నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 103:5వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు'' ప్రకారం దేవుడు నేడు మేలుతో మీ హృదయమును తృప్తిపరచాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానము ఇది కదా! కాబట్టి, మీరు చింతించకండి.

నా ప్రియులారా, నేడు ప్రభువు మీ నోటిని మరియు మీ హృదయమును మేలుతో తృప్తిపరుస్తాడు. ఈ ఆశీర్వాదము ఎక్కడ నుండి వస్తుంది? కీర్తనలు 134:3వ వచనములో ప్రభువు ఈలాగున చెప్పుచున్నాడు, "భూమ్యాకాశ ములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక.'' మరియు కీర్తనలు 85:12వ వచనములో కూడా దీనినే పునరుద్ఘాటి స్తుంది, " యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును'' ప్రకారం, ప్రభువు ఎవరికి అలాంటి దీవెనలు ఇస్తాడు? సామెతలు 13:21వ వచనములో చూచినట్లయితే, "... నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును'' అని చెప్పబడియున్నది మరియు ఎజ్రా 8:22లో చూచినట్లయితే, "మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును...'' అన్న వచనం ప్రకారం దేవుని హస్తము మీకు ఎల్లప్పుడు మేలు కలుగజేయుటకు మీతో కూడా ఉండాలంటే, మీరు ఆయనను శ్రద్ధగా వెదకాలి మరియు ఆయనను ఆశ్రయించాలి. అవును, నా ప్రియులారా, ఈ రోజు మన జీవితాలను పరీక్షించుకుందాము మరియు మనం ప్రభువును ఎంతగా ఆశ్రయిస్తున్నామో? ఎంతగా వెదకుచున్నామో? మీరు ఉదయకాలమునే, ఆయనను ఆశ్రయిస్తూ వెదకుచున్నారా? ఒక్కసారి పరీక్షించుకోవడానికి కొంత సమయం వెచ్చిద్దాం. అవును, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. అందుకే అతడు ప్రభువుచేత అత్యధికంగా దీవించబడ్డాడు. కనుకనే, అతడు ఈలాగున చెప్పుచున్నాడు, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని అంటున్నాడు. బైబిల్‌లో కీర్తనలు 23వ అధ్యాయమంతటిలోను దేవుని యొక్క మంచితనం మరియు ఆయన యొక్క కృపను గురించి వర్ణించుచున్నాడు. ఎందుకంటే, అతడు దేవుని శ్రద్ధగా వెదికాడు కాబట్టి, అతడు తన జీవితంలో మంచి మేలులన్నిటిని పొందుకున్నాడు. ఆలాగుననే, నేడు మనము కూడ మన హృదయమంతటితోను ఆయనను వెదకుదాము. ఆయన మేలులను పొందుకుందాము.

నా ప్రియమైన స్నేహితులారా, కనుకనే, ప్రభువును మీరు మీ పూర్ణ హృదయముతో వెదకుదాము. ఎలాగునగా, ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం మరియు రాత్రి వేళలోను మరియు మీరు పడకకు వెళ్లడానికి ముందుగా మీ పూర్ణ హృదయముతో దేవుని వెదకినప్పుడు ఆయన మీ హృదయమును మేలులతో తృప్తిపరుస్తాడు. బైబిల్‌లో చూచినట్లయితే, యోహాను 11:40వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, " అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు...'' ప్రకారం, నమ్ముట మీ వలననైతే, మీరు ప్రభువు యొక్క కార్యములను మరియు ఆయన మహిమను చూచెదరు. కనుకనే మీరు ముందుకు కొనసాగిపోలేక పోవుచున్నామని మీకు అనిపించినప్పుడు, ఇంకను మీరు బలహీనతలలో ఉన్నప్పుడు, "ప్రభువా, నీవే మాకు బలము'' అని ఆయనకు మొరపెట్టమని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఇంకను, 'ప్రభువా, నీవే మా బలమని ప్రభువుతో ఒప్పుకొని,' మీరు ప్రభువు వైపు చూస్తున్నప్పుడు, ఆయన మీకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని మరియు జీవితంలో మీకు కావలసినవాటన్నిటిని మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, కీర్తనలు 92:15వ వచనములో చెప్పబడినట్లుగానే, "వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు'' అన్న వచనం ప్రకారం, దేవుడు మీ యొక్క ముసలితనమందు పచ్చగా ఉండునట్లుగా ఇప్పుడు, ప్రభువు నుండి మీరు సమస్త మేలులను పొందుకొనుటకు మనం ప్రార్థన చేద్దామా? ఆలాగుననే, నేడు మీరు ఆయనను వెదకండి, ఆశ్రయించినప్పుడు, నేటి వాగ్దానము ద్వారా ఆయన మిమ్మును మేలులతో తృప్తిపరచి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నీ వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మేము మా హృదయమంతటితో నిన్ను వెదకగలిగే కృపను మాకు దయచేయుము. ప్రభువా, ఉదయకాలముననే, మేము లేచి నిన్ను వెదకుటకు మాకు సహాయము దయచేయుము. ప్రభువా, దావీదు వలె మేము మా హృదయమంతటితో నిన్ను వెదకునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, ఇప్పుడే, నీ యొక్క ఆశీర్వాదములను అత్యధికంగా పొందుకొనునట్లు చేయుము. ప్రభువా, నీవు మా నోటిని మేలులతో నింపుము, మమ్మును నడిపించుము మరియు మాకు మంచి మార్గమును చూపుము. దేవా, నీ చిత్తానుసారంగా సమస్తమును మేము చేయునట్లుగా మాకు అటువంటి మంచి హృదయమును దయచేయుము. ఉదయాన్నే మరియు రోజంతా మా హృదయంతో నిన్ను వెదకడానికి మాకు కృపను దయచేయుము. దేవా, మేము నిన్ను మా జీవితంలో కేంద్రంగా ఉంచుకోవాలనియు మరియు మా జీవితంలోని అడుగడుగునా నీ సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ప్రభువా, నిన్ను శ్రద్ధగా వెదకడానికి మరియు ప్రతి దినము నీకు సమీపముగా ఉండడానికి దయచేసి మాకు సహాయం చేయుము. దేవా, నీ దృష్టికి యెదుట మేము నీతిమంతులమగునట్లుగా నీ నీతిని మాకు ధరింపజేయుము. ప్రభువా, నీ మేలులను మరియు నీ కృపాక్షేమములు మమ్మును వెంబడించునట్లుగాను మరియు మాకు మంచి ఆరోగ్యం, బలం మరియు పై నుండి నీ యొక్క సమస్త ఆశీర్వాదాలతో మా జీవితాన్ని అలంకరించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.