నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 6:14 వ వచనము మీకు తెలియజేయుచున్నది, "మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు'' ప్రకారము యేసు నామములో పాపమునకు మీ మీద ఇక ఆధిపత్యము ఉండదు. మీరు విడుదల పొందుకున్నవారుగా ఉంటారు.

పూనె నుండి నిషా అను ఒక సహోదరి చక్కటి సాక్ష్యమును పంచుకొనియున్నారు. 2008వ సంవత్సరములో సొలొమోనుతో ఆమెకు వివాహమైనది. అతడు బ్యాంకులో సెక్యురిటీ గార్డ్‌గా పనిచేయుచున్నాడు. వారికి ఇద్దరు బిడ్డలు. అయితే, 3 సంవత్సరముల తర్వాత, మద్యపానమును ప్రారంభించాడు. గంజాయి, ధూమపానము, మత్తుపానీయ వ్యసనములకు లోనయ్యాడు. అతని ఆదాయమంతయు వ్యసనములకు ఖర్చు అవుతుంది. కుటుంబాన్ని నడిపించడానికి ధనము ఉండుట లేదు. వారు ఇంటి అద్దె కూడా కట్టలేకపోవుచున్నారు. అనేక ఫర్యాయములు బిడ్డలతో కలిసి ఆకలితో ఉండిపోయారు. నిషా ఎప్పుడు కూడా బయటకు వెళ్లి పని చేయలేదు. అయితే, ఆమె బిడ్డల పోషణ కొరకై మరియు కుటుంబము కొరకై తానే స్వయంగా, ఉద్యోగము కొరకు వెదకుటకు ప్రయత్నించుచుండెను. ఏ ఉద్యోగము ఆమెకు దొరకలేదు. భర్త ఆమెను చాలా ఇబ్బంది పెట్టుచుండెను. తద్వారా, భారములు, విచారములు ఆమెలోనికి వచ్చాయి. భర్త వేధింపులు ఆమె దుఃఖాన్ని పెంచాయి మరియు ఆమెలో ఉన్న భారం భరించలేనంతగా ఉన్నదని భావించింది. ఇక ఆమెకు బ్రతకాలని అనిపించలేదు. కానీ, బిడ్డల కోసము ఆమె జీవించవలసి వచ్చినది, ఆ యొక్క బాధను సహించవలసి వచ్చినది.

అటువంటి సమయములో పూనెలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును గురించి ఎవరో ఒకరు ఆమెకు చెప్పారు. ఆమె ఆ ప్రార్థనా గోపురమునకు వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ప్రార్థనా యోధులు ఆమెను ఆహ్వానించారు. ఆమె కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు. ఆమె తన జీవితములో ఉన్న బాధనంతటిని వారితో చెప్పుకొనగా, వారు కొన్ని లేఖన భాగములను ఆమెకు ఎత్తి చూపించి, ఆమెను శక్తివంతురాలినిగా చేశారు. గొప్ప ఆనందం ఆమె హృదయాన్ని నింపినది. యేసు నా జీవితములో జరిగించే అద్భుత శక్తిని గురించి ఒకరోజు నేను సాక్ష్యమిస్తాను అని అనుకున్నది. ప్రభువు ఆమె కోసము ఆశీర్వాదములను అనుభవించడానికి తలుపులు తెరవజేసియున్నాడు. బాలికల పాఠశాలలో ఆమెకు ఉద్యోగము లభించినది. ఆమె తన కుటుంబాన్ని 'కుటుంబ ఆశీర్వాద పధకము'లోను, తన బిడ్డలను యౌవన భాగస్థుల పధకము'లోను భాగస్థులనుగా చేర్పించెను. తను పనిచేస్తున్న అదే స్కూలులో తన కుమార్తె మనోరమ్మకు ఉచితముగా విద్యను నేర్చుకోవడానికి అంగీకరించారు. ప్రత్యేకంగా, ప్రార్థనా యోధులు నిరంతరాయంగా ఆమెతో కలిసి తన భర్త కోసం ప్రార్థన చేయుచున్నారు.

