నాకు అమూల్యమైన స్నేహితులారా, నేడు దేవుడు మిమ్మును బలపరచాలని మీ పట్ల కోరుచున్నాడు. ఒకవేళ, 'నాకు ఏమాత్రము బలము లేదు' అని మీరు చెబుతున్నారా? మీరు సొమ్మసిల్లి పోవుచుండగా, దేవుడు మీకు బలమును అనుగ్రహించువాడై యున్నాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. నేడు బలములేని మీరు, ఆయన యొద్దకు వచ్చి, ' ప్రభువా, నాకు ఏ మాత్రము బలము లేదు' అని చెప్పినప్పుడు, దేవుడు మీ యొక్క బలమును వృద్ధిపొందించుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా, బైబిల్ నుండి, యెషయా 40:29వ వచనమును మనము నేడు ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.'' కాబట్టి, మీరు బలహీనంగా ఉన్నారా? భావించినప్పుడు, ప్రభువు మీకు బలాన్ని ఇస్తాడు, మరియు మీకు అస్సలు శక్తి లేదని మీరు భావించినప్పుడు, ఆయన మీకు బలాన్ని అత్యధికంగా వృద్ధిపొందింపజేస్తాడు.

అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు మన బలహీనతలన్నిటిని తన మీద వేసుకున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. నేడు, మీ జీవితములో ఉన్న సమస్యలన్నిటిని బట్టి, మీరు మీ యొక్క బలమునంతటిని కోల్పోయి ఉన్నారా? అటువంటి మీకు యేసు క్రీస్తు బలమై యున్నాడు. దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు. ఆయన మన యొక్క బలమై యున్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై యున్నాడు. కనుకనే, మీరు సొమ్మసిల్లిపోవుచుండగా, ఆయన మీకు శక్తిని అనుగ్రహించి, ఆయన మిమ్మును పైకి లేవనెత్తునట్లుగా చేస్తాడు. కనుక ధైర్యము తెచ్చుకొనండి.

వడివు అను ఒక సహోదరి తన సాక్ష్యమును ఈ విధంగా పంచుకున్నారు. ఆమెకు యేసును గురించి ఏ మాత్రము కూడ తెలియదు. తన సహోదరికి 18 సంవత్సరాల వయస్సులో వివాహము జరిగినది. కానీ, ఈమెకు మాత్రము 26 సంవత్సరముల వయస్సు వచ్చి, ఇంకా వివాహము జరుగలేదు. అందరు కూడ నీకు ఇక ఎన్నటికిని వివాహము జరగదు అని చెప్పారు. అప్పటికే వివాహము జరిగించబడిన ఒక వ్యక్తి ఆమెను రెండవ వివాహము చేసుకొనుటకు ఈమెకు వివాహ సంబంధముగా వచ్చారు. ఆమె తల్లిగారు కూడ తనను రెండవ వివాహము చేసుకోమని చెప్పారు. మనకు డబ్బు లేదు. కనుకనే, రెండవ వివాహము చేసుకోమని చెప్పారు. ఆలాగుననే, ఆమె బంధువులు కూడ వచ్చి, వారమేన్నారంటే, నీకు వయస్సు ఎక్కువగా ఉన్నందున అటువంటి వారే తనను పెళ్లి చేసుకొనుటకు వస్తారని చెప్పారు. ఆ మాటలు విన్న ఆమె హృదయము బ్రద్ధలైపోయినది. ఎవరు కూడ అక్కడ లేనప్పుడు, ఆమె ఫ్యాన్‌కి ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని తలంచెను. ఎంతగానో ఆమె గుండె బ్రద్ధలైపోయినది. కానీ, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చనిపోకుండా ఆపారు. అప్పుడు మా తల్లిదండ్రులు ఆ వివాహమును కూడా ఆపివేసారు. అటువంటి సమయములోనే, యేసు పిలుచుచున్నాడు మాస పత్రికను ఒకరు ఆమెకు ఇచ్చారు. ఆమె ఆ పత్రికను చదువుచుండగా, గొప్ప సమాధానము మాలోనికి వచ్చినది. యేసు మీద మాకు నమ్మిక కలిగింది. ఆమె డాక్టర్. పాల్ దినకరన్‌గారికి ఒక ఉత్తరము వ్రాశాను. ఆయన యొద్ద నుండి జవాబు రానే వచ్చినది. ఆ జవాబు ఏమనగా, 'నీవు యేసునందు నిరీక్షణ ఉంచియున్నావు. గనుకనే, దేవుడు ఆమె జీవితములో మేలు జరిగిస్తాడు అని వ్రాసి పంపించారు.' అటువంటి సమయములోనే ఆమె కుటుంబ సభ్యులైన బంధువుల వివాహమునకు ఆమె వెళ్లడము జరిగింది. ఆమె తండ్రిగారి స్నేహితుడు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని వారికి పరిచయం చేస్తామని చెప్పాడు. ఆలాగుననే, ఒక్క వారము రోజులలోనే ఆమె వివాహము నిర్ణయించబడినది. అంతా చక్కగా జరిగింది. ఇది తనకు ఎంతో గొప్ప ఆనందమును నిచ్చినది. ఆ తర్వాత ఆమె గర్భము ధరించడము జరిగింది.

