నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 10:22వ వచనమును నేడు మన నిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, " యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు'' అని ప్రభువు ఈలాగున మీకు సెలవిచ్చుచున్నాడు. అవును, దేవుని ఆశీర్వాదము నేడు మీకు ఐశ్వర్యమును తీసుకొనివస్తుంది. కనుకనే, చింతించకండి.
నా ప్రియులారా, ఆయన అబ్రాహాముతో ఈలాగు సెలవిచ్చాడు, ద్వితీయోపదేశకాండము 7:13 వ వచనములో దేవుడు అబ్రాహాముతో వాగ్దానము చేసియున్నాడు. " అబ్రాహామా, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును '' అని ఆయన వాగ్దానము చేసినట్లుగానే, ఆయన అబ్రాహామును ఆశీర్వాదించాలని కోరుకున్నాడు. ఇది దేవుని యొక్క హృదయమై యున్నది. మార్కు సువార్త 10:13-16లో చూచినట్లయితే, " తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయన యొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డ వలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.'' అవును, అది దేవుని యొక్క హృదయమై యున్నది.
బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 115:12- 14వ వచనములలో చూచినట్లయితే, "యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును'' ప్రకారం ఆయన మిమ్మును మరియు మీ పిల్లలను వృద్ధి పొందింపజేయును. యేసు నామములో ఐశ్వర్యము చేత ఆయన మిమ్మును ఆశీర్వదించును. మీ ఆనందమును నాశనమును చేయుటకు ఆయన ఎట్టి విచారమును కూడా అనుమతించడు. ఇది మీ నిమిత్తమైన దేవుని హృదయమై యున్నది.
నా ప్రియులారా, మీరు ఆయనకు భాగస్థులై ఉండియుండగా, మీరు మీ యొక్క అర్పణలను ఇతరుల యొక్క కన్నీటిని తుడిచి వేయడానికి సమర్పించుచున్నప్పుడు, ప్రభువు మిమ్మును ఐశ్వర్యవంతులనుగా చేయును. ఎందుకనగా, యేసు మీ కొరకు క్రయధనమును చెల్లించాడు. 2 కొరింథీయులకు 9:8లో మనము చూచినట్లయితే, " మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దార్రిద్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను '' ప్రకారం ఆయన పేదరికము ద్వారా మీరు ఐశ్వర్యవంతులు కావలెనని ఆయన ఎంతో బీదవాడుగా అయ్యాడు. కనుకనే, ప్రతిరోజు ఆయనకు వందనాలు చెప్పండి. " యేసయ్యా, నా పేదరికమును స్వయంగా నీ మీద వేసుకున్నందుకై నీకు వందనాలు. నీవు ఇప్పటికే మా పేదరికమును నీ మీద వేసుకున్నావు. ఇప్పుడు మమ్మును ఐశ్వర్యవంతులనుగా చేయుము. నీ కష్టము ద్వారా నీవు మా కొరకు సంపాదించిన ఆశీర్వాదాన్ని మేము అంగీకరించుచున్నాము'' అని మీరు ఇటువంటి ప్రార్థన చేయుచుండగా, యేసు మీకు పరిహారము చేసి, ఆయన తన ఐశ్వర్యమును మీకు అనుగ్రహించును. అయితే, మీరు ఆయనను ప్రేమించుచుండగా, ఆయన సేవా పరిచర్యకు ఇస్తుండగా, ఏ విచారము మిమ్మును తాకకుండా మరియు మీ చెంతకు రాకుండా దేవుడు మీ పట్ల జాగ్రత్త వహిస్తాడు. మీరు ఐశ్వర్యమును అనుభూతి చెంది ఆనందించెదరు. ఇట్టి కృప మీ మీదికి ఇప్పుడే దిగివచ్చును గాక.
కోయంబత్తూరు నుండి మేరీ క్రిష్టీనా ఒక సహోదరి తన సాక్ష్యమును మాతో పంచుకొనియున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె మరియు కుమారుడు. ఆమె భర్త తేయాకు సంస్థ (టి ఎస్టేట్)లో పనిచేయుచుండెను మరియు అతడు ఆయాసముతో ఎంతగానో బాధపడుచుండెను. తద్వారా పనిచేయలేకపోవుచున్నాడు. ఇంకను ఎటువంటి ఆదాయము లేదు. ఈమె అల్సరుతో బాధపడుచుండెను. సరిగ్గా ఆహారము తినలేకపోవుచుండెను. చాలా బలహీనమైయ్యారు. అదియుగాక, పనిచేయలేకపోవుచుండెను. అయితే, ఆ సమయములో యేసు పిలుచుచున్నాడు కూటమునకు ఆమె వచ్చినది. ప్రార్థనా సమయములో నేను ఈలాగున చెప్పాను, 'ఇప్పుడే యేసు నామములో ప్రతి బలహీనత మీ నుండి మరుగైపోతుంది. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి దిగివస్తుంది.' వెనువెంటనే పరిశుద్ధాత్మ ఆమె మీదికి దిగివచ్చినది. ఆమె శరీరములో ఉన్న ప్రతి బలహీనత అదృశ్యమైనది. ఆమె వేదిక మీదికి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఆ సమయములో ఆమె జీవితమును గురించి, ప్రవచనము చెప్పాను, ' దేవుడు మీ కుటుంబములో ఉన్న ఆర్థిక భారములన్నిటిని తొలగించి వేయుచున్నాడు' అని చెప్పాను.
