నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 16:8వ వచనము, చూచినట్లయితే, "సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను'' ప్రకారం ఎవరికైన పెద్ద అన్నయ్య ఉన్నట్లయితే గనుక తమ చెల్లెలు ఎక్కడికి వెళ్లినా, అన్నయ్య వారి వెంట వెళ్లుతూ ఉంటాడు. మా స్వంత పెద్ద అన్నయ్య సుందర్‌రాజ్, మేము ఎక్కడికి వెళ్లినా, మా వెంటనే వస్తాడు. మేమిద్దరము చెల్లెలము. ఒకరోజు మేము వెళ్లుచున్నప్పుడు, ఒక వ్యక్తి మమ్మును ఎగతాళి చేయడము మా అన్నయ్య వినియున్నాడు. వెంటనే ఆ యౌవనస్థుని మెడ పట్టుకొని, నా చెల్లెలకు వ్యతిరేకముగా నీవు ఆలాగున మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యము అని వానిని బెదిరించాడు. ఆ వ్యక్తి ఏమన్నాడో మేము వినలేదు కానీ, మా అన్నయ్యకు మా మీద ఉన్న ప్రేమ చేత ఆ వ్యక్తి ఏమి పలికాడో, వాటన్నిటిని వినియున్నాడు. అతడు మమ్మల్ని కాపాడాడు. మా అన్నయ్య మమ్మల్ని రక్షించాడు. మాకు వ్యతిరేకముగా మాట్లాడినవారు అక్కడి నుండి పారిపోయాడు.

అదేవిధముగా, నా ప్రియులారా, ఒక అన్నయ్య వలె మన ప్రభువు మీతో కూడా ఉంటాడు. మన కుడిపార్శ్వమున ఆయనను మనము కలిగి ఉండడము, ఆయనను మనము రక్షణగా కలిగి ఉండడమే. బైబిల్‌లో కీర్తనలు 109:31వ వచనములో చూచినట్లయితే, "దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు'' ప్రకారముగా, ప్రభువు మన ప్రక్కన ఉండగా, మనము ఎన్నడును కదల్చబడము. ప్రభువు మీకు దూరముగా లేనేలేడు. ఆయన మీకు అతి సమీపముగా ఉన్నాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 139:5 వ వచనములో, "వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు''ప్రకారముగా దేవుడు మన ముందు వెనుక మనలను చుట్టుముట్టడమే కాదు, మన మీద తన చేతిని ఉంచియున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

అయితే, నా ప్రియులారా, మన ప్రభువును మన కుడి ప్రక్కన కలిగి ఉండాలంటే, మనము ఏమి చేయవలెను? ప్రార్థన చేయడము, ప్రభువు వాక్యమును చదవడము, ప్రభువును స్తుతించడము వంటి అలవాట్లను మనము కలిగి ఉండాలి. మనము ఆ విధంగా చేసినప్పుడు, ప్రభువు మన కుడి ప్రక్కన ఉండి, మన పక్షమున నిలిచి ఉంటాడు. "నా కనుదృష్టి ఎల్లప్పుడు ప్రభువు యందు ఉంచియున్నాను'' అని లేఖనము సెలవిచ్చుచున్నది. ఈ విధంగా మీరు మీ దృష్టిని ప్రభువు మీద ఎల్లప్పుడు ఉంచగలుగుతారు. అంతమాత్రమే కాదు, మీరు ఎల్లప్పుడు ప్రార్థన వైఖరిని కలిగి ఉంటారు. ఎల్లప్పుడు దేవుని వాక్యమును మీ హృదయములో కలిగి ఉంటారు. నిరంతరము ప్రభువును స్తుతిస్తారు. "నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును'' అని దావీదు పలికెను.

