నా ప్రియులారా, మీరు, 'నా జీవితములో అంతా మూసివేయబడియున్నదని' అంటున్నారా? నా వ్యాపారము వర్థిల్లడము లేదు, నా ఉద్యోగములో నేను సరిగ్గా పని చేయలేకపోవున్నాను, నేను పదోన్నతిని పొందుకొనలేకపోవుచున్నాను, జీవితములో పైకి రాలేకపోతున్నాను, నన్ను నేను పోషించుకోవడానికి సరిపోవునంత నిధులు నా యొద్ద లేవు, నా జీవితములో ప్రేమ ఆధారణ అనేది లేదు. నేను ఎక్కడ చూచినను, ఎక్కడకు వెళ్లినను, వైఫల్యము నాకు ఎదురు అవుతుంది అని అంటున్నారా? అయితే, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ యెదుట మూయబడిన తలుపులను నేడు తెరచుచున్నాడు. అది ఎవ్వరును మూయజాలరు. కనుకనే, భయపడకండి.

అటువంటి అనుభూతిని, అనుభవించినటువంటి ఒక వ్యక్తి ఉండెను. ఆమె పేరు హెస్పిబా మరియు తన భర్త పేరు బాలన్. అతడు ఎల్ఇడి టి.వి.లను సర్వీస్ చేయుచున్న ఒక వ్యాపారాన్ని తన భర్త చేయుచుండెను. ఆమె తన ఇంటి వద్దనే కుట్టు పని చేయుచుండెను. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కలరు. ఒకానొక సమయములో తన భర్త యొక్క వ్యాపారములో సరిగ్గా ముందుకు సాగలేకపోయాడు. ఆర్థికంగా వారు ఎంతగానో ఇబ్బందులు పడుచున్నారు. వారి యొక్క రోజువారి ఖర్చులకు కూడ సరిపడని నిధులు వారి యొద్ద లేకుండా ఉండెను. వారి పిల్లలకు స్కూల్ ఫీజు కూడ కట్టలేకపోయారు. అంతమాత్రమే కాదు, వారు ఎంతో పేదరికములో జీవించారు.

అటువంటి సందర్భములో వారు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు వచ్చారు. వారు, 'వ్యాపార ఆశీర్వాద కూటములో' పాల్గొన్నారు. వారి వ్యాపారము వర్థిలాల్లని ప్రార్థించారు. అనంతరము ప్రార్థనా గోపురములో నిర్వహించబడుచున్న భాగస్థుల శిక్షణా కార్యక్రమమును గూర్చి విన్నారు. ఆ శిక్షణలో, ఎలా ప్రార్థించాలి? దేవునికి ఎలా సమీపంగా మారాలి? ఇతరులకు ఎలా ప్రార్థించాలి మరియు వారికి ఎలా సేవ చేయాలని నేర్చుకున్నారు. జెసి హౌస్ ప్రార్థనా గోపురములో స్వచ్ఛందముగా వచ్చి పని చేస్తూ, పరిచర్యకు ఎంతగానో సహాయపడ్డారు.

దానికి ప్రతిఫలముగా, ఆ తరువాత దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించడము మొదలు పెట్టారు. నా భర్తయైన బాలన్ వ్యాపారమును దేవుడు దీవించాడు. అది ఎంతగానో కుంటుబడిన స్థితిలో ఉన్నప్పటికిని, మెల్లగా మెల్లగా అది వర్థిల్లడము ప్రారంభించినది. మా ఆర్థిక పరిస్థితి మారడం ఆరంభమైనది. మా పిల్లలు కూడ ప్రార్థనా గోపురములోని యవ్వనస్థుల పరిచర్యలో కోయర్‌లో ఉంటూ దేవునికి పరిచర్య చేయుచున్నారు. ఇప్పుడు నా కుటుంబము ఎంతగానో వర్థిల్లుచున్నది. మా ఆర్థిక ఇబ్బందులన్నియు కూడ మాయమైపోయినవి. అవును నా ప్రియ స్నేహితులారా, వారి జీవితములోని తలుపులన్నియు మూయబడినవి. వారి వ్యాపారము విఫలమవుచుండెను. మరియు వారికి ఎటువంటి రాబడి లేదు. జీవితములో నిరీక్షణ అనేది లేదు. అయితే, దేవుని సేవ చేయడానికి వారు ముందుకు వచ్చినప్పుడు, దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. వారి ఆర్థికాలను దీవించాడు. వారి వ్యాపారాన్ని దీవించాడు. వారికి ఏ కొదువ లేకుండా వారి జీవితములో సమృద్ధిని దయచేసి, దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించాడు. వారి జీవితములో మూయబడిన తలుపులన్నియు దేవుటు తెరచాడు. దేవునికే మహిమ కలుగును గాక.

అవును నా స్నేహితులారా, అదేవిధముగా, మీరు దేవునికి సేవ చేయడం ప్రారంభించినప్పుడు, మీ సమయమును ఆయనకు ఇచ్చినప్పుడు, ఆయన నామములో ప్రజలకు సేవ చేసినప్పుడు, మీ జీవితములోని మూయబడిన ద్వారములన్నిటిని ఆయన తెరుస్తాడు. ఏ మానవుడు కూడ దానిని మూయజాలడు. మీ జీవితములో మూయబడిన ద్వారములన్నిటిని ఆయన తెరుస్తాడు. నేడు ఆయనను సేవించడానికి ఒక తీర్మాణము చేసుకొనండి, ఈ రోజు మనం ఆయనను సేవించడానికి సమర్పించుకొని ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మీ జీవితములో కూడ మూయబడిన ద్వారములన్నిటిని దేవుడు తెరుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవిస్తాడు.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు యెదుట తెరిచిన తలుపులను ఏర్పాటు చేశావని మాకు వాగ్దానం చేసినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీతో సమయమును గడుపుటకు మేము నేడు తీర్మాణము చేయుచున్నాము. యేసయ్యా, నీ నామమున ప్రజలకు సేవచేయడానికి మరియు ప్రజలను ప్రేమించి, ఆదరించి, వారికి ప్రార్థన చేయడాని కొరకై మరియు వారి పట్ల శ్రద్ధ వహించడానికి మమ్మును మేము నీ సేవ కొరకు సమర్పించుకొనుచున్నాము. కనుకనే, ప్రభువా మా జీవితములో మూయబడిన ద్వారములన్నిటిని తెరచి, మా జీవితాలను వర్థిల్లునట్లు చేయుము. దేవా, మా వ్యాపారములోను మరియు మా కుటుంబ జీవితములోను, ఉద్యోగములోను, చదువులలోను, మేము అభివృద్ధి పొందునట్లు చేయుము. దేవా, మేము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు చేయుము. దేవా, తద్వారా మా కుటుంబాన్ని మరియు మేము కలిగియున్న సమస్తమును ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.