నా అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 15:19వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "యథార్థవంతుల యొక్క త్రోవ సమము చేయబడిన రహదారిగా ఉంటుంది'' అని చెప్పబడి ఉన్నది. మరొక తర్జుమాలో చూచినట్లయితే, "...యథార్థవంతుల త్రోవ రాజమార్గము'' అని చెప్పబడినట్లుగానే, మీరు యథార్థంగా నడుచుకోవాలనియు మరియు మీ మార్గము రాజమార్గముగా ఉండాలనియు ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీ జీవితాలను దేవునికి అప్పగించినప్పుడు, ఆయన మీతో కూడా నడుస్తాడు.

హైదరాబాద్‌కు చెందిన ప్రసన్న అనే సహోదరుడు ఈ సాక్ష్యాన్ని ఇలాగున పంచుకున్నారు. అతడు బ్యాంకులో ఉద్యోగము చేయుచున్నాడు. అతని ఉద్యోగములో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండెను. తద్వారా అతడు అత్యధికంగా ఒత్తిడికి లోనయ్యాడు. ఇది అతనిని నిరాశ మరియు ఆందోళనకు గురిచేసింది. అందును బట్టియే, వారి కుటుంబ జీవితములో భార్యభర్తలైన వారిద్దరి మధ్యలో అపార్థాలు వచ్చాయి. తద్వారా, వారిద్దరు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. అతని భార్య మేము విడిపోయి ఎవరికి వారు వ్యక్తిగతంగా జీవించాలనుకుంటున్నామని పోలీసులకు ఫిర్యాదు చేసినది. పోలీసుల యొద్దకు వెళ్లి, కేసును నమోదు చేశారు. అతడు తన 4 సంవత్సరాల చిన్న బిడ్డను తనే జాగ్రత్త వహించాలి. ఇందును బట్టియే, ఇతడు 9 సంవత్సరములగా చేయుచున్న తన ఉద్యోగమును కోల్పోయాడు. అతడు వీధుల వెంబడి పడ్డాడు. అది చూచిన అతని బంధువులు, స్నేహితులందరు, విడాకులు ఇచ్చి, దానిని నుండి బయటకు రమ్మని అతనికి సలహా ఇచ్చారు. అటువంటి సవాళ్లకరమైన సమయములోనే యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు అతడు వెళ్లాడు. ప్రార్థనా యోధులు అతనితో కలిసి ప్రార్థించారు. దేవుడు అతనికి మరల తాను ఒక నూతన ఉద్యోగమును తిరిగి అనుగ్రహించాడు. కానీ, కోర్టు కేసు మాత్రము ముగింపు కాలేదు. అది వాయిదాలు పడుట ద్వారా ఆ కేసు కొనసాగుచుండెను. అంతమాత్రమే కాకుండా, అతడు నిరంతర వాయిదాల తో ఒత్తిడి మరియు వేధింపులకు కారణమగుచుండెను. అటువంటి సమయములోనే, మేము కుటుంబ సమేతముగా ప్రవచనాత్మకమైన సదుస్సును నిర్వహించుచున్నాము అన్న విషయమును అతడు విని, ఆ సదస్సులో అతడు పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా, ఆ సదస్సులో అతడు పాల్గొనుటకు నమోదు చేసుకున్నాడు.