అయితే, ఆమె తన సహోదరి చూచినప్పుడు, 5 సంవత్సరాల తర్వాత కూడా ఆమె గర్భము ధరించలేకపోయినది. ఆమె సహోదరికి బిడ్డలు ఇంకా కలుగకుండా, తనకు మాత్రము పిల్లలు పుట్టినట్లయితే బాగుండదని, ఆమె తనలో తలంచుకొని, గర్భ విచ్ఛిన్నం చేసుకొనుటకు మందులు వాడారు. కానీ, ఆ మందులు ఏవియు కూడా పని ఆమెలో చేయలేదు. ఆమెను హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లారు. డాక్టర్లు ఆలాగున చేయకూడదని చెప్పారు. ఆలాగున మందులు వాడినట్లయితే, అంగవైకల్యముతో బిడ్డలు పుడతారని వైద్యులు చెప్పారు. వెంటనే ఆమె పశ్చాత్తాపపడినది. వెంటనే ఆమె యేసునకు మొఱ్ఱపెట్టినది, 'ప్రభువా, నీవు మంచి వరములను అనుగ్రహించే దేవుడవు. కనుకనే, ఆమె మంచి బిడ్డను ప్రసవించాలని ప్రార్థించినది. ఆలాగుననే, దేవుడు ఆమెకు ఒక బిడ్డను ప్రసవించే శక్తిని మరియు బలమును అనుగ్రహించాడు. ఈ రోజు ఆమెకు ఒక చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించియున్నాడు. దేవుడు ఆమె జీవితాన్ని మరల కట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ స్నేహితులారా, ప్రభువు నిశ్చయముగా మీకు శక్తిని మరియు బలమును అనుగ్రహించును. అంతమాత్రమే కాదు, బలహీనులమైన మీ బలమును వృద్ధిపొందింపజేస్తాడు. ఆయన ఆశీర్వాదములను సంపూర్ణంగా అనుగ్రహించునట్లు చేసి, సొమ్మసిల్లిన మీకు దేవుడు బలమిచ్చి, ఆయనే శక్తిహీనులైన మీకు బలాభివృద్ధి కలుగజేసి, మిమ్మును వర్థిల్లజేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహా ఘనుడవైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, సొమ్మసిల్లిన మా జీవితాలలో బలమును అనుగ్రహించి, మమ్మును బలవంతులనుగా చేస్తావని మా పట్ల వాగ్దానము చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, బలహీనులకు మరియు శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడవు గనుకనే, నీవు మాకు నీ శక్తిని మరియు బలమును అనుగ్రహించుము. దేవా, నీవు ఆంతర్యము లోపల నుండి బలపరచి, మరల పైకి లేవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును బలహీనపరిచే ప్రతి దుఃఖాన్ని, ఆటంకములను మరియు అనారోగ్యాన్ని నీ శక్తివంతమైన నామంలో తొలగించుము. తద్వారా, వచ్చే మా బలహీనతలను తొలగించి, మమ్మును బలవంతులనుగా చేయుము. తండ్రీ, ఇట్టి కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా బలహీనతలను సిలువపై భరించినందుకు వందనాలు, తద్వారా మేము నీ బలం మరియు విజయంలో నడవగలుగునట్లు మమ్మును చేసినందుకై నీకు కృతజ్ఞతలు. దేవా, మేము నీ సన్నిధిలో నిరీక్షిస్తున్నప్పుడు, నీవు మా బలాన్ని పునరుద్ధరిస్తావని మరియు మమ్మును పక్షిరాజు వలె రెక్కల చాపి, పైకి ఎగురునట్లు చేస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, సుఖప్రసవము కొరకు చూచుచున్న మాకు సుఖప్రసవమును దయచేయుము. ప్రభువా, ఎంతో కాలము నుండి వివాహము కొరకు ఎదురు చూస్తున్నాము. తగిన కాలమందు మాకు అనుకూల జీవిత భాగస్వాములను అనుగ్రహించుము. దేవా, మేము సొమ్మసిల్లకుండా, శక్తిహీనులు కాకుండా, బలహీనులు కాకుండా ఉండునట్లుగా మాకు యెహోవా, నీవే మాకు బలంగా ఉంటూ మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.