నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుట ద్వారా నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. దేవుడు ఈ రోజు కూడా మన గురించి జాగ్రత్త వహిస్తాడని అను మానసిక స్థైర్యమును మనము కలిగియుందాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 100:3 వ వచనమును ద్వారా మనము అట్టి మానసిక స్థైర్యమును కలిగియుందము. ఆ వచనము, "యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.'' అవును, స్నేహితులారా, ప్రభువు మన యొక్క దేవుడై ఉన్నాడని మనము తెలుసుకోవాలి. ఆయన అందరికిని దేవుడై యున్నాడు. అటువంటి శక్తిగలవాడై యున్నాడు. మనము ఆయన ప్రజలమని గుర్తించాలని ఈ వచనము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఆయన మనలను సృజించాడు, మనము ఆయనకు చెందినవారమై యున్నాము. ఈ లోకములో మనము ఆయనకు చెందినవారముగా కావచ్చును, ప్రభుత్వమునకు ఒక జనముగాను మనము చెందినవారముగా ఉండవచ్చును లేక మన ప్రియులకు మరియు ఒక తల్లిదండ్రులకు మనము చెందినవారమై యుండవచ్చును. కానీ, వీటన్నిటికంటెను మిన్నగా, మనము దేవునికి చెందినవారమై ఉన్నాము. ఆయన మిమ్మును ఎన్నటికిని విడువడు, ఆయన మిమ్మును చూచి, "మీరు నా ప్రజలు'' అని అంటున్నాడు. కనుకనే, మీరు ఆయనకు ప్రజలుగా ఉన్నప్పుడు ఆయన మిమ్మును సమస్త మేలులతో తృప్తిపరచి, ఆయన మిమ్మును నడిపించును. కనుకనే, మీరు చింతించకండి.
మనము ఆయన ప్రజలమై ఉండగా, ఆయన మనకు ఏమి చేస్తాడు? బైబిల్‌లో కీర్తనలు 91:1 వ వచనములో మనము చూచినట్లయితే, "మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు'' ప్రకారం ఆయన తన భద్రత క్రింద మరియు ఆయన నీడలో మనము దాచబడియున్నాము. కనుకనే, మన జీవితమును ఏదియు కూడా నాశనము చేయలేదు. వందనములు యేసయ్యా! ఇంకను కీర్తనలు 103:5వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు'' ప్రకారం మన జీవితమును మేలులతో తృప్తిపరచే దేవుడై యున్నాడు. ఆయనే మీకు స్వయంగా సరఫరా చేస్తాడు. మనకు అవసరమైనప్పుడెల్లను మన జీవితములో నిరంతరాయంగా సరఫరా చేయువాడై యున్నాడు. మనకు అవసరమైన ప్రతిదానికి ఆయనే ఆధారం మరియు అవసరతగా ఉన్న ప్రతి మీకు సమృద్ధిగా అందించడానికి ఆయనను విశ్వసించవచ్చును. "ప్రభువా, నీ సఫలీకృతమైన ఏర్పాటుకు కృతజ్ఞతలు'' అని చెప్పండి.
ఇంకను బైబిల్‌నందు మనము సామెతలు 3:6వ వచనములో చూచినట్లయితే, "నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును'' ప్రకారం అవును మనము దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు, ఆయన మన మార్గమును సరాళము చేస్తాడు. మన మార్గములు భద్రపరచబడి, దేవుని హస్తము ద్వారా చక్కటి మార్గములో నడిపించబడుచున్నాము. కనుకనే, మీరు భద్రపరచబడువాని యొక్క హస్తమును అనుభూతి చెందుతారు. సమస్తమును మీకు అనుగ్రహించేవాని యొక్క హస్తమును మరియు మిమ్మును నడిపించేవాని యొక్క హస్తము ద్వారా మీ జీవితము భద్రపరచబడియుంటుంది. మనము ఆయనను స్తుతించి, దేవుని యొద్ద నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుందామా? దేవుడు మీకు దేవునిగా మరియు నిరంతరాయంగా మిమ్మును నడిపించే దేవునిగా మీరు కలిగియుందురు గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మా సృష్టికర్త మరియు మా దేవుడని, నీవు మమ్మును సృష్టించినందుకు మరియు మమ్మును నీకు చెందినవారమని తెలియజేసినందుకై నిన్ను స్తుతించుచున్నాము. దేవా, నీవు మమ్మును ఎన్నటికి విడిచిపెట్టకుండా, నీ రెక్కల నీడలో మమ్మును సురక్షితంగా ఉంచినందుకు మరియు కీడు నుండి మమ్మును రక్షించుము. ప్రభువా, నీవు మా ప్రతి కోరికను మేలులతో సంతృప్తిపరచుము, మా అవసరాలను సమృద్ధిగా మరియు నిష్ఫలంగా అనుగ్రహించుము. దేవా, నీవు మా రక్షకుడవు, మా ప్రదాతవు, నీతి మరియు శాంతి మార్గాలలో మమ్మును నడిపించుము. ప్రభువా, నీవు మా అడుగులు వివేకంతో మరియు శ్రద్ధతో నడిపిస్తావని మేము గుర్తెరుగునట్లుగా మమ్మును మార్చుము. యేసయ్యా, నీ ప్రేమ మమ్మును ఆవరించునట్లుగాను, మరియు నీ ఆశీర్వాదాలు మా జీవితాన్ని ఆనందం మరియు భద్రతతో నింపునట్లు చేయుము. ప్రభువా, మమ్మును నీ సొత్తుగా మార్చుము మరియు మమ్మును నీ ప్రజలు అని ప్రకటించినందుకు నీకు వందనాలు. దేవా, నీ వాగ్దానాలలో ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండేందుకు మరియు నీ ఎడతెగని ప్రేమలో ఆనందించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.