నీ బిడ్డగా జీవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ యొక్క రాజరికపు కుటుంబంలోనికి వారసులుగా మమ్మును పిలిచినందుకు మరియు నీ బిడ్డగా మారడానికి మాకు నీ కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవా, మా జీవితం నీ కృపకు సాక్ష్యంగా మరియు నిన్ను తెలియని వారికి వెలుగుగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, ఇతరులతో మేము ధైర్యముగాను మరియు సంతోషముగాను నీ పుట్టుకను గూర్చిన సువర్తమానమును పంచుకొనుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మమ్మును మేము నీకు సంపూర్ణంగా సమర్పించుకొనుచున్నాము మరియు మా పట్ల నీకున్న శాశ్వతమైన ప్రేమకు చిహ్నంగా ఈ క్రిస్మస్‌ను జరుపుకొనుటకు సహాయము చేయుమని నజరేయుడైన యేసుక్రీస్తు సాటిలేని నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.