నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీకు కాపుదలగా ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 91:4 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు'' ప్రకారం సర్వశక్తిమంతుడైన దేవుని రెక్కల క్రింద మీకు ఆశ్రయము కలదు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా, "యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును, ఆలాగుననే, నేను మిమ్మును రక్షిస్తాను, మీ మీద రెక్కలు చాపి ఎగురుచున్నాను. నేను మీకు రక్షణ కేడముగాను ఉంటాను. నేను మీ ఆత్మను, మీ ఆర్థిక పరిస్థితిని, మీ కుటుంబ జీవితాన్ని, మీ ఘనతను మరియు నేను మీకు ఇచ్చిన ప్రతిదానిని - మీ విద్య, మీ ఉద్యోగము, మీ వ్యాపారం, మీ పరిచర్య మరియు మీ సంబంధాలను కాపాడుతాను. వాటన్నింటిని నేను భద్రంగా కాపాడతాను. మీరు నా యెరూషలేము. నేను మీలో జీవించుచున్నాను మరియు నేను మీతో జీవించుచున్నాను. నేను మీకు కాపుదలగా ఉంటాను '' అని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, మీరు భయపడకండి.
ఇంకను నా ప్రియులారా, ఆయన మనకు హామీ ఇచ్చుచున్నాడు, "పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, తన పిల్లల కాపాడుతూ, వాటిని మోయుచున్నట్లుగానే, నేను కూడా మిమ్మును మోయుదును.'' అవును, కీడు సంభవించినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శత్రువు మీకు విరోధముగా లేచినప్పుడు, ప్రభువు, " నేను మిమ్మును ఆత్మలో ఉన్నత స్థానమునకు లేవనెత్తుతాను'' మీ పట్ల ఈలాగున వాగ్దానం చేయుచున్నాడు. ఇంకను ఆయనతో మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రభువు మిమ్మును ఉన్నత ఎత్తునకు ఎదుగునట్లు చేస్తాడు. మీరు ప్రతి మానవాళి దాడి మరియు అపవాది ఒత్తిడిల నుండి పైకి లేవనెత్తబడినప్పుడు మీరు ఆయన సన్నిధిని అనుభవిస్తారు. ఆలాగుననే, 'యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు' అని వాగ్దానం చేసినట్లుగానే, మీరు పైకి ఎగురునట్లుగా ఆయన మీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆశీర్వాదాలు, గొప్ప అభివృద్ధి మిమ్మును హెచ్చింపజేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజు, నేను యేసు నామంలో మీ జీవితంలో ఈ ఆశీర్వాదాలను ప్రకటిస్తున్నాను. మీ ఆశీర్వాదాలకు ఆటంకం కలిగించే ప్రతి మూయవేయబడిన ద్వారములన్నియు యేసు నామంలో తెరవాలని నేను ఆజ్ఞాపించుచున్నాను. ఆయన ఆత్మ శక్తితో మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. యేసు నామంలో, ఆమేన్.
ఆలాగుననే, ఇక్కడ ఒక చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. నిరంజని కుజూర్ అటవీ శాఖలో పనిచేస్తున్న డిగంబర్ టర్కీని వివాహం చేసుకొనెను. వివాహమైన తర్వాత, నిరంజని లెక్కలేన్నని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనెను. తనకు ఎన్నో వైద్య సేవలందించినప్పటికిని, తాను స్వస్థత పొందలేకపోయెను. ఐదేళ్లపాటు సంతానం లేని బాధను, అవమానాన్ని, దుఃఖాన్ని భరించారు. తద్వారా, వారు దేవుని నడిపింపును కోరుతూ ఢిల్లీలో నిర్వహించబడిన యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మ సదస్సునకు పాల్గొన్నారు. వారి కన్నీళ్లకు చలించిపోయి, నేను వారిపై చేతులు ఉంచి ఒక బిడ్డ కొరకు ఎంతో ప్రార్థించా ను. అప్పుడు వారి హృదయాలలో సమాధానము నింపబడినది మరియు వారు ఇంటికి తిరిగి వెళ్లారు. ఆమె ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి మరియు అదే సంవత్సరం, నిరంజని గర్భం ధరించినది. ఆమె ఒక చక్కటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది, ఇది దేవుని నుండి సంతోషకరమైన బహుమానము! సహోదరి నిరంజని కొరకు దేవుడు ఏమి జరిగించాడో, అదేవిధముగా ఆయన మీ కొరకు కూడా సమస్తమును చేయగలడు. కనుకనే, భయపడకండి, ప్రభువునందు ఆనందముతో ఉండండి, ఆయన తన రెక్కలతో మిమ్మును కప్పుతాడు మరియు మీరు ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందుతారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఉన్నత స్థానమునకు ఎదుగునట్లు చేసి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందు మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీవే మా ఆశ్రయం మరియు రక్షకుడిగా, నీ రెక్కలతో మమ్మును కప్పి, నీ బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఇచ్చినందుకై నీకు వందనాలు. ప్రభువా, దయచేసి మా ఆత్మను, మా కుటుంబాన్ని, మా ఉద్యోగమును మరియు నీవు కృపతో మాకు దయచేసిన ప్రతి ఆశీర్వాదాన్ని భద్రంగా కాపాడుము. దేవా, నీవు నీ రెక్కలు చాచి, నీ రెక్కల మీద మమ్మును మోయుము, మా విరోధియైన అపవాది యొక్క ప్రతి శోధన, శ్రమలు మరియు దాడి కంటే మమ్మును పైకి లేవనెత్తుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును అభిషేకించుము మరియు నీతో లోతైన ఆధ్యాత్మిక నడకలో మా అనుదిన జీవితములో మమ్మును నడిపించుము. యేసయ్యా, మా జీవితములో మూసివేయబడిన ప్రతి ద్వారములను నీవు మార్గము గనుకనే, నీవు తెరుస్తావనియు మరియు నీ యొక్క పరిపూర్ణ సమయంలో మేము ఎదురుచూస్తున్న మా ఆశీర్వాదాలను విడుదల చేయగలవని మేము విశ్వసించుచున్నాము. దేవా, నీ సన్నిధి చేత మా జీవితాన్ని నింపుము. ప్రభువా, ఈ లోకములో మేము శోధనలను జయించి, విజయం మరియు సమాధానముతో జీవించడానికి మాకు నీ యొక్క బలమును అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచున్నాము తండ్రీ, ఆమేన్.