నా అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 1:8వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.'' అవును, పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు, సర్వశక్తుడైన దేవుని శక్తి మీలోనికి వస్తుంది. ఇది కన్యయైన మరియ మీదికి దిగివచ్చిన శక్తి. పరిశుద్ధాత్ముడు ఆమె మీదికి వచ్చినప్పుడు, ఆమె గర్భము ధరించెను. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భములో ఒక బిడ్డ రూపింపబడెను. ఆమె గర్భములో ఉండియున్న బిడ్డ స్వయంగా దేవుడే. నేడు అటువంటి శక్తిని మీరు కూడా పొందుకొనెదరు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అక్కడ లేనివాటిని కూడా ఉన్నట్టుగా రూపింపబడుతుంది. మీరు అందుకు సాక్షులై ఉందురు. మరియ యేసునకు జన్మనిచ్చెను. ఆమె ఈ లోకములోనికి తన ద్వారా దేవుని తీసుకొని రావడానికి సాక్షిగా ఉండెను.

నా ప్రియులారా, సర్వశక్తిగల దేవుని సేవకునిగాను మరియు దేవుని శక్తికి సాక్షులుగా ఉండునిమిత్తమై దేవుడు ఈ రోజున మిమ్మును సర్వోన్నతుడైన దేవునికి సాక్షులుగా చేయబోవుచున్నాడు. ఇతరులకు అద్భుతములను తీసుకొని వచ్చుటకు సాక్షులై ఉండునట్లుగా మిమ్మును చేస్తాడు. అయినప్పటికిని, అనేక ఫర్యాయములు దురాత్మ శక్తులు మీకు విరుద్ధముగా వాటి శక్తులను తీసుకొని వస్తుంటాయి, మిమ్మును బంధించడానికి, మిమ్మును బ్రద్ధలు చేయడానికి, మిమ్మును సంకెళ్లలో బంధించడానికి, ఈ లోకములో మీకు నిరీక్షణ లేదన్నట్లుగా చెప్పడానికై, అపవాది దొంగతనమును నాశనము మరియు హత్యచేయుటకును వచ్చును. కానీ, యేసు సమృద్ధి జీవమునిచ్చుటకు వచ్చును. ఇట్టి దురాత్మ శక్తిని బ్రద్ధలు చేయునిమిత్తము దేవుడు మీలోనికి తన పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చియున్నాడు. అవును, మీరు ఆయనను మీలోనికి స్వీకరించవచ్చును. ఆయన మీలోనికి వచ్చియున్నప్పుడు, యేసును ఉద్భవింప జేయు శక్తిని మీకిచ్చును. యేసును ఆనందించుటకును, దైవాశీర్వాదముల యొక్క సంపూర్ణతను మీ జీవితములో మీరు కలిగియుండునట్లుగా, యేసును ఉద్భవించు శక్తిని ఆయన మీకు అనుగ్రహించును.

మరియ బిడ్డయైన యేసును స్వీకరించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములను తనలో సంపూర్ణముగా కలిగియుండెను. ప్రతి ఆశీర్వాదము యేసులో దాచబడియున్నవి. పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా యేసు మీలో జనియించినప్పుడు సకల ఆశీర్వాదాలు ఆ రీతిగా యేసులో మరియు యేసు ద్వారా, మీలో జనియించును. ఈ రోజున ఆయన తన శక్తితో మిమ్మును నింపడానికి సిద్ధముగా ఉన్నాడు.

బిలాస్‌పూర్ నుండి వందన అను సహోదరి తన సాక్ష్యమును ఈలాగున పంచుకొనెను. ఆమె భయంకరమైన తలనొప్పితో బాధపడుచుండెను. తలతిరుగుడు, తలనొప్పి, అటువంటి సమస్యలతో ఆమె బాధపడుచుండెను. భర్త ఆమెను హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లెను. పరీక్షలన్నియు కూడా చేయించారు. వైద్యులకు కారణము తెలియలేదు. ఆమెకు వైద్యము అందించబడినది. కానీ ఆమె స్థితి ఇంకా దయనీయంగా మారినది. ఆ తర్వాత ఐసియులో ఆమెను చేర్పించారు. ఆ సందర్భములో ఆమె యేసు పిలుచుచున్నాడు కార్యక్రమమును ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ ద్వారా వీక్షించారు. వారుగానీ, మన నగరమునకు వచ్చినట్లయితే, ఎంత బాగుంటుంది అనుకున్నారు.

మహా అద్భుతంగా ఆమె నగరమైన అంబికాపూర్‌కు వస్తున్నట్లుగా ఆమె విన్నారు. ఆమె ఆ కూటాలకు పాల్గొనెను. మొదటి రాత్రి నొప్పి ఉన్న ప్రతివారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధి ఆమె మీదికి దిగివచ్చినది. ఆమె యొక్క తల నొప్పి మాయమై పోయినది. మరుసటి రోజు భాగస్థుల కూటము జరిగినది. ఆ కూటములో, సహోదరి ఇవాంజెలిన్ ప్రతిఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆ రీతిగా ప్రార్థన చేయుచుండెను. దేవుడు ప్రజల యొక్క నరములను స్వస్థపరచుచున్నాడు అని ఆమె తెలియజేసెను. ఆ సమయములో పరిశుద్ధాత్మ ఆమె మీదికి బలముగా దిగివచ్చెను. తలతిరుగుడు సమస్య అంతా ఆమెను విడిచిపోయినది. తల నొప్పి కూడా ఆమెను విడిచి వెళ్లిపోయినది. ఆమె సంపూర్ణంగా స్వస్థపరచబడెను. నూతనమైన జీవితము, ఆమె ఈ రోజు ప్రభువు కొరకు సాక్షిగా పనిచేయుచుండెను. ఆలాగుననే దేవుడు మిమ్మును కూడా నింపాలని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ధైర్యంగా ఉండండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపుతానని నీవు చేసిన వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మమ్మును మేము నీకు సమర్పించుకుంటున్నాము. దేవా, నీ కుమారుడైన ప్రభువైన యేసును మా హృదయంలో జన్మించునట్లు చేయుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించి, నీ శక్తి చేత మేము ఈ లోకములోనికి నీ వెలుగును ప్రకాశింపజేయునట్లుగా మమ్మును మార్చుము. యేసయ్యా, దయచేసి మమ్మును బంధించే ప్రతి చీకటి సంకెళ్లను నీ శక్తి ద్వారా బ్రద్ధలు చేయుము మరియు మా ఆత్మలో కోరికలను పునరుద్ధరించుము. యేసయ్యా, ఈ లోకానికి నీ మహిమకు సాక్షిగా నీ శక్తి మా ద్వారా ప్రవహించునట్లు చేయుము. ప్రభువా, క్రీస్తులో దాగివున్న ప్రతి ఆశీర్వాదం మా జీవితంలో వెల్లడి చేయబడి, అవి నెరవేరునట్లు కృపను చూపుము. దేవా, మేము కీడుకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడటానికి మరియు నీ ప్రేమ యొక్క సంపూర్ణతతో నడవడానికి మాకు ధైర్యాన్ని అనుగ్రహించుము. ప్రభువా, ఇతరులకు అద్భుతాలు, స్వస్థత మరియు ఆనందం నిచ్చు పాత్రగా మేము ఉపయోగించబడునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, మేము నీ పరిశుద్ధాత్మను స్వీకరించి, ఈరోజు నీ శక్తి మాలో పని చేస్తుందని విశ్వాసంతో ప్రకటించుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.