నా ప్రియమైనవారలారా, నేడు మీరు యేసు పిలుచుచున్నాడు వెబ్‌సైట్‌ని సందర్శిస్తే లేదా మా క్యాలెండర్‌ని చూచినట్లయితే, మీరు ఈరోజు వాగ్దానాన్ని కనుగొనవచ్చును. ఈ వాగ్దాన వచనములను మా తల్లిగారు ప్రార్థనా పూర్వకంగా వ్రాసి యున్నారు మరియు 2 కొరింథీయులకు 1:22 ప్రకారం, నేడు దేవుడు మిమ్మును దీవించును గాక. ఆ వచనము, "ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.'' అవును, దేవుడు మన మీద తన ముద్రను వేసియున్నాడు మరియు మన హృదయాలలో తన ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడని చెప్పబడియున్నది. ఈ రోజు ఈ వాగ్దానమును బట్టి దేవుడు మిమ్మును ఆశీర్వదించును.
అవును, నా ప్రియులారా, ఆయన మనలను స్వంతం చేసుకొని ఉన్నాడని గుర్తుగా ఆయన మన మీద ముద్రవేసియున్నాడు. కనుకనే, మనము ఆయనకు చెందినవారము. శ్రేష్టమైన సమస్త మంచి యీవులను మనము ఆయన యొద్ద నుండియే పొందుకుంటాము. పరిశుద్ధాత్ముడు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడి, ఈ ముద్రకు ఆయన సంచకరువుగా ఉన్నాడు. ఆయన ముద్రవేయడము మాతమ్రే కాదు గానీ, తన స్వంత ఆత్మ ద్వారా మనకు సంచకరువుగా ఉండి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనలను నీతిలోనికి నడిపిస్తాడు. అపవాది తీసుకురావడము కొరకు ప్రయత్నించే ప్రతి దుష్టత్వము నుండి మనలను భద్రపరచును. మన మీద చేపట్టడానికి ప్రయత్నించే ప్రతి కీడు నుండి కూడ ఆయన మనలను తప్పించును. నా స్నేహితులారా, పాపపు మార్గము నుండి మనలను భద్రపరచును. కనుకనే, మీ స్వతహాగా మీ స్వంత జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించకండి. కొన్ని మంచి కార్యాలు చేసినట్లయితే, బాగుంటుంది, దేవుడు నాతో కూడ ఉంటాడని అనుకొనకండి. మా సంఘము కొరకు మరియు దేవుని కొరకు కొన్ని మంచి కార్యాలు చేసినట్లయితే, దేవుడు మాతో కూడ ఉంటాడని అనుకొనకండి. ఆలాగున కాదు, మన జీవితములో పాపాన్ని జయించడానికి పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమై యున్నాడు. మన జీవితములో నీతిగల దేవుని చిత్తాన్ని జరిగించడము ఆయన అవసరమై యున్నాడు. దేవుని యెదుట పవిత్రత గల జీవితాన్ని జీవించడానికి మరియు ఆయనే మనకు సహాయము చేయువాడు. ఆయన ఈ రోజు మీతో మాట్లాడడానికి కావలసిన కృపను అడగండి. అప్పుడు అన్ని పరిస్థితులలోను మిమ్మును నడిపించే ఆయన స్వరాన్ని మీరు వినగలుగుతారు.
దావీదును భద్రపరచినవాడు ఆయనే. దావీదు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తియై యున్నాడు. అతడు సౌలు అను రాజు ద్వారా తరుమబడ్డాడు. దావీదు యొక్క ప్రాణాన్ని తీసివేయవలెనని అనుకున్నాడు. అందువలన అతను అతనికి విశ్రాంతి ఇవ్వలేదు మరియు అతనిని ఒక చోటు నుండి మరొక ప్రదేశానికి వెంబడించుచూ, అతనిని తరుముచుండెను. కానీ ఒకసారి, సౌలు దావీదు చేతులలో అప్పగింపబడిన సమయములో, దావీదు గుహలో నిద్రపోతున్న సౌలును చూచినప్పుడు అతడు చాలా సులభంగా ప్రతీకారము తీసుకొనవచ్చును. సౌలుకు విరుద్ధముగా ఎంత ఆగ్రహము కలిగి ఉంటాడు కదా! ఎందుకంటే, తన జీవితాన్ని స్వతహాగా సౌలు నాశనము చేశాడు. తన శరీరమును విస్మరించి, దేవుని ఆత్మను ఆలకించి యున్నాడు. దేవుని అభిషిక్తుని నేను ఎలాగు తాకగలను? అని అనుకున్నాడు. సౌలు నీవు దేవుని ద్వారా రాజుగా అభిషేకించబడియున్నావు. నేను దానిని గౌరవిస్తాను అని చెప్పాడు. అవును, నా ప్రియులారా, పరిశుద్ధాత్ముడు సరియైన నిర్ణయము తీసుకొనునట్లుగా మనలను నడిపిస్తాడు. రాజైన సౌలు పాదముల మీద పడి, నిజముగా నీవు దేవుని చేత నియమించబడిన అభిషిక్తుడవు అని అన్నాడు. సౌలు దావీదును గౌరవించాడు. రాజుగా ఉండి తానే స్వయం గా గౌరవించాడు. నా స్నేహితులారా, మన సామాన్యమైన విధేయత, రాజుల కంటె మనలను ఔనత్యముగా లేవనెత్తును. నేడు మిమ్మును మీరు దేవుని యెదుట తగ్గించుకొని పవిత్రంగా జీవించడానికి నిధిగా ఎంపిక చేసుకొనండి. మనము నేడు ఈ కృపను అడుగుదామా? ఆలాగుననే, నేడు పరిశుద్ధాత్మ దేవుని కొరకు ముద్రవేయబడాలని మీ హృదయాలను దేవునికి సమర్పించినప్పుడు, ఆయన ఆత్మను సంచకరువును మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ పరిశుద్ధాత్మ కొరకై నీకు వందనాలు. దేవా, పరిశుద్ధాత్మ ద్వారా మేము పవిత్రంగా జీవించడానికి నీవే మాకు సంచకరువుగా ఉండుము. ప్రభువా, మేము పరిశుద్ధంగా జీవించడానికి నీవు మాకు నేర్పించుము. పరిశుద్ధాత్మ దేవా, నిన్ను మాలోనికి ఆహ్వానించుచున్నాము. దయచేసి మీ సన్నిధితో మమ్మును నింపుము మరియు నీ ద్వారా మేము నడిపించబడునట్లు చేయుము. ప్రభువా, మాలో నీ నివాసాన్ని ఏర్పరచి, పవిత్రత మరియు నీతివంతమైన జీవితాన్ని గడపడానికి మమ్మును మార్చుము. దేవా, మా హృదయంలో పాపాన్ని, అపవాది యొక్క స్వరాన్ని మరియు శరీరచ్ఛల స్వరాన్ని అధిగమించే శక్తిని మాకు దయచేయుము. దేవా, నీ నీతిని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయుము. తద్వారా మేము ప్రతిరోజు నీతో నడుస్తూ ఉండుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నీ విలువైన ముద్రకొరకై నీకు వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.