నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 147:13వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనములో, " ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు'' ప్రకారం ప్రభువు మీ గుమ్మముల గడియలను, మీ సరిహద్దులను బలపరుస్తాడు. అందులో నివసించువారందరిని దీవిస్తాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, నేడు శత్రువు మీ కుటుంబము మీద దాడి చేయబోతుంది అని అనుకుంటున్నారా? కీడు మీ కుటుంబాన్ని తాకుతుందేమో అని అనుకుంటున్నారా? మీ కుటుంబాన్ని నశింపజేయడానికి ప్రజలు పన్నాగాలు పన్నుచున్నారని అనుకుంటున్నారా? కానీ, ప్రియులారా, ప్రభువు మీ యొక్క గుమ్మములను గడియలను బలపరుస్తాడు, మీ గృహము చుట్టు మరియు మీ కుటుంబము చుట్టు కంచె వేసి, మిమ్మును కాపాడుతాడు. మీ గృహములో నివసించువారిని ఆశీర్వదిస్తాడు.
బైబిల్‌లో నిర్గమకాండము 12వ అధ్యాయములో ఈ సత్యాన్ని చక్కగా చిత్రీకరించడాన్ని మనము చూడగలము. ఇశ్రాయేలీయులందరు మేక పిల్ల రక్తముతో వారి గుమ్మముల కమ్ములను ముద్రించుకోవాలని ప్రభువు వారికి ఆజ్ఞాపించాడని వ్రాయబడియున్నది, "మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను'' అని ప్రభువు ఆజ్ఞాపించాడు. దేవుని ప్రజలుగా వారికున్న గుర్తింపు అది. ఆ విధంగానే, శత్రువు సంహరించడానికి వచ్చిన దూత నుండి వారు రక్షింపబడతారు. ఇశ్రాయేలీయుల వారి గుమ్మముల కమ్ములను రక్తముతో ముద్రించారు. సంహారకుడు వచ్చినప్పుడు, వారు రక్షింపబడ్డారు, వారు భద్రముగా ఉన్నారు, గృహములోపల ఉన్నటువంటి వారందరు కూడా రక్షింపబడ్డారు. ఇంకను వారందరు దీవించబడ్డారు. ఆలాగుననే, నిర్గమకాండము 12:24వ వచనములో మనము చూచినట్లయితే, "కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను'' ప్రకారం మీరును మరియు మీ సంతానము దీవించబడతారు అని ప్రభువు అంటున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.
అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, మీ నుదిటి మీద ప్రభువు నామము లిఖించబడియున్నది. మీ గృహము పైన కూడ ప్రభువు నామము ఉన్నది. ప్రభువు మీ సరిహద్దులను ఈ రోజు బలపరుస్తాడు. మిమ్మును ప్రతి కీడు నుండి కాపాడతాడు. యేసు రక్తము ద్వారా మీరు ముద్రింపబడియున్నారు కాబట్టి. అపవాది యొక్క ఏ ప్రణాళిక మిమ్మును తాకలేదు. సంహారకుడు కూడా మిమ్మును తాకలేదు. చెడు చేయాలని ఆలోచించే ప్రజల యొక్క ప్రణాళికలు వర్థిల్లవు. మీరు మరియు మీ కుటుంబము ఎంతో భద్రముగా ఉంటారు. మీరు సమృద్ధిగా దీవించబడతారు. ఈ రోజు ఈ వాగ్దానమును పొందుకుంటూ, ఈ వాగ్దానమునకై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదాము. ఎందుకంటే, దేవుడు మీ ఆశ్రయం మరియు మీ దుర్గముగా ఉన్నాడు. కాబట్టి, నేడు ఈ వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబమును భద్రముగా కాపాడి సంరక్షించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు,మా ఇంటిపై మరియు మా కుటుంబంపై నీ దైవిక కాపుదలను కోరుతూ మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువైన యేసయ్యా, మా గుమ్మముల గడియలను బలపరచుచున్నందుకై నీకు వేలాది వందనాలు. దేవా, మా గృహము చుట్టు అగ్ని కంచెను ఉంచి, మా కుటుంబాన్ని నీవు రక్షించుము. ప్రభువా, ఏ శత్రువు మా గృహములోనికి రాకుండా మమ్మును కాపాడుము. శత్రువులు ఎటువంటి ప్రణాళికలు మాకు విరోధముగా చేసినను, చేతబడులు చేసినప్పటికిని అవి వర్థిల్లకుండా చేయుము. ఇంకను దేవా, అవన్నియు మమ్మును తాకుండా, నశించుపోవునట్లుగా చేయుము. ప్రభువా, మా నుదుటి మీద నీ నామమును లిఖింపుము. దేవా, నీవు మాకిచ్చిన నామమును మేము కాపాడుకొనునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, ఈ రోజు, మా గృహముపై మరియు మా కుటుంబంపై నీ సమృద్ధికరమైన ఆశీర్వాదాలు కోరుకొనుచున్నాము. దేవా, నీ కృపతో మమ్మును కప్పి, నీ శాంతితో ఆవరించుము. ప్రభువా, ప్రతి దుష్ట ప్రణాళిక, ప్రతి మంత్రశక్తులు, మాపై వేయబడిన ప్రతి దాడిగానీ అది బ్రద్ధలై అవి నిష్ఫలమగునట్లుగా చేయుము. దేవా, మాకు విరోధముగా రూపింపబడు యే ఆయుధము వర్థిల్లకుండా చేయుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.