ఒకరోజు ఆమె ప్రార్థనా గోపురములో ఉపవాస ప్రార్థనలో ప్రార్థనా యోధులతో కలసి ఆమె కూడా ప్రార్థించుచుండగా, బ్యాంకు ఎదురుగా సెక్యూరీటి గార్డ్‌గా పనిచేయుచున్న తన భర్తను దేవుడు తాకాడు. అతడు ఏడుస్తూ మరియు తన పాపములను ఒప్పుకుంటూ, ఇంటికి వచ్చాడు. ఏమని చెప్పాడనగా, " నేను దేవునికి విరోధముగాను మరియు నా భార్యవైన నీకు విరోధముగాను పాపము చేసియున్నాను. కనుకనే నన్ను క్షమించమని తన భార్యతో అన్నాడు.'' ఆమె ఈ మాట విని నిర్ఘాంతపోయినది. అంతమాత్రమే కాదు, ఆమె సంతోషముగా తన భర్తను క్షమించినది. ఇక ఎప్పుడు కూడా మద్యపానము సేవించను, నేను కూడా యేసునకు సేవ చేస్తాను అని తన భార్యతో చెప్పాడు. అంతటితో అతని మధ్యపానము అంతమైపోయినది. ఇక అతని యొక్క మధ్యపానము అగిపోయినది. ఇంకను అతడు బైబిల్ కళాశాలలో చేరాడు. వేదాంత విధ్యలో అతడు తర్ఫీదు పొందాడు. ఇప్పుడు అతడు ప్రభువునకు సేవ చేస్తున్నాడు. దేవుడు వారి దుఃఖాన్ని ఆనందగా మార్చివేశాడు.

నా ప్రియులారా, యేసు ద్వారా పొందియున్న దేవుని కృప క్రిందకు మీరు తీసుకొని రాబడి యున్నారు. కనుకనే పాపము ఇకమీదట మీ మీద ప్రభుత్వము చేయదు. నేడు పాపము నుండి మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. మీరు దేవుని వాక్యమును స్వంతం చేసుకొని, మీరు మీ జీవితమును లేఖనముల ప్రకారం జీవించినప్పుడు, వాక్యమై యున్న యేసు చేత మీరు నింపబడతారు. మీరు యేసుతో నడుస్తున్నారు గనుకనే ఈ రోజున అట్టి దేవుని కృప మీ మీదికి దిగివస్తుంది. కాబట్టి, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి. ఇకపై మీలో చెడు ఆలోచనలు ఉండవు, దురాత్మ సంబంధమైన అణచివేత, ఒత్తిడి ఇక మీలో ఉండదు. ఇట్టి ఒత్తిడి చేత మీలో కొంతమంది దురాత్మలకు మరియు దుర్‌వ్యసనములకు బానిసలగుచున్నారు. కాబట్టి, నేడు యేసు మీకు విడుదలను అనుగ్రహించుచున్నాడు. మీరు దేవుని వాక్యానికి లోబడి, లేఖనాల ప్రకారం జీవించినప్పుడు, మీరు సజీవ వాక్యమైన యేసుతో నింపబడతారు, ఆయనతో సన్నిహితంగా నడుస్తారు. నేడు, అదే దయ మీ మీదికి దిగివస్తుంది. యేసు మిమ్మును పాపము నుండి విడిపించుటకు ఆయనకు ప్రార్థన చేయండి, ఆయన మీకు జవాబును దయచేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము యేసు ద్వారా తీసుకొని రాబడిన నీ కృప క్రింద ఉన్నందున పాపం మా మీద ఆధిపత్యం వహించదని రోమీయులకు 6:14 వ వచనమును వాగ్దానం చేసినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీ నామమున పాపానికి మా జీవితంపై ఏలుబడి లేదని మేము నమ్ముచున్నాము మరియు మేము విడుదలను పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము నీకు లోబడి, నీ లేఖనాల ప్రకారం నడుచుకున్నప్పుడు నీ యొక్క జీవముగల మాటలతో మమ్మును నింపుము. దేవా, మా యొక్క ప్రతి చెడు ఆలోచనను మా నుండి తొలగించుము మరియు మా జీవితంలో దురాత్మల అణచివేత యొక్క ప్రతి సంకెళ్లను బ్రద్ధలు చేయుము. దేవా, నీ కృప ఈరోజు మా హృదయాన్ని నింపి మమ్మును సకల బంధకాల నుండి విడిపించి, మమ్మును స్వతంత్రులనుగా చేయుము. ప్రభువా, మమ్మును రక్షించే మరియు విడిపించే నీ శక్తిపై నమ్మకం ఉంచుటకు మేము నీకు మొరపెట్టుచున్నాము. ప్రభువా, ప్రతిరోజు నీ బలం మరియు ప్రేమ మీద ఆధారపడుతూ నీతో సన్నిహితంగా నడవడానికి మాకు సహాయం చేయుము. యేసయ్య, నీ కృప మా జీవితాలకు చాలినంతగా అనుగ్రహించుము. దేవా, నీ కృప ద్వారా నీవు మాకు అనుగ్రహించిన విడుదలను మరియు విజయానికై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా జీవితములో ఎన్నటికిని పాపము ప్రభుత్వము చేయకుండా, మమ్మును నీ కృప క్రింద దాచుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.