హలో నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మిమ్మును సంధించడం నాకు ఎంతో సంతోషము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి విలాపవాక్యములు 3:25వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "తన్ను ఆశ్రయించువారి యెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారి యెడల ఆయన దయ చూపువాడు'' అన్న వచనము ప్రకారము, దీర్ఘకాలము నుండి మీరు ప్రభువు కొరకు కనిపెట్టుచున్నారా? మీ అద్భుతము కొరకు ఎంతో వేచియున్నారా? అటువంటి వారికి ఆయన దయచూపువాడై యున్నాడని వాగ్దానము చేయుచున్నాడు. ఈరోజే మీ జీవితములో ఆయన అద్భుతములను జరిగిస్తాడు మరియు ప్రార్థనలన్నిటికిని జవాబు అనుగ్రహిస్తాడు.
నా ప్రియులారా, ఈ రోజు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురము పరిచర్య యొక్క 41వ వార్షికోత్సవమును ఈ రోజు జరుపుకుంటున్నాము. మా ప్రార్థనా గోపురము పరిచర్య ద్వారా మీలో అనేకులు తాకబడియున్నారు కదా! భారత దేశ వ్యాప్తముగా ఉన్న 100కు పైగా ఉన్న ప్రార్థనా గోపురముల ద్వారా అనేకమంది ప్రార్థనా యోధుల ప్రజల కన్నీటిని తుడవడానికై ప్రార్థించుచున్నారు.
నా వ్యక్తిగత జీవితములో ప్రభావితము చూపిన ఒక సంఘటను నేను మీకు తెలియజేయుచున్నాను. నేను కళాశాల నుండి మా ఆంటీగారి గృహమునకు వెళ్లుతున్నాను. 6 గంటల తరువాత చీకటి సమయములో నేను ఇదివరకు ఎన్నడు వెళ్లని మార్గములో వెళ్లుచున్నాను. గూగుల్ మ్యాప్‌ని నమ్మి నేను ముందుకు వెళ్లుచున్నాను. ఆకస్మాత్తుగా నా ఫోన్‌లో ఒక శాతము మాత్రమే చార్జీంగ్ ఉండి, స్విచ్ఛ్ ఆఫ్ అయిపోయినది. అటుతర్వాత, నాకు ఏమి చేయాలో అర్థము కాలేదు. నేను ఎంతో భయపడి, 'ప్రభువా, నేను తప్పిపోయాను, ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు తెలియలేదు అని ప్రార్థించాను.' ఆ సమయములో వానాగరము రోడ్డు మీద ఇది జరిగినది. నేను ఆలాగున ఎడమ వైపున వెళ్లుచుండగా, ఆకస్మాత్తుగా యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును నేను చూశాను. వెంటనే, 'ప్రభువా, ఇది నా ప్రార్థనకు జవాబు కదా' అని నేను నా మనస్సులో అనుకున్నాను. ఇక నేను మా ఆంటీగారి గృహమునకు వెళ్లడము మర్చిపోయి, నేరుగా, ప్రార్థనా గోపురము ఛాపెల్ (ధ్యానగదిలోనికి) వెళ్లి, ప్రార్థన చేసుకుని, ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించాను. అవును అదేవిధముగా, అనేకమంది ప్రజలకు ప్రార్థనా గోపురము ఒక ఆశీర్వాదకరముగా ఉన్నది. టెలిఫోన్ ప్రార్థనా గోపురము ద్వారా మీలో అనేకుల ప్రార్థనలకు జవాబు వచ్చియున్నవి కదా. మన ప్రార్థనలు నెరవేరాయి మరియు మనము ప్రార్థనా గోపురమునకు కృతజ్ఞతలు తెలియజేయుదాము.
కనుకనే, నా ప్రియులారా, ఈరోజే మీ అందరి కన్నీటికి జవాబులు ఇస్తానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. బైబిల్‌లో సామెతలు 18:10 ప్రకారము, "యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.'' అవును, స్నేహితులారా, ప్రభువు యొద్ద నుండి మీ దీవెన కొరకు మీరు కనిపెడుతూ ఉండగా, ఒకవేళ, అది గర్భఫలము అను దీవెన కొరకు మీరు కనిపెడుతున్నారేమో? మీ బిడ్డ యొక్క చెడు ప్రవర్తన నుండి మారిపోవాలని కనిపెడుతున్నారేమో? ఇదే దినము స్నేహితులారా, మీ ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని ప్రభువు యొద్ద నుండి పొందుకొనండి. కాబట్టి, నా స్నేహితులారా, ఈ దినమే ప్రభువు మీ కన్నీటిని తుడిచివేసి, మిమ్మును ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసియున్నాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసూ, మేము నిరీక్షణ మరియు నమ్మకముతో నిండిన హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీ ఆదరించే సన్నిధానము మా కుటుంబాలను ఐక్యపరచునట్లు చేయుము. దేవా, నేడు నీ సన్నిధానము మా మీదికి దిగివచ్చునట్లు చేయుము. దేవా, మా కుటుంబములో సమాధానము, మా కన్నీటికి ఈ రోజు జవాబును దయచేయుము. ప్రభువా, మేము అద్భుతాలను పొందుకొనునట్లు చేసి, మా అప్పులన్నియు తీర్చబడునట్లు చేయుము. దేవా, మేము ఈ దినము నీ తాకిడి అనుభవించునట్లు చేయుము. యేసయ్యా, నీ కొరకు ఎదురుచూచుచూ, శ్రద్ధగా నిన్ను వెదకువారికి నీవు మంచివాడివని నీ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. దేవా, మా ప్రార్థనలు మరియు భవిష్యత్తు పట్ల, నీ అద్భుతమైన ప్రవచనం మరియు నడిపింపు కొరకు మేము అడుగుచున్నాము. దేవా, మేము ఎదురుచూస్తున్న ఆశీర్వాదాన్ని మరియు మా అత్యవసరాలకు జవాబులను దయచేయుము.ప్రభువా, ఇదివరకు మా కష్టకాలంలో నీ సన్నిధిని చూసినట్లుగానే, మా జీవితంలో నీ హస్తాన్ని గుర్తించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ ప్రార్థనా యోధులు ద్వారా నీవు అందించే సౌలభ్యం మరియు బలానికి కృతజ్ఞతలు చెల్లించుచు, ఈ రోజు, మేము నీ ఆశీర్వాదాన్ని పొందుకొనునట్లు చేసి మరియు భద్రత మరియు నెరవేర్పు యొక్క నీ వాగ్దానాన్ని నమ్ముచూ, యేసు ప్రభువు యొక్క ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.