నా ప్రియ స్నేహితులారా, ప్రభువును విడిచి దూరముగా వెళ్లకండి. ఒక్క క్షణమైన ప్రభువును వీడకండి. ప్రభువు మీతో ఉండగా, మీకు విరోధిగా ఎవడు నిలువగలడు. ఎల్లప్పుడును ప్రభువును మీ కన్నుల యెదుట కలిగి ఉండండి. మీ కుడి పక్షమున, మీ యెదుట, మీ వెనుకాల, ప్రభువు కృపను మీ పట్ల ఆవరించును గాక. ప్రభువును ప్రేమించండి, ఆయన వాక్యమును ప్రేమించండి. ఎందుకంటే, ప్రభువు మార్గములు ఎల్లప్పుడు క్షేమమును మరియు సంతోషములును కలిగియున్నవి. కనుకనే, మీ హృదయములోను మరియు మీ మనస్సులోను, మీ యింటిలోను, మీ పనిలోను ప్రభువు మీ ప్రక్కన నిలిచి ఉండును గాక. మీ జీవితములోని ప్రతి భాగములో ప్రభువు ఉండును గాక. ప్రభువు తన బలమును మీకు ఊపిరిగా ఊదును గాక. ఎల్లప్పుడును ప్రభువును మీ యెదుట కలిగి ఉండడానికి ఒక నిర్ణయాన్ని తీసుకొనండి. అప్పుడు ఆయన నిత్యము మీ కుడి ప్రక్కన ఉండి, మిమ్మును బలపరుస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఎల్లప్పుడు మాతోను మరియు మా కుడి ప్రక్కన ఉండుము. ప్రభువా, మా కుడి ప్రక్కన ఉండి మమ్మును రక్షించుము. దేవా, మాకు వ్యతిరేకముగా వచ్చువారు మరియు మా చుట్టు ఉన్నవారు దేవుని భయమును కలిగి ఉండునట్లు చేయుము. యేసయ్యా, నిజముగా మమ్మును నీవు ప్రేమించుచున్నావని మేము మరియు ఇతరులు గుర్తించునట్లు చేయుము. ప్రభువా, నీ సన్నిధానముతోను మరియు అభిషేకముతోను మమ్మును నింపుము. దేవా, మా వెనుకను ముందును మమ్మును ఆవరించి, నీ బలమైన హస్తమును మాతో ఉంచుము. ప్రభువా, ఒక అన్నయ్య వలె నీవు మాతో ఉండి, ప్రతి కీడు మరియు అపాయము నుండి మమ్మును కాపాడుము. యేసయ్య, ఆ సిలువలో నీవు చేసిన త్యాగమును మేము మరచిపోకుండా, నీ సన్నిధి మమ్మును విడిచి పెట్టి వెళ్లిపోకుండా, ఎల్లప్పుడు మాతో నిలిచియుండునట్లు చేయుము. దేవా, మునుపటి కంటె అతి సమీపముగా మాకు తోడై యుండుము. ప్రభువా, నేటి నుండి నీ సన్నిధిని మేము అతి సమీపముగా అనుభవించునట్లు చేయుము. దేవా, నిన్ను ప్రేమించడానికి మాకు అటువంటి హృదయమును దయచేయుము. ఇంకను నీ వాక్యమును చదవడానికి, నిన్ను స్తుతించడానికిని, మా దృష్టిని ఎల్లప్పుడూ నీపైనే ఉంచడానికి మాకు సహాయం చేయుము. దేవా, ప్రార్థనలో దృఢంగా నిలిచి ఉండేందుకు, నీ వాక్యాన్ని ఘనపరచడానికి మరియు నిరంతరం నీకు స్తుతులు చెల్లించడానికి మా హృదయాన్ని బలపరచుము. ప్రభువా, నీ దయతో మమ్మును చుట్టుముట్టండి మరియు మేము వేయుచున్న ప్రతి అడుగులో మమ్మును నడిపించి, నీ ప్రేమ మరియు శాంతితో మా హృదయాన్ని, మా మనస్సును మరియు మా ఇంటిని మరియు మా పనిని నింపుము. దేవా, నీ బలం మా జీవితంలోని ప్రతి భాగానికి ప్రాణం పోసి, మమ్మును సజీవంగా నడిపించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.