ఆ సదస్సులో నేను వ్యక్తిగతంగా అతని కొరకు ప్రార్థించాలని ఆశించి, ఆ సదస్సులో పాల్గొన్నాడు. కానీ, మా కుటుంబ సభ్యులందరి సందేశములను అతడు విన్నప్పుడు, గొప్ప నిరీక్షణ అతనిలోనికి వచ్చినది. ఏ విధంగా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలో అతడు నేర్చుకున్నాడు. ఆ నిరీక్షణ అతని హృదయాన్ని నింపినది. ఆలాగుననే ఆ సదస్సు చివరి రోజున నేను వారి మీద చేతులుంచినప్పుడు, దైవీకమైన శక్తి అతనిని నింపినది. వెనువెంటనే, అదే నెలలో, మహా అద్భుతమైన రీతిగా, అతని భార్య వారి యొక్క పాత వీడియోలను మరియు పాత సందేశాలు (ఎస్ఎమ్ఎస్)లు పంపించడానికి ప్రారంభించినది. ఇది అతనికి ఆశ్చర్యాన్ని కలిగించినది. ఆ తర్వాత ఆమె అతనికి ఫోన్ చేసినది, వారిద్దరు కలుసుకున్నారు. వారిద్దరు కలుసుకున్నప్పుడు, వారు ఒకరినొకరు క్షమాపణ అడుగుకుంటూ ఆ విధంగా వారిద్దరు ఏకమై సమాధానపరచబడ్డారు. ఆమె కోర్టుకు వెళ్లారు, నేను మరియు నా భర్త కలిసి జీవించాలని అనుకుంటున్నాము అని తెలియజేశారు. ఆ విధంగా, కోర్టు కేసు కూడ ముగిసిపోయినది. ఈ రోజు వారు సంతోషంగా జీవిస్తున్నాము అని తెలియజేశారు. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియ స్నేహితులారా, దేవుడు రాజరికపు త్రోవను మీకు అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. సహోదరుడు, ప్రసన్న ఏమని తెలియజేశాడనగా, ప్రార్థనా గోపురము ద్వారా ఇతరులకు నేను సేవా పరిచర్యను జరిగించాలని చెప్పాడు. కాబట్టి, దేవుడు " నిన్ను రాజరికపు మార్గములో నేను ఉంచాలని కోరుచున్నాను'' అని అంటున్నాడు. ఈ రోజు వారు కుటుంబ జీవితాన్ని మరియు వారి పనిని యేసుతో కూడ నడిచే అనుభూతి చెంది, ఆనందించుచున్నారు. నేడు ప్రియులారా, మీరు ఆలాంటి పరిస్థితులను కలిగి ఉండవచ్చు ను. నేడు మీ హృదయమును యేసు వైపునకు తెరవండి, దేవుడు మిమ్మును రాజరికపు మార్గములో నడుచునట్లు చేస్తాడు.

నా ప్రియులారా, దేవుడు మీ జీవితమును రాజ మార్గముగా చేయాలని మీ పట్ల కోరుచున్నాడు. మీ పనితో కూడా మరియు మీ కుటుంబముతో కూడా, మీరు రాజులకు రాజైన దేవునికి పరిచర్య చేయుచున్నప్పుడు, ఆయన మీ త్రోవను రాజమార్గముగా చేయుచున్నాడు. అవును, యేసు మీ చేయిని పట్టుకొని, మీతో కూడా నడుస్తున్నప్పుడు, అది రాజరికపు రహదారి మార్గముగా ఉంటుంది. ఈ రోజున మీరు వ్యక్తిగతంగా మీ పనిని, కుటుంబ సమయముతో కూడా, యేసుతో సమయమును గడపడానికి కృత నిశ్చయాన్ని చేసుకున్నప్పుడు యేసు మీతో కూడ నడుస్తాడు. మీ జీవిత మార్గములో దుఃఖకరమైన పరిస్థితులన్నిటిని కూడా ఆయన ఆనందమయముగా చేయుచున్నాడు. మీ దుఃఖమంతయు ఆనందమయముగా మార్చబడుతుంది. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ మార్గమును రాజమార్గముగా చేసి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, మా జీవిత మార్గాన్ని రాజమార్గంగా మారుస్తానని నీవు మా పట్ల చేసిన వాగ్దానానికై మేము నీకు కృతజఞతలు చెల్లించుచున్నాము. దేవా, ఈ రోజు, మేము పనిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా లేదా మేము ఎక్కడ ఉన్నా, ప్రతి ప్రాంతంలో నీకు సేవ చేయడానికి మా జీవితాన్ని నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మా కన్నీటి మార్గమును మా నుండి తొలగించండి. దేవా, మా విచారమును మరియు మా ఒత్తిడిని తొలగించి వేయుము. ప్రభువా, ఇతరులకు మమ్మును దీవెనకరముగా ఉండునట్లుగా మేము వాడబడుటకు మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, విడిచిపోయిన మా కుటుంబాలలో, మా బాంధవ్యములో సమాధానమును కలుగజేసి, మేము మా కుటుంబముగా కలిసి నీకు పరిచర్య చేయునట్లుగాను, మా పిల్లలు మరియు కుటుంబ సభ్యులు ఆశీర్వదింపబడునట్లు చేయుము. దేవా, మేము నీతో సన్నిహితంగా నడవడానికి మరియు ఎల్లప్పుడు నీ చిత్తప్రకారము నడుచుకొనునట్లుగా మేము నీకు సమయాన్ని ఎక్కువగా కేటాయించాలని కోరుకుంటున్నాము. ప్రభువా, ప్రార్థన ద్వారా నీ ప్రజలకు సేవ చేసే హృదయాన్ని దయచేసి మాకు అనుగ్రహించుము, తద్వారా మేము అనేకమందికి ఆశీర్వాదంగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, నీవు మా కొరకు చక్కగా ఏర్పాటు చేసిన రాజరికపు రహదారిపై మేము నీతో చేతులు కలిసి నడవడానికి మా సమర్పణలో మేము స్థిరంగా నిలబడి ఉండునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.