ఆమె యొద్ద కొంత డబ్బు మాత్రమే ఉండెను. దానితోనే తన ఇద్దరు చిన్న బిడ్డలను యౌవన భాగస్థుల పధకములో సుభ్యులనుగా చేర్పించారు. మహా అద్భుతముగా, ఆమె తల్లి మరియు సహోదరి 'నీ కుమార్తె చదువులకు కావలసిన డబ్బును మేము చెల్లిస్తాము' అని చెప్పారు. ఆ తర్వాత ఆమె యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో అనేకులు భాగస్థులగునట్లుగా, ఇతరులను ప్రోత్సహించుటకు ఆమె యేసు పిలుచుచున్నాడు అంబాసిడర్‌గా అయ్యారు. ఆ తర్వాత, ఆమె యొద్ద పనిచేయుచున్నవారు, ' నీ కుమార్తె చదువులకు ఫీజులను మేము చెల్లిస్తాము అని చెప్పారు.' ఇప్పుడు ఆమె కుమార్తెకు వివాహమైనది, అమెరికా దేశములో స్థిరపడియున్నది. కుమారుడు కారుణ్య విశ్వవిద్యాలయంలో బి.కామ్., విద్యను పూర్తి చేసుకున్నాడు. అతడు ఇప్పుడు బైబిల్ కళాశాలలో ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించియున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును, ఆయన దానిని నరుల కష్టము చేత అది ఎక్కువకాకుండా చేస్తాడు మరియు దానితో కూడా ఏ విచారమును కూడ కలుపడు. విచారము లేని ఐశ్వర్యము. అవును, దేవుడు నేటి వాగ్దానము ద్వారా ఇట్టి ఆశీర్వాదముచేత మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము కృతజ్ఞతతో కూడిన హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము, నీ యొక్క ఆశీర్వాదం మరియు సమృద్ధి నిచ్చే వాగ్దానాలకు నీకు వందనాలు. దేవా, మేము ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను బట్టి మా పట్ల జాగ్రత్త వహించుము. మా బిడ్డల చదువుల పట్ల నీవే బాధ్యతను వహించుము. మా బిడ్డలు ఉన్నత స్థాయిలలో స్థిరపరచుము. మాకు స్వంత గృహమును దయచేయుము. యేసు నామమున ఈ ఆశీర్వాదములన్నిటిని మాకు దయచేయుము. దేవా, ఈ అమూల్యమైన వాగ్దానాన్ని మా జీవితాంతం స్థిరంగా ఉండునట్లుగా నీకృపను మాకు దయచేయుము. యేసయ్యా, మా పేదరికాన్ని నీవు మోసి, నీ త్యాగం ద్వారా సమృద్ధికి ద్వారము తెరిచినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదమునిచ్చే ఐశ్వర్యాన్ని మేము పొందుకొనునట్లుగాను, సంతోషాన్ని కలిగించే సంపదలు మరియు విచారము లేని ఐశ్వర్యమును మాకు నేడు అనుగ్రహించుము. దేవా, నీ ఆశీర్వాదం మాకు మరియు మా కుటుంబానికి అభివృద్ధిని కలిగించునట్లుగాను, తద్వారా మేము వర్ధిల్లునట్లుగా చేసి, మమ్మును ఇతరులకు ఆశీర్వాదంగా మార్చుము. ప్రభువా, మా సమర్పణలు మరియు నీ పరిచర్యకు భాగముగా మారునట్లుగాను, నీవు మా ప్రతి భారం మరియు దుఃఖం నుండి మమ్మును కాపాడతావని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు చిన్న పిల్లలను నీ యొద్దకు చేర్చుకున్నట్లుగా మమ్మును కౌగలించుకొని మరియు నీ ఆనందం మరియు సమాధానము మా జీవితంలో పొంగిపొర్లునట్లు చేయుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.